అన్వేషించండి

BheemlaNayak: 'భీమ్లానాయక్' సినిమా, బుక్ మై షోలో లేదుగా 

పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లానాయక్' సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో ఆ సినిమా బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయా..? అని బుక్ మై షో యాప్ వంక చూస్తూనే ఉన్నారు జనాలు.

ఒకప్పుడు థియేటర్లలో కొత్త సినిమా రిలీజైతే గంటల తరబడి క్యూలో నిలబడి టికెట్లు కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్ వచ్చిన తరువాత అందరూ అందులోనే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. అయితే కన్వీనియెన్స్ ఫీజు అనేది ఉంటుంది. దీనికోసం టికెట్ రేటు కంటే అదనంగా కొంత డబ్బుని చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆన్ లైన్ టికెటింగ్ కోసం ఎన్ని యాప్స్ ఉన్నా.. బుక్ మై షో మాత్రం బాగా క్లిక్ అయింది. 

దాదాపు అందరి ఫోన్లలో బుక్ మై షో యాప్ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లానాయక్' సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో ఆ సినిమా బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయా..? అని బుక్ మై షో యాప్ వంక చూస్తూనే ఉన్నారు జనాలు. కానీ ఇప్పుడు నిర్మాతల ఆలోచన మారినట్లు తెలుస్తోంది. నైజాంలో ఈ సినిమాను దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్, ఎగ్జిబిట‌ర్, ప్రొడ్యూస‌ర్ సునీల్ నారంగ్.. ఇత‌ర డిస్ట్రిబ్యూట‌ర్లతో క‌లిసి బుక్ మై షోను బ‌హిష్క‌రించాల‌ని నిర్ణయించినట్లు టాక్. 

'భీమ్లానాయక్' సినిమాను నైజాంలో ఇప్పటికే ఒక థియేటర్ కు బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ చేసి.. ఆ తరువాత తీసేశారు. ప్రస్తుతానికి బుక్ మై షోలో 'భీమ్లానాయక్' సినిమా అందుబాటులో లేదు. ఈ విషయం గురించి సునీల్ నారంగ్ మీడియాతో మాట్లాడారు. బుక్ మై షోను తామే ప్రమోట్ చేసి పాపులర్ అవ్వడానికి కారణమయ్యామని.. ఇప్పుడు అది దయ్యంలాగా మారిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. 

కన్వీనియెన్స్ ఫీ పేరుతో టికెట్ మీద 20 నుంచి 40 రూపాయల వరకు వసూలు చేస్తుండడం.. ప్రేక్షకులకు భారంగా మారిందని అన్నారు. ఆ కారణంగానే చాలా మంది థియేటర్లకు రావడం లేదని చెప్పారు. కన్వీనియెన్స్ ఫీ తగ్గించాలని డిస్ట్రిబ్యూటర్లు కోరినప్పటికీ.. బుక్ మై షో వాళ్లు అంగీకరించకపోవడంతో 'భీమ్లానాయక్' లాంటి పెద్ద సినిమాను బుక్ మై షోకి ఇవ్వకుండా థియేటర్ల దగ్గరే టికెట్స్ అమ్మాలని భావిస్తున్నారట. అయితే ఇంత పెద్ద సినిమాకి థియేటర్ల దగ్గర టికెట్లు అమ్మితే.. బ్లాక్ టికెట్స్ దందా పెరిగే ఛాన్స్ ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sithara Entertainments (@sitharaentertainments)

టాప్ హెడ్ లైన్స్

Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Tejaswini Nandamuri Tollywood Debut : సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Embed widget