అన్వేషించండి

Ban Adipurush:‘ఆదిపురుష్‌’ని నిషేధించండి, నిర్మాతలపై కేసు పెట్టండి, ప్రధాని మోదీకి లేఖ రాసిన సినీ కార్మికుల సంఘం

‘ఆదిపురుష్’ సినిమా విడుదలైనప్పటి నుంచి పలు వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా ఈ మూవీని నిషేధించడంతో పాటు నిర్మాతలపై కేసు నమోదు చేయాలని కోరుతూ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని మోదీకి లేఖ రాసింది.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రం అభిమానులను అలరించడంలో విఫలం అయ్యింది. రామాయణం ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని భావించారు. కానీ, ఈ చిత్రం విడుదలైనప్పటి తీవ్ర నిరసనలను ఎదుర్కొంటుంది. పలువురు ఈ సినిమాపై విమర్శలు చేశారు.  డైలాగ్స్‌ నుంచి వీఎఫ్‌ఎక్స్‌ వరకు అన్నింటిపైనా సినీ ప్రేక్షకుల నుంచి నెగిటివ్‌ రివ్యూలే ఇస్తున్నారు.  నేపథ్యంలో తాజాగా మరో కొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఈ సినిమాపై నిషేధం విధించాలని కోరుతున్నారు.

‘ఆదిపురుష్’నిషేధించాలని సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్

ప్రభాస్, కృతి సనన్ నటించిన పౌరాణిక ఇతిహాసానికి మరో తలనొప్పి ఎదురయ్యింది. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఏకంగా ఈ సినిమాను నిషేధించడంతో పాటు చిత్ర నిర్మాతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. ఆదిపురుష్’ సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని కోరింది. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఈ సినిమా రాకుండా నిషేధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని జోక్యం చేసుకోవాలిన అభ్యర్థించింది. అంతేకాదు, దర్శకుడు ఓ రౌత్ తో పాటు డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా, చిత్ర నిర్మాతలపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

లేఖలో ప్రధానిని ఏం కోరారంటే?

“‘ఆదిపురుష్’ సినిమా స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాముడు, హనుమంతుడిని కించపరిచేలా ఉన్నాయి.  ఈ సినిమా హిందువులు, సనాతన ధర్మం, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ప్రభు శ్రీరాముడు భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ దేవుడు. ఈ చిత్రంలో పలు డైలాగులు చాలా చౌకబారుగా ఉన్నాయి. ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు ఒక వీడియో గేమ్ పాత్రలా కనించారు. రావణుడి గెటప్ కూడా చాలా దారుణంగా ఉంది. భారతీయ సినిమా చరిత్రలో ఇంతటి అవమానకరమైన సినిమాలో నటుడు ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ భాగం కావడం బాధాకరం. ‘ఆదిపురుష్’ సినిమా శ్రీరాముడు, రామాయణంపై మనకున్న విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ప్రజల్లోకి తప్పుడు సంకేతాను తీసుకు వెళ్తోంది. అందుకే, ఈ సినిమాను వెంటనే నిషేధించడంతో పాటు చిత్ర నిర్మాతలపై కేసు నమోదు చేయాలి” అని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖలో రాసింది.

రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్’. కనీవినీ ఎరుగని అంచనాల నడుమ ఈ నెల 16న విడుదల అయ్యింది.  తొలి షో నుంచే మిశ్రమ స్పందన లభించింది. సినిమా చాలా బాగుందని కొందరు చెప్తే, అస్సలు బాగాలేదని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు . సినిమాపై మొదటి నుంచి ఉన్న భారీ అంచనాలను అందుకోవడం ఈ సినిమా విఫలం అయ్యింది. ప్రధానంగా పేలవమైన VFX, చవకైన డైలాగ్‌లు, రామాయణం ఇస్లాంమీకరణ సహా పలువు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టి-సిరీస్ నిర్మించింది. 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందించారు. చిత్రంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించాడు. బాలీవుడ్ నటి కృతి సనన్ జానకి పాత్రను పోషించింది.  సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించాడు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటించాడు.

Read Also: చిరంజీవి ఇంట పుట్టింది సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ, మెగా ప్రిన్సెస్ జాతకంపై పండితుల అభిప్రాయం ఇదే!

టాప్ హెడ్ లైన్స్

Ranabaali Teaser Review : శింగనమల బొబ్బిలి... రణబాలి - బ్రిటిష్ దొరల తలలు తెంచే వారియర్‌ వచ్చేశాడు
శింగనమల బొబ్బిలి... రణబాలి - బ్రిటిష్ దొరల తలలు తెంచే వారియర్‌ వచ్చేశాడు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి పేరు మీద ఆస్తి రాసేసిన విహారి! అంబిక ప్లాన్ బీ కూడా ఫెయిలా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి పేరు మీద ఆస్తి రాసేసిన విహారి! అంబిక ప్లాన్ బీ కూడా ఫెయిలా!
Veerabhadruni Rahasyam Part 2 OTT : వీరభద్రుని ఆలయం మిస్టరీ రివీల్ అవుతుందా? - ఓటీటీలోకి పార్ట్ 2 స్ట్రీమింగ్
వీరభద్రుని ఆలయం మిస్టరీ రివీల్ అవుతుందా? - ఓటీటీలోకి పార్ట్ 2 స్ట్రీమింగ్
Kavya Shree: 'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా
'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన
Apple Event: నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
BRS MLAs: మగ పోలీసులు మాపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
మగ పోలీసులు మాపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
Lust Stories 3 Trailer : బోల్డ్ అంథాలజీ లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్ విత్ కామెడీ డైలాగ్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
బోల్డ్ అంథాలజీ లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్ విత్ కామెడీ డైలాగ్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
కైనెటిక్ స్కూటర్లకు బిగ్ అప్‌గ్రేడ్.. కొత్త బ్యాటరీతో ఇప్పుడు ఏకంగా 132 కి.మీ. రేంజ్!
కైనెటిక్‌ స్కూటర్ల కెపాసిటీ పెరిగింది, ఇప్పుడు సింగిల్‌ ఛార్జ్‌తో 132km రేంజ్‌!
Deepika Padukone Baby Bump: కడుపులో ఓ బిడ్డ... కళ్ళముందు మరో బిడ్డ... భర్తతో దీపిక... వైరల్ బేబీ బంప్ & బర్త్‌డే ఫోటోషూట్
కడుపులో ఓ బిడ్డ... కళ్ళముందు మరో బిడ్డ... భర్తతో దీపిక... వైరల్ బేబీ బంప్ & బర్త్‌డే ఫోటోషూట్
పితృ పక్షంలో పెళ్లి షాపింగ్ చేయాలా , వాయిదా వేయాలా?
పితృ పక్షంలో పెళ్లి షాపింగ్ చేయాలా , వాయిదా వేయాలా?
Embed widget