అన్వేషించండి

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ పేరుతో స్మారక అవార్డు

కృష్ణ పేరు మీద సినీ రంగానికి సేవలందించిన వారికి ప్రతీ ఏడాది సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డ్ ను ప్రదానం చేస్తామని ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన(మా) వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా ప్రకటించారు.

సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మరో పెద్ద దిక్కున కోల్పోయింది. తెలుగు సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలందించడమే కాకుండా సాంకేతికంగా అభివృద్ధి కావడానికి ఎంతో కృషి చేశారు ఆయన. అందుకే కృష్ణ పేరు మీద సినీ రంగానికి సేవలందించిన వారికి ప్రతీ ఏడాది సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డ్ ను ప్రదానం చేస్తామని ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా ప్రకటించారు. 

అయితే  దీనిపై త్వరలో మహేష్ బాబును కూడా కలిసి అవార్డు గురించి చర్చించనున్నామని ఆయన అన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఎంపిక ప్రజా బ్యాలెట్ ద్వారా జరుగుతుందని చెప్పారు. ఆ ప్రజా బ్యాలెట్‌ లో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిలో విజేతలను జ్యూరీ ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. ఈ పురస్కార వేడుక జరిగే తేదీని కూడా త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. పారదర్శకత కోసం విధి విధానాలపై జ్యూరీ ప్రాథమిక చర్చలు పూర్తి చేసిందని, ప్రతి ఏటా తెనాలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. తెనాలికి సూపర్ స్టార్ చేసిన సేవల్ని, ఆయన జ్ఞాపకాలను మరువలేకే ఈ అవార్డుకు శ్రీకారం చుట్టినట్లు దిలీప్ రాజా తెలిపారు.

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన 50 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ ఆయన ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను నిర్మించారు. ఆయన చేసిన ప్రయోగాలు తెలుగు సినిమా పరిశ్రమ సాంకేతికంగా అభివృద్ధి  కావడానికి ఎంతో ఉపయోగపడ్డారు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆయనకు ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి.

ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, పద్మభూషణ్  లాంటి పురస్కారాలు కృష్ణ‌ను వరించాయి. సినిమాల్లో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగినా.. ఆయన తన కన్న వారిని, పెరిగిన ఊరుని మర్చిపోలేదు. ఆయన సినిమాలు విడుదలైన ప్రతీ సారి సొంత ఊరు బుర్రిపాలెం వెళ్లి తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకునేవారు. అందరితో కలిసి సినిమాను చూసేవారు. ఊరి అభివృద్ధికీ ఎంతో కృషి చేశారు. ఇదే స్ఫూర్తితో మహేష్ బాబు ఆ ఊరిని దత్తత తీసుకొని పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

ఆయన మరణానంతరం సూపర్ స్టార్ కృష్ణ మెమోరియల్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మహేష్ ఆయన కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ఏర్పాటు అయితే కృష్ణకు మరో అరుదైన గౌరవం లభించినట్లే. ఈ మెమోరియల్ లో కృష్ణ సినీ జీవితానికి సంబంధించిన అవార్డులు, పురస్కారాలు, ఫోటోలతో పాటు ఆయన జ్ఞాపకాలు వ్యక్తిగత జీవితం విశేషాలు కూడా ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మెమోరియల్ ను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నారట. ఇక ఈ మెమోరియల్ ను త్వరలోనే హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Also Read: అలాంటి హీరోయిన్లు నాకు అస్సలు నచ్చరు - రిషబ్ కౌంటర్ రష్మికకేనా?

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Sep 2nd: రాధపై కత్తితో దాడి చేయబోయిన చిట్టి...సుందరి చెంప పగులగొట్టిన రాధ
నువ్వులేక నేను లేను: రాధపై కత్తితో దాడి చేయబోయిన చిట్టి...సుందరి చెంప పగులగొట్టిన రాధ
Hima Gowda: 'కుస్తీ కళ్యాణి' సీరియల్ హీరోయిన్ హిమా గౌడ.. రియల్ లైఫ్ ఆసక్తికర విశేషాలు!
'కుస్తీ కళ్యాణి' సీరియల్ హీరోయిన్ హిమా గౌడ.. రియల్ లైఫ్ ఆసక్తికర విశేషాలు!
OG2 Update : OG సీక్వెల్ సర్‌ప్రైజ్ - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్... సుభాష్ చంద్రబోస్‌తో వారియర్
OG సీక్వెల్ సర్‌ప్రైజ్ - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్... సుభాష్ చంద్రబోస్‌తో వారియర్
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Panjaa Re Release: జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
Irumudi Collections : 200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
Hair Fall Treatment: జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
Embed widget