అన్వేషించండి

Arbaaz Khan: నా భార్యకేమైనా 16 ఏళ్లా? - ఏజ్‌ గ్యాప్‌ అనేది సమస్యే కాదు.. ట్రోల్స్‌పై ఆర్భాజ్‌ ఖాన్‌

Arbaaz Khan: అర్భాజ్‌ ఖాన్‌ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అతడిపై ట్రోల్స్‌ వస్తూనే ఉన్నాయి. ఈ వయసులో పళ్లి అవసరమా? వయసు దాచి తనకంటే చాలా చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Arbaaz Khan React on Trolls: బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, నటుడు ఆర్భాజ్‌ ఖాన్‌ తాజాగా ట్రోల్స్‌పై స్పందించాడు. ఈ మధ్యే ఆర్భాజ్‌ రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 1998 నటి మలైకా ఆరోరాను పెళ్లి చేసుకున్న ఆర్భాజ్‌ 2017లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. దాదాపు 20 ఏళ్లు కలిసున్న ఈ జంట విడిపోవడం అందరిని షాక్‌ గురి చేసింది. మలైకాలో ఇలా విడాకులు ఆయ్యాయో లేదో మోడల్‌ జార్జీయా ఆండ్రియాతో డేటింగ్‌ చేశాడు.రెండేళ్ల రిలేషన్‌లో ఉన్న ఈ జంట గతేడాది విడిపోయారు.

ఆ వెంటనే అర్భాజ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ షురా ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకుని అందరిని సర్‌ప్రైజ్‌ చేశాడు.  ఇరు కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి అనంతరం భార్యతో కలిసి అర్భాజ్‌ డిన్నర్‌, లంచ్‌ అంటూ ముంబైలో చక్కర్లు కొడుతున్నాడు. ఇటీవల ఈ జంట హనీమూన్‌కు కూడా వెళ్లోచ్చింది. అంతేకాదు రీసెంట్‌గా షురా తన బర్త్‌డేను భర్తతో హ్యాపీ జరుపుకుంది. అయితే అర్భాజ్‌ ఖాన్‌ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అతడిపై ట్రోల్స్‌ వస్తూనే ఉన్నాయి. దానికి కారణం అర్భాజ్‌ కంటే షురా ఖాన్‌ చాలా చిన్నది. వీరిద్దరి మధ్య కనీసం 20 ఏళ్ల గ్యాప్‌ ఉంటుందంటున్నారు.

Also Read: 'నన్ను నమ్మండి.. ఇది చాలా పెయిన్‌ఫుల్‌' అంటూ వీడియో షేర్‌ చేసిన 'జగతి' మేడమ్‌

తనేం 16 ఏళ్ల అమ్మాయి కాదు..

అయితే తనకంటే చాలా చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో అర్భాజ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈ వయసులో రెండో పెళ్లి అవసరమా? చూస్తుంటే ఆ అమ్మాయి చాలా చిన్నదిగా కనిపిస్తోందంటూ అతడిని ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా వీటిపై ఆర్భాజ్‌ స్పందించాడు. "నా భార్య నా కంటే చాలా చిన్నదే కావచ్చు. కానీ తనేం ఇంకా 16 ఏళ్ల అమ్మాయి మాత్రం కాదు. తనకు ఏం కావాలి? ఏం వద్దు అనేది విషయాలపై తనకో స్పష్టత ఉంది.  అలాగే నాకు నా లైఫ్‌ ఏం అవసరం, ఏం చేయాలి అనేది కూడా నాకు తెలుసు. మేమిద్దరం ఏడాది పాటు ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. మాకు ఏం కావాలి? భవిష్యత్తులో ఎలా ఉండాలనేది మాకు తెలుసు. అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం" అంటూ చెప్పుకొచ్చాడు. 

నాకు వయసు దాచాల్సిన అవసరం లేదు

అలాగే వయసు దాచి పెళ్లి చేసుకున్నాడా? అనే ప్రశ్నలపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. చాలా మంది మా ఏజ్‌ గ్యాప్‌ గురించి మాట్లాడుతున్నారని, నేను తన వయసు దాచి తనని పెళ్లి చేసుకున్నానంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అలాంటిదేం లేదు. నేనేమి నా వయసు దాచిపెట్టలేదు. ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి అన్ని తెలుసు. మా నిర్ణయం ఏంటనే పూర్తి స్పష్టతోనే ఈ అడుగు వేశాం. ఒకే వయసులో ఉన్న ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి ఉండవచ్చు లేదంటే ఏడాదికే విడిపోవచ్చు. కాబట్టి ప్రేమకు, బంధానికి వయసుతో పనిలేదు. ఇంకా చెప్పాలంటే వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉన్న జంటలే ఎక్కువకాలం కలిసి ఉంటారు. ఇప్పటికే ఇది రుజువైంది కూడా. అలాంటి జంటల సక్సెస్‌ రేటే ఎక్కువ ఉంది" అని సమాధానం ఇచ్చాడు. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం తండ్రిని బెదిరించిన అంబిక! పెద్దాయన బంటీకి ఆస్తి ఇచ్చేస్తారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం తండ్రిని బెదిరించిన అంబిక! పెద్దాయన బంటీకి ఆస్తి ఇచ్చేస్తారా!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వైల్డ్‌కార్డ్స్‌ చేతిలో నామినేషన్లు! శివ్‌ నిర్ణయం ఏంటి?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వైల్డ్‌కార్డ్స్‌ చేతిలో నామినేషన్లు! శివ్‌ నిర్ణయం ఏంటి?
Lokesh Kanagaraj Allu Arjun : అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
Nindu Manasulu Serial Today October 12th: నిండు మనసులు: శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న సిద్ధూ, ప్రేరణలు! కన్నీటి వీడ్కోలు!
నిండు మనసులు: శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న సిద్ధూ, ప్రేరణలు! కన్నీటి వీడ్కోలు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget