అన్వేషించండి

Asalu: ‘అసలు’ సినిమా ఫస్ట్ 4 నిమిషాల సీన్ రిలీజ్ - కథ మొత్తం మలుపు తిరిగేది ఇక్కడే

టాలీవుడ్ లో ఉన్న విలక్షణ దర్శకుల్లో రవిబాబు ఒకరు. దర్శకుడిగా ఆయన చేసిన సినిమాలు అన్నీ సరికొత్తగా ఉంటాయి. మరోవైపు నటుడుగానూ తన మార్క్ ను చూపిస్తున్నారు.

Asalu: టాలీవుడ్ లో ఉన్న విలక్షణ దర్శకుల్లో రవిబాబు ఒకరు. దర్శకుడిగా ఆయన చేసిన సినిమాలు అన్నీ సరికొత్తగా ఉంటాయి. మరోవైపు నటుడుగానూ తన మార్క్ ను చూపిస్తున్నారు. కామెడీ డ్రామా, క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఆయనకు ప్రత్యేక స్టైల్ ఉంటుంది. ‘అల్లరి’ వంటి కామెడీ సినిమాలు చేసిన రవిబాబు తర్వాత ‘అనసూయ’, ‘అవును’, ‘అమరావతి’ వంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ను తెరకెక్కించి అందరి దృష్టినీ ఆకర్షించారు. రవిబాబు మరో కొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘అసలు’ పేరుతో సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో ఏప్రిల్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ ను ప్రమోషన్ చేసేందుకు మూవీ టీమ్ సరికొత్త ప్లాన్ చేసింది. 

‘అసలు’ సినిమాలోని కథను మలుపుతిప్పే కీలక సన్నివేశాన్ని రిలీజ్ చేసింది మూవీ టీమ్. అందులో మూవీలో మొదటి నాలుగు నిమిషాలను విడుదల చేసింది. ఈ సీన్ లో ఓ ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ కు ఫోరెన్సిక్ స్టడీస్ కు సంబంధించిన ఆన్ లైన్ క్లాసులు చెప్తుంటారు. అతను క్లాసు చెప్తుండగా మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అతన్ని కత్తితో మెడపై అతిదారుణంగా పొడిచి చంపేసి వెళ్లిపోతాడు. ఇదంతా కంప్యూటర్ స్క్రీన్స్ పై స్టూడెంట్స్ అంతా చూసి భయపడిపోతారు. అయితే ఆ వ్యక్తిని చంపింది ఎవరు, ఎందుకు హత్య చేశాడు. అసలు సినిమా కథ ఏంటి అనేది మిగిలిన సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. సాధారణంగా రవిబాబు ఇలాంటి సినిమాలు తీయడంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

ప్రస్తుతం ఈ నాలుగు నిమిషాలు సన్నివేశాన్ని విడుదల చేయడంతో మూవీ పై ఆసక్తి పెరిగింది. సినిమా చూడని వారు ఎవరైనా ఇది చూస్తే కచ్చితంగా సినిమా చూడాలి అనే విధంగా ఆ సన్నివేశం ఉంది. సినిమా మొత్తానికి ఈ సన్నివేశమే కీలకం కాబట్టి ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచే విధంగా ఆ సీన్ ను విడుదల చేశారు. మొత్తంగా ఈ సినిమాలో థ్రిల్లర్, క్రైమ్ అంశాలు బాగానే ఉన్నా అవి రవిబాబు మార్క్ ను చూపించలేదనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రవిబాబు ఆ హత్య కేసును చేధించే పోలీసు అధికారి పాత్రలో కనిపించారు. మొదటి భాగం పర్వాలేదని పించినా సెకండ్ ఆఫ్ అంతగా ఆకట్టుకోలేదనే అంటున్నారు. మరి ఈ సీన్ లీక్ అంశం సినిమా వ్యూవర్షిప్ ను పెంచుతుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో రవిబాబు, పూర్ణ ల నటన ఆకట్టుకునేలా  ఉంటుంది. మిగిలిన వారు కూడా పరిధిమేరకు కష్టపడ్డారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదనిపించింది. కథ, కథనంలో ఇంకాస్త కొత్తదనం ఉంటే బాగుండేదని అంటున్నారు పలువురు ప్రేక్షకులు. మరి ఈ సినిమా మరి కొన్ని రోజులకు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. 

Read Also: సల్మాన్‌తో డేటింగ్ రూమర్స్ పై పూజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget