అన్వేషించండి

Bhagavanth Kesari Day 3 Collections: బాక్సాఫీస్ దగ్గర ‘భగవంత్ కేసరి‘ జోష్, మూడో రోజు కలెక్షన్స్ ఎంతంటే?

బాలయ్య మూవీ ‘భగవంత్ కేసరి‘ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. మూడో రోజు వసూళ్ల పరంగా ఆకట్టుకుంది. మూడో రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.71.02 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది.

నందమూరి నటసింహం బాలయ్య నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎదిగే వయసు అమ్మాయిలకు ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశానికి మాస్ ఎలిమెంట్స్ జోడించారు. ఈ సినిమా తొలి రోజు నుంచే మంచి టాక్ సంపాదించుకుంది. తొలి రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

భారీగా పెరిగిన షో ఆక్యుపెన్సీ

ఇక రెండో రోజుతో పోల్చితే మూడో రోజు వసూళ్లు పరంగా ‘భగవంత్ కేసరి’ అదుర్స్ అనిపించింది. అన్ని చోట్లా ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. పెద్ద మొత్తంలో షో ఆక్యుపెన్సీ పెరిగింది. మూడో రోజు మార్నింగ్ ఆక్యుపెన్సీ 33.87 శాతంగా ఉండగా, మధ్యాహ్నం వరకు 48.60 శాతానికి పెరిగింది. ఈవినింగ్ 56.85 కాగా, నైట్ 63.04 శాతం నమోదు అయ్యింది.   

మూడు రోజుల్లో ​రూ.71.02 కోట్ల గ్రాస్ వసూళు

మూడు రోజుల్లో ‘భగవంత్ కేసరి’ వరల్డ్​ వైడ్​గా గ్రాస్​ రూ.71.02 కోట్లు సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది. మూడో రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 10.65 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలిపింది. మూడు రోజుల్లో తెలంగాణ, ఏపీలో రూ. 38.37 కోట్లు గ్రాస్ వసూళు అయినట్లు తెలిపింది. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాలను పరిశీలిస్తే,  నైజాంలో రూ. 3.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.45 కోట్లు, ఏపీలో రూ.4.30 మొత్తంగా 10.65 కోట్ల షేర్ వచ్చింది. ఏపీలో వైజాగ్​లో రూ.1.01కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 72 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, గుంటూరులో రూ. 75 లక్షలు, కృష్ణాలో రూ. 68 లక్షలు, నెల్లూరులో రూ.59 లక్షలు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.  ప్రపంచవ్యాప్తంగా మూడో రోజు రూ. 19.90 కోట్ల గ్రాస్ వసూళు అయ్యింది. దేశ వ్యాప్తంగా  తొలి రోజు రూ.16.6కోట్లు,  రెండో రోజు రూ. 7 కోట్లు, మూడో రోజు రూ.7.75 కోట్ల నెట్​ కలెక్షన్స్ సాధించింది.     

‘భగవంత్ కేసరి’ మూవీలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. అర్జున్ రాంపాల్ విలన్‌‌ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో శ్రీ లీల బాలయ్య కూతురుగా నటించింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్​లో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్​గా రూపొందిన ఈ చిత్రంలో మహిళల గురించి చర్చించిన తీరుపై విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాకు థమన్ అదిరిపోయే మ్యూజిక్‌ను ఇచ్చారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

Read Also: 3 భాగాలుగా ‘మహా భారతం‘- బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలన నిర్ణయం

 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget