అన్వేషించండి

Arjun Das : ‘OG’లో ‘బుట్టబొమ్మ’ స్టార్ అర్జున్ దాస్ - పవర్ స్టార్ కోసం స్పెషల్ నోట్!

పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లోవస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఓజీ'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడులో కొనసాగుతోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ యంగ్ యాక్టర్ అర్జున్ దాస్ కీలక పాత్ర పోషించబోతున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్'.  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. శ్రీమతి పార్వతి చిత్ర సమర్పకురాలు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.  భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.  

‘OG’ సినిమాలో కోలీవుడ్ హీరో కీలక పాత్ర

తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో  కోలీవుడ్ స్టార్ హీరో అర్జున్ దాస్ కూడా నటించబోతున్నారని కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై మేకర్స్ అఫీషియల్ ప్రకటన చేశారు.  ఈ చిత్రంలో కోలీవుడ్ యంగ్ హీరో ఉన్నాడని కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్ధ అర్జున్ దాస్ ను సినిమాలోకి ఆహ్వానిస్తూ ఓ పోస్టర్ ను షేర్ చేసింది.

కోలీవుడ్ స్టార్ అర్జున్ దాస్ ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ లాంటి సూపర్  హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అర్జున్‌‌‌‌ దాస్‌‌‌‌కి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఇటీవల ‘బుట్టబొమ్మ’ అనే స్ట్రయిట్ తెలుగు మూవీ చేశాడు. తాజాగా  క్రేజీ ప్రాజెక్టు ‘OG’లో జాయిన్ అవుతున్నాడు. “తాజాగా నేను హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను. ‘OG’ సెట్స్ లో మూవీ టీమ్ తో మీట్ అయ్యాను. పవన్ కల్యాణ్ గారితో మీటింగ్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా మంది నన్ను ‘OG’లో ఉన్నారా? అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను అధికారికంగా చెప్తున్నాను. అవును. నేను ‘OG’లో ఉన్నాను. ఈ సినిమాలో అవకాశం కల్పించిన సుజీత్ గారికి, దానయ్య గారికి, పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదాలు!” అని అర్జున్ దాస్ వెల్లడించారు.  

హైదరాబాద్ పరిసరాల్లో కొనసాగుతున్న‘OG’ షూటింగ్

ప్రస్తుతం ‘OG’ సినిమాకు సంబంధించిన  థర్డ్ షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతోంది.  హైదరాబాద్‌ పరిసన ప్రాంతాల్లో ఈ షూటింగ్ నిర్వహిస్తున్నారు.  పవన్ కల్యాణ్‌‌‌‌తో సహా మిగిలిన టీమ్ అంతా ఈ షెడ్యూల్‌‌‌‌లో పాల్గొంటున్నారు. అర్జున్ దాస్ కూడా షూటింగ్‌‌‌‌లో జాయిన్ అయ్యాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.  తమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ కల్యాణ్ హీరోగా డీవీవీ సంస్థలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా నిర్మించారు. పదేళ్ళ తర్వాత మళ్ళీ పవన్‌ తో సినిమా చేస్తుండటం విశేషం. పవన్ ఇతర సినిమాల విషయానికి వస్తే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సముద్ర ఖని దర్శకత్వంలో ‘బ్రో’ అనే సినిమా చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh First Review : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ రివ్యూ - ఆ రూల్ బ్రేక్ చేసేలా క్లైమాక్స్
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ రివ్యూ - ఆ రూల్ బ్రేక్ చేసేలా క్లైమాక్స్
Dhurandhar 2 First Review: 'ధురంధర్ 2' ఫస్ట్ రివ్యూ... 'షోలే'కు వందరేట్లు - ఆకాశానికి ఎత్తేసిన రామ్ గోపాల్ వర్మ
'ధురంధర్ 2' ఫస్ట్ రివ్యూ... 'షోలే'కు వందరేట్లు - ఆకాశానికి ఎత్తేసిన రామ్ గోపాల్ వర్మ
Dhurandhar 2 Shows Cancelled: 'ధురంధర్ 2' ప్రీమియర్లు క్యాన్సిల్... తెలుగు ప్రేక్షకులకు షాక్!
'ధురంధర్ 2' ప్రీమియర్లు క్యాన్సిల్... తెలుగు ప్రేక్షకులకు షాక్!
Rakshita On Sarke Chunar: హిందీ పాటల్లో బూతులు లేవా? 'కేడీ' సాంగ్ కాంట్రవర్సీ... 'ఇడియట్' హీరోయిన్ రక్షిత ఫైర్
హిందీ పాటల్లో బూతులు లేవా? 'కేడీ' సాంగ్ కాంట్రవర్సీ... 'ఇడియట్' హీరోయిన్ రక్షిత ఫైర్

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
US Exit Bonus: అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
Big Relief For Fliers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Free Charging For EVs: మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
BRS MLAs Walk Out: మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Embed widget