అన్వేషించండి

Ammayi garu Serial Today December 2: చిట్‌ఫండ్‌ కంపెనీ మేనేజర్‌ను చంపింది ఎవరో తెలుసుకున్న కోమలి ఏం చేసింది..?

Ammayi garu Serial Today Episode December 2: తాను పెళ్లిచేసుకోబోయే అశోక్‌ను హత్యకేసులో ఇరికించడంతో విజయాంబికపై కోమలి మండిపడుతుంది.

Ammayi garu Serial Today Episode: అశోక్‌ ఫోన్‌కోసం కోమలి ఎదురుచూస్తుంటుంది. రోజూ ఈ సమయానికి ఫోన్ చేసే వాడు కదా...పైగా నేను చేస్తుంటే తన ఫోన్ స్విచ్ఛాప్ రావడం చూసి కంగారుపడుతుంది. ఇంతలో అశోక్‌ ఫోన్ చేయగా...అతనిపై అరుస్తుంది. నాకు తెలియకుండా  ఫోన్ ఎందుకు స్విచ్ఛాప్‌ చేశావని అడుగుతుంది. నేను ఎంత కంగారుపడుతున్నానో తెలుసా అంటుంది. ఇంతలో అశోక్‌ నేను చాలా పెద్ద ప్రాబ్లంలోఉన్నానని చెబుతాడు. ప్రస్తుతానికి ఎవరికి దొరకలేదంటాడు. సీక్రెట్ ప్లేస్‌లో సేఫ్‌గా దాక్కున్నానని అంటాడు. నువ్వు దాక్కోవాల్సిన అవసరం ఏముందని...అసలు ఏం జరిగిందని నిలదీస్తుంది. నీకు ఏం కాకూడదని...నువ్వు భయపడకూడదనే నేను ఈ ప్రాబ్లంలో ఇరుక్కున్నానని చెబుతాడు. నువ్వు అనాథ ఆశ్రమంలోనే ఉన్నావని నిరూపించేందుకు రాజు, రూప,విరూపాక్షి కలిసి మీ ఇంటికి బయలుదేరారని...నిన్ను ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తుండగా....ఓ ఐడియా వచ్చిందని చెబుతాడు. తానే విరూపాక్షి గన్‌లో నుంచి బుల్లెట్‌ తీసి ఆ బుల్లెట్‌తోనే చిట్‌ఫండ్ కంపెనీ మేనేజర్‌ను చంపేసి ఆ నేరం విరూపాక్షి మీద పడేలా చేశానని చెబుతాడు. కొన్నిరోజుల్లో మన పెళ్లి పెట్టుకున ఇలా ఎందుకు చేశావని కోమలి అశోక్‌పై మండిపడుతుంది. నిన్ను ప్రాబ్లంలో నుంచి బయటపడేయాలనే  నేను ఆపని చేశానని చెబుతాడు. దీంతో కోమలి ఇదంతా ఎవరు చేయమన్నారు అని అడుగుతుంది. దీపక్‌,విజయాంబికానే ఈ ఐడియా ఇచ్చారని చెప్పి...ఫోన్ కట్‌ చేస్తాడు. నాకు చెప్పకుండా  నా అశోక్‌ను ఈ కేసులో ఇరికిస్తారా అంటూ కోమలి విజయాంబిక మీద కోపంతో రగిలిపోతుంది.

   అటు యువరాజు పోలీసులు ఇచ్చిన సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలనగా చూస్తూ ఉంటాడు. ఇది ఖచ్చితంగా మార్ఫింగ్ వీడియో అంటాడు. ఎవరో కావాలనే అమ్మగారిని ఈ కేసులో ఇరికించారని అంటాడు. ఈ హత్య చేసిన వాళ్లను పట్టుకోవాలని అంటాడు.
   అటు విజయాంబిక,దీపక్‌ కూడా కంగారు పడుతుంటారు. అశోక్‌ సీక్రెట్ ప్లేస్‌లోనే ఉన్నాడు కదా...వాడు దొరికాడంటా మనం దొరికిపోతాం అని అంటుంది. ఇంతలో అక్కడికి కోమలి వచ్చి వారిద్దరిపైనా మండిపడుతుంది. మీరు దొరికిపోకుండా ఉండేందుకు నా అశోక్‌ను ఇరికిస్తారా అంటూ కేకలు వేస్తుంది.  నేను పెళ్లిచేసుకోవాలనుకున్న అశోక్‌తో హత్య చేయించి నా జీవితం నాశనం చేయాలని అనుకున్నారా అని నిలదీస్తుంది. ఇంతలో దీపక్‌ ఆమె ఒంటిపై చేయి వేసి నీకు కొత్త జీవితం ఇవ్వాలనకుంటున్నా అంటాడు. వెంటనే కోమలి దీపక్ చెంప పగులగొడుతుంది. వంకర కూతలు కూస్తే నాలుక తెగిపోద్దని హెచ్చరిస్తుంది.
ఇంతలో విజయాంబిక  కలుగజేసుకుని నీ గురించి నిజం తెలిస్తే అందరికీ ప్రాబ్లం వస్తుందనే ఈ పని చేయించానని సర్దిచెబుతుంది. నిన్ను కాపాడటం కోసమేనంటుంది. నా కోసమే అయితే అశోక్‌ కాకుండా  వేరే ఎవరితోనైనా ఈ పని చేయించొచ్చు కదా అని నిలదీస్తుంది. రాజు ఈ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టడని తెలుసుకదా అంటుంది. అశోక్‌కు ఎమైనా అయితే...నేను ఊరుకోను అంటుంది. ఆధారాలన్నీ చెరిపివేశామని...అశోక్‌ కు శిక్షపడే అవకాశమే లేదని అంటారు. విరూపాక్షికి శిక్షపడిన తర్వాత ఈ ఆస్తి మొత్తం రాయించేసుకుని  నీవాటా నువ్వు తీసుకుని వెళ్లి అశోక్‌ను పెళ్లి చేసుకోవచ్చని విజయాంబిక చెబుతుంది. ఈలోగా అశోక్‌కు  ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనని చెప్పి అక్కడి నుంచి కోమలి వెళ్లిపోతుంది.
               

