Animal Day 2 Collections: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘యానిమల్‘, రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వసూళు చేసిందంటే?
Animal Day 2 Collections: ‘యానిమల్‘ మూవీ బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తోంది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 230 కోట్లకు పైగా వసూళు చేసింది.
Animal Movie Day 2 Collections: దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుంటోంది. రెండు రోజుల్లో ఈ సినిమా సుమారు రూ. 250 కోట్ల రూపాయలను వసూళు చేసింది. రణబీర్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న మూవీగా నిలిచింది.
బాక్సాఫీస్ దగ్గర ‘యానిమల్’ దూకుడు
టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా రూపొందించిన ‘యానిమల్’ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. ఈ మూవీ రిలీజ్ కు ముందే రూ. 200 కోట్లకుపైగా బిజినెస్ చేసింది. రూ. 210 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ. 116 కోట్లు వసూళు చేసింది. భారత్ లో దాదాపు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. హిందీలో రూ.50 కోట్లు, తెలుగులో రూ.10 కోట్లు, కన్నడ, తమిళ్, మలయాళంలో... ఓవర్సీస్ మార్కెట్ కూడా కలిపితే మొత్తంగా మరో రూ. 60 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు అందుకుంది. ‘పఠాన్’ సినిమా తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘యానిమల్’ చేరింది.
రెండు రోజుల్లో రూ. 239 కోట్లు వసూలు చేసిన ‘యానిమల్’
ఇక ‘యానిమల్’ సినిమా రెండు రోజుల్లో రూ. 239 కోట్లు వసూళు చేసింది. 2వ రోజు కలెక్షన్లను పరిశీలిస్తే.. తెలుగు, తమిళం, కన్నడలో రూ. 10 కోట్లు వసూళు చేసింది. హిందీలో 50 కోట్ల షేర్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి భారత్ లో 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ‘యానిమల్’ సినిమా 2 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సుమారు రూ. 20 కోట్లు సాధించింది. హిందీలో రూ. 120 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో రూ.25 కోట్ల సాధించినట్లు తలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో రూ. 239 కోట్ల రూపాయల గ్రాస్ వసూళు చేసింది.
అటు ‘యానిమల్’ మూవీ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అనిల్ కపూర్, బబ్లూ పృథ్వీరాజ్, బాబీ డియోల్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది. సందీప్ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ తో చేయనున్నారు. ‘స్పిరిట్’ పేరుతో రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో షూటింగ్ జరుపుకోనుంది.
Read Also: నా దగ్గరికి వచ్చే కథలన్నీ అలాంటివే, మరో ఆలోచనే లేదంటున్న కీర్తి సురేష్!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply