అన్వేషించండి

Bhediya Trailer: మనిషి తోడేలుగా మారితే? ఆకట్టుకుంటున్న ‘భేడియా’ తెలుగు ట్రైలర్‌!

వరుణ్ ధావన్ తాజా సినిమా ‘భేడియా’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. ఆద్యంతం ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో ఆకట్టుకుంటున్నది.

వరుణ్ ధావన్, కృతిసనన్ హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా సినిమా ‘భేడియా’. అమర్ కౌళిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా యూనిట్ వరుస అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నది.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆద్యంతం ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో  అత్యంత ఆసక్తికరంగా ఉంది.   

తోడేలుగా వరుణ్ ధావన్

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’, ‘బద్లాపూర్‌’, ‘స్ట్రీట్ డ్యాన్సర్’ సహా పలు అద్భుత సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ ధావన్. తొలి నుంచి కథా బలం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తుస్తున్నాడు. జయాపజయాలతో పని లేకుండా హిందీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. కొంత కాలంగా ఈయన నటించిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదు. ఓ భారీ హిట్ తో మళ్లీ ట్రాల్ లోకి రావాలి అనుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన తాజా సినిమా ‘భేడియా’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  హిందీలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. తోడేలు కరవడంతో వరుణ్ తోడేలు మాదిరిగానే మారిపోతుంటాడు. తోడేలుగా  మారిన తర్వాత వరుణ్‌ తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమాను తెరెక్కించినట్లు ఇందులో తెలుస్తున్నది.

తోడేలు కరిచిన దగ్గర నుంచి వరుణ్ రాత్రిపూట తోడేలుగా మారిపోతుంటాడు. పగటి వేళల్లో జరిగే ఘటనలను గుర్తు చేసుకుని భయంతో వణికిపోతుంటాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విపరీతమైన ఆసక్తి  కలిగించింది. కామెడీ హార్రర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను మడాక్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై దినేష్ విజయ్‌  నిర్మిస్తున్నాడు.  దినేష్ విజన్‌.. హార్రర్‌ కామెడీ యూనివర్స్‌ లో మూడో ఇన్‌స్టాల్‌మెంట్‌ గా ఈ చిత్రం రూపొందింది. గతంలో ఈ యూనివర్స్‌ లో తెరకెక్కిన ‘స్త్రీ’, ‘రూహీ’ సినిమాలు అద్భుత విజయాన్ని అందుకున్నాయి.   

టాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నం

బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ లోనూ మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే, హిందీతో పాటు తెలుగులోనూ ఆయన సినిమాలను విడుదల చేస్తున్నారు. గతంలో  ‘క్రిష్‌’ సిరీస్‌, ‘ధూమ్‌-3’, ‘డర్టీ పిక్చర్‌’ లాంటి పలు సినిమాలు తెలుగులో విడుదల అయ్యాయి. తాజాగా రణ్‌బీర్‌  నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వరుణ్ ధావన్ తాజా సినిమా ‘భేడియా’ కూడా తన లక్ పరీక్షించుకోడానికి తెలుగులోకి అనువాదమై వస్తోంది. మరి, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారో.. లేదో చూడాలి. 

Read Also: ‘బాహుబలి-2’లోని ఆ సీన్‌ను దించేసిన ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్’ వెబ్ సీరిస్, ఇండియన్ డైరెక్టర్ పనే!

‘బేడియా’ ట్రైలర్‌ను ఇక్కడ చూడండి:

టాప్ హెడ్ లైన్స్

418 Movie OTT : ఆ ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 418 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 418 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Nindu Manasulu Serial Today October 23rd: నిండు మనసులు: ప్రేరణలో మార్పు! తల పట్టుకున్న సిద్ధూ, ఇందిర! నిజం చెప్పేస్తుందా!
నిండు మనసులు: ప్రేరణలో మార్పు! తల పట్టుకున్న సిద్ధూ, ఇందిర! నిజం చెప్పేస్తుందా!
Godavari Serial Today October 23rd: 'గోదావరి' సీరియల్: జాను, సంజయ్‌ల ఫస్ట్‌నైట్! అగ్రిమెంట్ పక్కన పెట్టేసి కలిసిపోయారుగా!
'గోదావరి' సీరియల్: జాను, సంజయ్‌ల ఫస్ట్‌నైట్! అగ్రిమెంట్ పక్కన పెట్టేసి కలిసిపోయారుగా!
Reality Bhaja Govindam Song : భజ గోవిందం... బరువే కాదేక్షణం - కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' ఫస్ట్ సాంగ్... హార్ట్ టచింగ్ లిరిక్స్
భజ గోవిందం... బరువే కాదేక్షణం - కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' ఫస్ట్ సాంగ్... హార్ట్ టచింగ్ లిరిక్స్

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
Rachamallu Siva Prasada Reddy : ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
AP Inter Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
Telangana Graduate MLC Polls : ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
TDP Leader Car Fire: చంద్రగిరిలో టీడీపీ నేత కారుకు నిప్పు.. ఇది వైసీపీ కార్యకర్తల పనేనని ఆరోపణలు
చంద్రగిరిలో టీడీపీ నేత కారుకు నిప్పు.. ఇది వైసీపీ కార్యకర్తల పనేనని ఆరోపణలు
Toilet Paper Health Risks : టాయిలెట్ పేపర్ వాడటం మంచిదేనా? చర్మ సమస్యల నుంచి కెమికల్స్ వరకు.. పూర్తి వివరాలు ఇవే
టాయిలెట్ పేపర్ వాడటం మంచిదేనా? చర్మ సమస్యల నుంచి కెమికల్స్ వరకు.. పూర్తి వివరాలు ఇవే
చాణక్య నీతి: మీ స్నేహితుడు నిజమైనవాడేనా? ఈ 5 పరీక్షలతో తెలుసుకోండి!
చాణక్య నీతి: మీ స్నేహితుడు నిజమైనవాడేనా? ఈ 5 పరీక్షలతో తెలుసుకోండి!
ఏడు చేపల కథ తెలుసుకదా మీకు..అందులో దాగిన ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా మరి?
ఏడు చేపల కథ తెలుసుకదా మీకు..అందులో దాగిన ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా మరి?
Embed widget