అన్వేషించండి

Bharateeyudu 2 Intro: భారతీయుడు ఈజ్ బ్యాక్, వావ్ అనిపిస్తున్న సేనాప‌తి రీ ఎంట్రీ

లోక నాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘భార‌తీయుడు 2’. తాజాగా ఈ సినిమా తెలుగు ఇంట్రో గ్లింప్స్‌ ను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు.

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘భార‌తీయుడు 2’.  అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్, ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతోంది. కమల్, శంకర్ కాంబినేష‌న్‌లో 1996లో విడుద‌లైన, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భార‌తీయుడు’గా తెలుగులో విడుదల చేశారు. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘భార‌తీయుడు 2’ ప్రేక్షకుల ముందకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇంట్రో గ్లింప్స్‌ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. తెలుగులో ఈ గ్లింప్స్‌ ను దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి రిలీజ్ చేశారు.

వీర‌శేఖ‌రన్ సేనాప‌తి ఈజ్ బ్యాక్

‘భార‌తీయుడు 2’ ఇంట్రో గ్లింప్స్‌ ప్రేక్షకులను ఓరేంజిలో ఆకట్టుకుంటోంది. ‘ భార‌తీయుడు’లో లంచానికి వ్య‌తిరేకంగా పోరాడిన వీర‌శేఖ‌రన్ సేనాప‌తి, ఇండియాలో మ‌ళ్లీ త‌ప్పు జ‌రిగితే తాను తిరిగి వ‌స్తాన‌ని చెప్ప‌టంతో క‌థ ముగిసింది.  ఇప్పుడు మ‌ళ్లీ దేశంలో లంచ‌గొండిత‌నం పెరిగిపోతోంది. లంచం లేనిదే అధికారులు ఎవ‌రూ ఏ ప‌నులు చేయ‌టం లేదు. దీంతో సామాన్యుడు బ‌త‌క‌ట‌మే క‌ష్టంగా మారింది. ఈ నేపథ్యంలో భార‌తీయులంద‌రూ ‘క‌మ్ బ్యాక్ ఇండియ‌న్’ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మ‌ళ్లీ దేశంలోకి ‘భార‌తీయుడు’ అడుగు పెట్టాల‌ని కోరుతారు. చివ‌ర‌కు వీర‌శేఖ‌ర‌న్ సేనాప‌తి ఇండియాలోకి అడుగు పెడ‌తారు. వ‌చ్చిన త‌ర్వాత సేనాప‌తి ఏం చేశారు? భార‌తీయుడుకి భ‌య‌ప‌డి లంచాలు మానేసిన అధికారులు మ‌ళ్లీ లంచాలు తీసుకోవ‌టానికి కార‌ణం ఎవ‌రు? లంచం వ‌ల్ల దేశంలో ఎలాంటి అల్ల‌క‌ల్లోలాలు జ‌రిగాయి? అనే విష‌యాల‌ను ఈ గ్లింప్స్‌ లో చాలా అద్భుతంగా చూపించారు దర్శకుడు శంక‌ర్‌.  

స్టార్ హీరోల చేతుల మీదుగా గ్లింప్స్‌ విడుదల

ఈ  గ్లింప్స్‌ లో క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు హీరో సిద్ధార్థ్‌, ప్రియా భవానీ శంక‌ర్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహా సహా పలువురు నటీనటులు కనిపించారు. సినిమా మేకింగ్‌ను ఇండియన్ సినిమా పరిశ్రమలో ఓ రేంజికి తీసుకెళ్లిన దర్శకుడు శంకర్ ఈసారి ‘భార‌తీయుడు 2’ మూవీతో మరెన్ని సంచనాలు నమోదు చేస్తారో చూడాలి.  ఇక ఇంట్రో గ్లింప్స్‌ ను త‌మిళంలో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌, హిందీలో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ అమీర్ ఖాన్‌, మ‌ల‌యాళంలో ప్రముఖ నటుడు మోహ‌న్ లాల్‌, క‌న్న‌డ‌లో కిచ్చా సుదీప్  విడుద‌ల చేశారు.

 ర‌వివ‌ర్మ‌న్  సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ‘భారతీయుడు 2’  చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు.  భారీ బ‌డ్జెట్‌, హైటెక్నిక‌ల్ వ్యాల్యూస్‌తో ‘భార‌తీయుడు 2’ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాస్క‌ర‌న్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా  నిర్మిస్తున్నారు.

Read Also: సెన్సార్ అనేది అవుట్ డేటెడ్ సిస్టమ్, చట్టప్రకారం ‘వ్యూహం’ విడుదల అవుతుంది: ఆర్జీవీ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Series Trailer : మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ - అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ శ్రీకాంత్... స్పెషాలిటీ ఏంటంటే?
మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ - అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ శ్రీకాంత్... స్పెషాలిటీ ఏంటంటే?
Jana Nayakudu Review - 'జన నాయకుడు' రివ్యూ: 'భగవంత్ కేసరి' రీమేకేనా? విజయ్ సినిమా ఎలా ఉందంటే?
'జన నాయకుడు' రివ్యూ: 'భగవంత్ కేసరి' రీమేకేనా? విజయ్ సినిమా ఎలా ఉందంటే?
Nindu Manasulu Serial Today July 23rd: నిండు మనసులు: రేపటి నుంచి గణ 2.0..! తల్లిలా చూసుకుంటా అన్న ఇందిరకు గణ చెప్పిన సమాధానం ఏంటి?
నిండు మనసులు: రేపటి నుంచి గణ 2.0..! తల్లిలా చూసుకుంటా అన్న ఇందిరకు గణ చెప్పిన సమాధానం ఏంటి?
Jana Nayagan Live Updates - 'జన నాయకుడు' లైవ్ అప్డేట్స్: సీన్ టు సీన్... విజయ్ సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
'జన నాయకుడు' లైవ్ అప్డేట్స్: సీన్ టు సీన్... విజయ్ సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి

వీడియోలు

Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Embed widget