                 హత్య జరిగిన చిట్‌ఫండ్ కంపెనీలో ఉన్న సీసీ ఫుటేజ్ చెక్‌ చేయడం కోసం రాజు, రూప అక్కడికి వెళ్తారు. సెక్యూరిటీని అడిగి సీసీ ఫుటేజ్‌ చూస్తారు.అందులో ఒక కెమెరా  ఫుటేజీ తీసివేసి ఉండటంతో రాజు వాళ్లను అడుగుతాడు. దీనికి వారు మాకేం తెలియదని సమాధానమిస్తారు. ఇంకో కెమెరాలో రికార్డయిన ఫుటేజ్ పరిశీలించగా....ఓ వ్యక్తి మేనేజర్‌ను చంపి బయటకు వెళ్లిపోతున్న వీడియో స్పష్టంగా కనిపిస్తుంది. వాడి చేతిలో గన్‌ ఉన్నప్పటికి  ముఖం కనిపించకుండా టోపీ అడ్డుపెట్టుంటాడు. వీడే ఆ మర్డర్‌ చేశాడని రాజు అంటాడు. ప్రస్తుతానికి వీడెవడో కనిపెట్టలేకపోవచ్చు గానీ...అమ్మగారు మాత్రం తప్పుచేయలేదని నిరూపించవచ్చని అంటాడు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Priyanka Chopra : మేమిద్దరం విడిపోవాలని కోరుకుంటున్నారా? - డివోర్స్ రూమర్స్‌పై ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ రియాక్షన్
మేమిద్దరం విడిపోవాలని కోరుకుంటున్నారా? - డివోర్స్ రూమర్స్‌పై ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ రియాక్షన్
Nindu Manasulu Serial Today March 26th: నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల్ని విడదీసేసిన మంజుల! ఇందిరకు షాక్ ఇచ్చిన సిద్ధూ తల్లిదండ్రులు!
నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల్ని విడదీసేసిన మంజుల! ఇందిరకు షాక్ ఇచ్చిన సిద్ధూ తల్లిదండ్రులు!
Balakrishna : బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
Podharillu Serial Today March 26th:శైలు విషయంలో కేశవ్‌ను మహా, కన్నా ఎలా ఆడుకున్నారు? సర్టిఫికేట్ల కోసం మహా ఏం చేసింది..?
పొదరిల్లు: శైలు విషయంలో కేశవ్‌ను మహా, కన్నా ఎలా ఆడుకున్నారు? సర్టిఫికేట్ల కోసం మహా ఏం చేసింది..?

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Chicken Shops Close: హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Ustaad Bhagat Singh Collections: బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
Hyderabad Food Safety: హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
Balakrishna : బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
Architecture Temples : విరూపాక్ష ఆలయం సహా ఈ 8 ఆధ్యాత్మిక కట్టడాలు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణలు!
విరూపాక్ష ఆలయం సహా ఈ 8 ఆధ్యాత్మిక కట్టడాలు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణలు!
Ram Charan : పెద్ది షూటింగ్‌కు రామ్ చరణ్ - గాయం నుంచి కోలుకున్న గ్లోబల్ స్టార్... బర్త్ డే గిఫ్ట్ రెడీ
పెద్ది షూటింగ్‌కు రామ్ చరణ్ - గాయం నుంచి కోలుకున్న గ్లోబల్ స్టార్... బర్త్ డే గిఫ్ట్ రెడీ
Embed widget