అన్వేషించండి

Bedurulanka 2012 Teaser : సిగరెట్‌ను మించిన కిక్, వాటే కంటెంట్ - 'బెదురులంక 2012' టీజర్ వచ్చిందిరోయ్ 

Kartikeya Gummakonda Neha Shetty's Bedurulanka 2012 Teaser : 'ఆర్ఎక్స్ 100' హీరో కార్తికేయ, 'డీజే టిల్లు' భామ నేహా శెట్టి జంటగా నటిస్తున్న 'బెదురులంక 2012' సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది.

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) నటించిన చిత్రం 'బెదురులంక 2012'. ఇందులో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. ఈ రోజు పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ ఈ సినిమా టీజర్ విడుదల చేశారు (Teaser launched by Vijay Devarakonda). 

టీజర్ ఎలా ఉందనేది చూస్తే...డిసెంబర్ 31, 2012లో యుగాంతం వస్తుందని అందమైన గోదావరి తీరంలోని ఓ పల్లెలో ప్రజలు ఏం చేశాడనేది 'బెదురులంక 2012' కథ. హీరో కార్తికేయ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. హీరోయిన్ నేహా శెట్టి సైతం లంగా ఓణీలు, సాంప్రదాయ దుస్తుల్లో ముద్దొచ్చేలా ఉన్నారు. 'నేనొక మాస్టర్ ప్లాన్ చెబుతాను... విను' అని అజయ్ ఘోష్ ఒక డైలాగ్ చెప్పారు. బైబిల్, భగవద్గీతను కూడా ఆయన వాడేశారు. ఎలా? అది ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. 

'నా కోసం సిగరెట్ మానేస్తావా? లేదా?' అని కార్తికేయను నేహా శెట్టి అడిగితే... 'దీనిని మించిన కిక్ ఏదైనా నాకు దొరికితే అప్పుడు మానేస్తా' అని బదులు ఇస్తారు. ఆ కిక్ లిప్ లాక్ అని ఇన్ డైరెక్టుగా చెప్పారు. ఆ తర్వాత కిక్ కావాలంటూ అమ్మాయి వెంట పడటం రొమాంటిక్ గా ఉంది. కంటెంట్ అండ్ కామెడీ ఉన్న సినిమా అని టీజర్ చూస్తే తెలుస్తోంది. 

Also Read : 'పాప్ కార్న్' రివ్యూ : ప్రేమ కథకు డైపర్ వేశారుగా - అవికా గోర్ సినిమా ఎలా ఉందంటే?

యుగాంతం వస్తే? ఓ పల్లెటూరి, గోదావరి లంక గ్రామంలోని ప్రజలు ఏం చేశారు? అనే కథాంశంతో 'బెదురులంక 2012' రూపొందింది. క్లాక్స్ దర్శకత్వంలో సి. యువరాజ్ సమర్పణలో బెన్నీ ముప్పానేని (రవీంద్ర బెనర్జీ) నిర్మిస్తున్నారు. ఆయన లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణ సంస్థలో మూడో చిత్రమిది. 'కలర్ ఫోటో' చిత్రాన్ని నిర్మించింది ఆయనే. 

ఉగాదికి 'బెదురులంక'!
ఉగాది సందర్భంగా మార్చి 22న 'బెదురులంక 2012'ను విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారట. ఉగాది బుధవారం వచ్చింది. ఆ రోజు సెలవు ఉంటుంది. ఆ తర్వాత కూడా ప్రేక్షకులు ఫెస్టివల్ మూడ్ లో ఉంటారు. బుధ, గురు తర్వాత శుక్ర, శని, ఆది వారాలు వీకెండ్. అంటే... లాంగ్ వీకెండ్ మీద ఈ సినిమా కన్నేసింది.

Also Read : 'అమిగోస్' రివ్యూ : కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

విశాలమైన గోదావరి... నది తీరమంతా పచ్చటి కొబ్బరి చెట్లు... బండి మీద 'రయ్ రయ్...' మంటూ దూసుకు వెళుతున్న హీరో కార్తికేయ... చక్కటి లంగా ఓణీలో హీరోయిన్ నేహా శెట్టి... సుమారు నిమిషం నిడివి గల టీజర్‌లో కార్తికేయ, నేహా శెట్టి మధ్య ప్రేమతో పాటు అజయ్ ఘోష్, రాజ్ కుమార్ బసిరెడ్డి, గోపరాజు రమణ, 'ఆటో' రాంప్రసాద్ క్యారెక్టర్లను కూడా దర్శకుడు క్లాక్స్ పరిచయం చేశారు. ఊరిలో జనాలంతా యుగాంతం వస్తుందని ఎంజాయ్ చేసే తీరు నవ్వించేలా ఉంది.

అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ఛాయాగ్రహణం : సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు & సన్నీ కూరపాటి, నృత్యాలు : బృంద, మోయిన్, సంగీతం : మణిశర్మ, సహ నిర్మాతలు : అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ : సి. యువరాజ్, నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం : క్లాక్స్.

టాప్ హెడ్ లైన్స్

Garividi Lakshmi Review - 'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
Sunday OTT Movies : సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
AK47 Second Single: అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget