News
News
X

Balakrishna new movie: నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ సినిమాలు ఆ డైరెక్టర్స్‌తోనేనా ?

అల్లు శిరీష్ హీరోగా, అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్ గా నటించిన చిత్రం ' ఊర్వశివో రాక్షసివో'. ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది మూవీ టీమ్.

FOLLOW US: 

అల్లు శిరీష్ హీరోగా, అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్ గా నటించిన చిత్రం ' ఊర్వశివో రాక్షసివో'. ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది మూవీ టీమ్. ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ కు హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సినిమా ట్రైలర్ బాగా వచ్చిందని, సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ మహా వెంకటేశ్, పరశురామ్ లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు హీరో బాలకృష్ణ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

'కేర్ ఆఫ్ కంచెరపాలెం' సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించుకున్నారు డైరెక్టర్ మహా వెంకటేష్. ఈ చిత్రం విడుదల కాకముందు ఎవరికీ తెలియదు. కానీ సినిమా విడుదల అయ్యాక అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో పాత్రలు, సన్నివేశాలు మన జీవితాలకు దగ్గరగా ఉంటాయి, ఇందులో పాటలు ఓ కొత్త లోకం లోకి తీసుకెళ్తాయి. ఈ సినిమాతో వెంకటేష్ కు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. 'ఊర్వశివో రాక్షసివో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహా వెంకటేష్ మాట్లాడారు.. ఎప్పటినుంచో బాలకృష్ణ తో సినిమా తీయాలని ఉందని అన్నారు. అయితే తన కథలు బాలకృష్ణ కు సూట్ అవుతాయో లేదో తెలీదు కానీ ఎప్పటికైనా ఆయనతో ఓ సినిమా తీస్తానని వ్యాఖ్యానించారు. 

ఇదే ఈవెంట్ ల్ డైరెక్టర్ పరశురామ్ కూడా బాలకృష్ణ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంచి కథతో బాలకృష్ణ ముందుకు రాబోతున్నాం అని అన్నారు. అంటే త్వరలోనే పరశురాం, బాలకృష్ణ కాంబో లో సినిమా రాబోతోందని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ లో 'గీతా గోవిందం' లాంటి సినిమా చేశానని, అల్లు శిరీష్ తో 'శ్రీరస్తు శుభమస్తూ' సినిమా తీశానని అన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడే అల్లు శిరీష్ అవకాశం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.  అది 'సర్కారు వారి పాట' లాంటి సినిమాకు అవకాశం వచ్చేలా చేసిందన్నారు. ఇక త్వరలోనే బాలకృష్ణ తో సినిమా చేయబోతున్నాం అని హింట్ ఇచ్చారు డైరెక్టర్ పరశురామ్

 'ఊర్వశివో రాక్షసివో' సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. టీజర్ తో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఇక ట్రైలర్ తో సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. తెరపైన శిరీష్, అను ఇమ్మాన్యూయెల్ జంట చూడముచ్చటగా అనిపిస్తుంది. ట్రైలర్ కూడా బాగుండటంతో సినిమా పై ఉత్కంఠ పెరిగింది. ట్రైలర్ లో కామెడీ, రొమాన్స్ పాళ్లు ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను జీఏ-2 పిక్చర్స్‌, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించారు. శిరీష్ కు జంటగా అను ఇమ్మాన్యూయెల్‌ కనిపించనున్నారు. 
అనూప్‌రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు. ఎప్పటి నుంచో సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న అల్లు శిరీష్ కు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తోందో చూడాలి. ఈ సినిమా నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News Reels

Published at : 31 Oct 2022 01:45 PM (IST) Tags: Parasuram Balakrishna New Movie Balakriahna Maha Venkatesh

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

Liger Money laundering case : విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా ఈడీ వదల్లేదు

Liger Money laundering case : విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా ఈడీ వదల్లేదు

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

టాప్ స్టోరీస్

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

TRS Fire On Sharimila : భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

TRS Fire On Sharimila :  భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !