అన్వేషించండి

Allu Arjun : ఐకాన్ స్టార్​పై అభిమానం... సైకిల్​పై రాష్ట్రాలు దాటి అల్లు అర్జున్​ను కలిసిన అభిమాని

Allu Arjuns : ఐకాన్ స్టార్ పై అభిమానంతో సైకిల్ పై రాష్ట్రాలు దాటి ఆయనను కలవడానికి వచ్చిన అభిమానిని అల్లు అర్జున్ కలిశారు.

Allu Arjun Fans Meet : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. 'పుష్ప' సినిమా రిలీజ్ అయ్యాక ఆయన రేంజ్ వరల్డ్ వైడ్ గా మరింతగా పెరిగింది. ఇక అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పాలంటే క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అల్లు అర్జున్ అంటే పిచ్చి అభిమానంతో ఆయన 'పుష్ప' సినిమాలో పాటలకు డ్యాన్సులు వేయడమే కాదు 'పుష్ప' స్టైల్లో బట్టలు కూడా వేసుకొని తిరుగుతారు. ఇక విదేశాల్లో ఇంతటి క్రేజ్ ఉందంటే అల్లు అర్జున్ కి మన దేశంలో ఏ రేంజ్ లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఓ అభిమాని ఆయనను కలవడానికి సైకిల్ మీద రాష్ట్రాలు దాటి వచ్చి టాప్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.

తన ఫేవరెట్ హీరోను కలవడానికి ఓ వీరాభిమాని అతిపెద్ద సాహసం చేశాడు. ఊర్లు, జిల్లాలు, మండలాలు కాదు ఏకంగా రాష్ట్రాలను దాటి సైకిల్ పై ప్రయాణించి హైదరాబాద్ కి వచ్చాడు. యూపీలోని అలీగడ్ కు చెందిన ఈ అభిమాని ఏకంగా 1600 కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కుతూ హైదరాబాద్ కు చేరుకున్నాడు. అల్లు అర్జున్ ను కలవడానికి సైకిల్ పై వచ్చిన ఈ ఉత్తర ప్రదేశ్ వాసి అల్లు అర్జున్ పై అభిమానాన్ని ఈ రకంగా చాటుకున్నాడు. అయితే ఎట్టకేలకు తాను అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ కలిసి ఆయనతో కాసేపు మాట్లాడడమే కాదు, ఫోటోలు కూడా దిగారు. ఈ నేపథ్యంలోనే అతని వీరాభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. అతడిని ఆప్యాయంగా పలకరించి అక్కున చేర్చుకున్నారు. 

అభిమానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని అతని కోరిక మేరకు తనను కచ్చితంగా యూపీలో కలుస్తానని మాట ఇచ్చారు. 'పుష్ప 2' మూవీ ప్రమోషన్స్ కోసం ఒకవేళ యూపీకి వస్తే కలుస్తానని అభిమానితో అల్లు అర్జున్ చెప్పారు. కాగా సదరు అభిమాని అల్లు అర్జున్ కు మొక్కను బహుమతిగా ఇవ్వడం విశేషం. మొత్తానికి అల్లు అర్జున్ అతని అభిమానానికి ఫిదా అయ్యి, మంచి భోజనం పెట్టించి, తిరిగి అతన్ని బస్సులో ఇంటికి పంపించాలని తన స్టాఫ్ తో చెప్పారు. కాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

దీంతో అభిమానులు ఇదొక హార్ట్ ఫెల్ట్ సీనరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' డిసెంబర్ 6న రిలీజ్ కు సిద్ధమవుతోంది. త్వరలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్ లో జోరు పెంచబోతున్నారు. ఇక ఈ సినిమాలో 'పుష్ప పార్ట్ వన్'లో నటించిన హీరోయిన్ రష్మిక మందన్న కంటిన్యూ చేయబోతోంది. అలాగే ఫాహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ అద్భుతంగా వచ్చింది అంటూ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయన కామెంట్స్ సినిమాపై మరింత హైప్ పెంచాయి. 

