అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

Nandamuri Balakrishna: ఆయన వద్దన్నా డూప్ లేకుండా చేశా, ‘లెజెండ్‌‘లో ఆ యాక్షన్ సీన్‌పై బాలయ్య కామెంట్స్

బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ ‘లెజెండ్‘ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బోయపాటి తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించింది. తాజాగా ఈ సినిమా గురించి బాలయ్య ఆసక్తికర విషయాలు చెప్పారు.

Nandamuri Balakrishna About Legend Movie: దశాబ్దం కిందట విడుదలైన సూపర్ డూపర్ హిట్ మూవీ ‘లెజెండ్’. నటసింహం బాలకృష్ణ హీరోగా, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. జగపతి బాబు విలన్‌గా, సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టే హీరోయిన్లుగా ఇందులో నటించారు. ‘సింహా’ లాంటి అద్భుత విజయం తర్వాత బాలయ్య, బోయపాటి కాంబోలో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది.

ఆ సీన్ డూప్ లేకుండా చేశా: బాలయ్య

మార్చి 28తో ఈ సినిమా విడుదలై దశాబ్దం పూర్తయ్యింది. ఈ సందర్భంగా చిత్రబృందం ఓ ఈవెంట్ ను నిర్వహించింది. ఇందులో హీరో బాలయ్య, హీరోయిన్ సోనాల్ చౌహాన్, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు నిర్మాతలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ సినిమా ఓ ఫైట్ ను డూప్ లేకుండా చేసినట్లు చెప్పారు. దర్శకుడు కచ్చితంగా డూప్ ఉండాలని చెప్పినా, పట్టుబట్టి తానే ఆ యాక్షన్ సీన్ కంప్లీట్ చేసినట్లు తెలిపారు.

‘లెజెండ్’ సినిమాలో వైజాగ్‌లో బాలయ్య ఫైట్ సీన్ ఉంటుంది. బీచ్ రోడ్‌లో బాలయ్య గుర్రం మీద వెళ్తూ చేసే సన్నివేశం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ఈ సీన్‌లో బాలయ్య గుర్రంతో పాటు ఓ అద్దాన్ని పగలగొట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ సీన్ చేస్తే బాలయ్యకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని దర్శకుడు బోయపాటి డూప్ పెట్టాలి అనుకున్నారట. అదే విషయాన్ని బాలయ్యకు చెప్పారట. కానీ, ఆయన ఏమాత్రం ఒప్పుకోలేదట. కచ్చితంగా ఆ సీన్ తానే చేస్తానని చెప్పారట. అనుకున్నట్లుగానే ఈ సీన్ అద్భుతంగా వచ్చిందని  బాలయ్య వెల్లడించారు.  

బాలయ్యతో బోయపాటి హ్యాట్రిక్ మూవీస్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి కాంబినేషన్‌లో మూడు సినిమాలు తెరకెక్కాయి. అన్ని సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. వీటిలో ‘సింహ’ సినిమా 2010లో రాగా, ‘లెజెండ్’ 2014లో విడుదల అయ్యింది. ‘అఖండ’ చిత్రం 2021లో విడుదల అయ్యింది. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. భారీగా వసూళ్లు సాధించడంతో పాటు పలు రికార్డులను నెలకొల్పాయి. వీరిద్దరి కాంబినేషన్ లో మళ్లీ సినిమాలు రావాలని బాలయ్య అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే మూడు హిట్లు అందుకున్న ఈ కాంబో, మరోసారి రికార్డుల మోత మోగించాలని ఆకాంక్షిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘NBK109’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read Also: సుహాస్‌తో జోడీ కడుతోన్న ‘జో’ బ్యూటీ - ‘ఓ భామ అయ్యో రామా’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today May 4th: ఇంటి నుంచి వెళ్లిపోయిన కన్నా ఎక్కడ దొరికాడు..? కన్నాపై మహాలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి...?
పొదరిల్లు:ఇంటి నుంచి వెళ్లిపోయిన కన్నా ఎక్కడ దొరికాడు..? కన్నాపై మహాలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి...?
Illu Illalu Pillalu Serial Today may 4th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఇంటి నుంచి వెళ్లిపోతున్న సాగర్! రామరాజు అవమానం చేయడమే కారణమా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఇంటి నుంచి వెళ్లిపోతున్న సాగర్! రామరాజు అవమానం చేయడమే కారణమా!
Trisha Krishnan : తిరుమలలో త్రిష - రిజల్ట్ పక్కా మనదే మేడమ్... సౌత్ క్వీన్ రియాక్షన్ వైరల్
తిరుమలలో త్రిష - రిజల్ట్ పక్కా మనదే మేడమ్... సౌత్ క్వీన్ రియాక్షన్ వైరల్
Peddi Trailer : రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్! - సర్‌ప్రైజెస్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్! - సర్‌ప్రైజెస్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైల్డ్ గానే వైసీపీ సోషల్ మీడియా పంథా - మార్పు రాని దండయాత్ర ధోరణి!
వైల్డ్ గానే వైసీపీ సోషల్ మీడియా పంథా - మార్పు రాని దండయాత్ర ధోరణి!
Assembly Election Results 2026 Live Updates: 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. పార్టీల మధ్య రేసు మొదలైంది.. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. పార్టీల మధ్య రేసు మొదలైంది.. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
Telangana Revenue: ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
Woman in Muscat: కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
KTR Meeting With Saranya: ఆరేళ్ల కిందట చేసిన సాయం.. నేడు వెలుగై ఎదురొచ్చింది! కేటీఆర్ కళ్లు చెమర్చిన వేళ..!
ఆరేళ్ల కిందట చేసిన సాయం.. నేడు వెలుగై ఎదురొచ్చింది! కేటీఆర్ కళ్లు చెమర్చిన వేళ..!
IPL 2026 GT VS PBKS Result Update: GT హ్యాట్రిక్ విజ‌యం.. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ లో ఒత్తిడిని త‌ట్టుకుని గెలిచిన గుజ‌రాత్, రాణించిన సుద‌ర్శ‌న్
GT హ్యాట్రిక్ విజ‌యం.. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ లో ఒత్తిడిని త‌ట్టుకుని గెలిచిన గుజ‌రాత్, రాణించిన సుద‌ర్శ‌న్
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Karuppu: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
Embed widget