Read Also : ఎలాన్ మస్క్ రోబోలను ఆ సినిమా నుంచి కాపీ కొట్టాడా? డైరెక్టర్ షాకింగ్ ఆరోపణలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati News: మూడు విభాగాలుగా అమరావతి నిర్మాణం- సీఆర్‌డీఏ భవనంతోనే పనులు పునఃప్రారంభం 
మూడు విభాగాలుగా అమరావతి నిర్మాణం- సీఆర్‌డీఏ భవనంతోనే పనులు పునఃప్రారంభం 
Chandrababu Warning to MLAs : ఎమ్మెల్యేల చేతులు కట్టేస్తున్న చంద్రబాబు - ఇసుక, లిక్కర్ జోలికెళ్తే అంతే - ఇక వారికి దారేది ?
ఎమ్మెల్యేల చేతులు కట్టేస్తున్న చంద్రబాబు - ఇసుక, లిక్కర్ జోలికెళ్తే అంతే - ఇక వారికి దారేది ?
Justice Sanjiv Khanna: 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను సిఫార్సు చేసిన జస్టిస్ చంద్రచూడ్
51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను సిఫార్సు చేసిన జస్టిస్ చంద్రచూడ్
Moosi Politics : వరదలతో చెన్నై, బెంగళూరు ప్రజలకు కష్టాలు - హైడ్రా, మూసి ప్రక్షాళనకు నైతిక బలం వచ్చినట్లేనా ?
వరదలతో చెన్నై, బెంగళూరు ప్రజలకు కష్టాలు - హైడ్రా, మూసి ప్రక్షాళనకు నైతిక బలం వచ్చినట్లేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vizianagaram Pydithalli sirimanu utsavam | విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం ఎప్పుడైనా చూశారా.? | ABPNita Ambani on Ratan Tata | రతన్ టాటాపై నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు | ABP Desamఅద్దె కంప్యూటర్‌తో 100 Cr. టర్నోవర్, రాజమండ్రిలోనే సాఫ్ట్‌వేర్ కంపెనీహెజ్బుల్లా రహస్య సొరంగం వీడియో షేర్ చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati News: మూడు విభాగాలుగా అమరావతి నిర్మాణం- సీఆర్‌డీఏ భవనంతోనే పనులు పునఃప్రారంభం 
మూడు విభాగాలుగా అమరావతి నిర్మాణం- సీఆర్‌డీఏ భవనంతోనే పనులు పునఃప్రారంభం 
Chandrababu Warning to MLAs : ఎమ్మెల్యేల చేతులు కట్టేస్తున్న చంద్రబాబు - ఇసుక, లిక్కర్ జోలికెళ్తే అంతే - ఇక వారికి దారేది ?
ఎమ్మెల్యేల చేతులు కట్టేస్తున్న చంద్రబాబు - ఇసుక, లిక్కర్ జోలికెళ్తే అంతే - ఇక వారికి దారేది ?
Justice Sanjiv Khanna: 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను సిఫార్సు చేసిన జస్టిస్ చంద్రచూడ్
51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను సిఫార్సు చేసిన జస్టిస్ చంద్రచూడ్
Moosi Politics : వరదలతో చెన్నై, బెంగళూరు ప్రజలకు కష్టాలు - హైడ్రా, మూసి ప్రక్షాళనకు నైతిక బలం వచ్చినట్లేనా ?
వరదలతో చెన్నై, బెంగళూరు ప్రజలకు కష్టాలు - హైడ్రా, మూసి ప్రక్షాళనకు నైతిక బలం వచ్చినట్లేనా ?
Priyanka South : కాంగ్రెస్ సౌత్ మిషన్‌ చీఫ్ ప్రియాంక - వాయనాడ్ ఎన్నికల తర్వాత యాక్షన్ ప్లాన్ !
కాంగ్రెస్ సౌత్ మిషన్‌ చీఫ్ ప్రియాంక - వాయనాడ్ ఎన్నికల తర్వాత యాక్షన్ ప్లాన్ !
Viral Ghost Image: వీసా పాస్‌పోర్టు లేకుండానే ప్రపంచాన్ని చుట్టేస్తున్న దెయ్యం- తాజాగా నిజామాబాద్‌లో ల్యాండ్‌ అయిందట! 
వీసా పాస్‌పోర్టు లేకుండానే ప్రపంచాన్ని చుట్టేస్తున్న దెయ్యం- తాజాగా నిజామాబాద్‌లో ల్యాండ్‌ అయిందట! 
Valmiki Jayanti 2024 : అక్టోబరు 17  వాల్మీకి జయంతి .. విశిష్టత ఏంటి -  రాష్ట్ర పండుగగా నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వం!
అక్టోబరు 17 వాల్మీకి జయంతి .. విశిష్టత ఏంటి - రాష్ట్ర పండుగగా నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వం!
Today Weather Report: నెల్లూరు జిల్లా తడ వద్ద తీరం దాటిన వాయుగుండం - బెంగళూరు, చెన్నైలో వాతావరణం ఎలా ఉంది?
నెల్లూరు జిల్లా తడ వద్ద తీరం దాటిన వాయుగుండం - బెంగళూరు, చెన్నైలో వాతావరణం ఎలా ఉంది?
Embed widget