అన్వేషించండి

Allu Arjun: 'సౌత్ సినిమాల్లో అంతే', బన్నీను ఆడేసుకుంటున్నారుగా

బన్నీ నుంచి వచ్చిన కొత్త యాడ్ చుట్టూ వివాదం రాజుకుంటుంది. జొమాటో బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ బన్నీ ఓ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే.

ఒకప్పుడు తెలుగులో మహేష్ బాబు మాత్రమే ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ లో కనిపించేవారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలందరూ యాడ్స్ పై దృష్టి పెట్టారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా కమర్షియల్ యాడ్స్ తో బిజీ అయ్యారు. అయితే అతడు చేస్తోన్న యాడ్స్ ఏదోక రకంగా వివాదంలో చిక్కుకుంటున్నాయి. 

ఇప్పటికే బన్నీ నటించిన ర్యాపిడో యాడ్ విషయంలో రచ్చ జరిగింది. ఆర్టీసీ బస్సులను కించపరిచే విధంగా యాడ్ ఉందంటూ టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభ్యంతరం పెట్టారు. దీంతో ఆ యాడ్ ను మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు బన్నీ నుంచి వచ్చిన మరో కొత్త యాడ్ చుట్టూ కూడా వివాదం రాజుకుంటుంది. జొమాటో బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ బన్నీ ఓ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. 

అయితే ఆ యాడ్ సౌత్ సినిమాలను కించపరిచేలా ఉందంటూ నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్ లో బన్నీ మరో నటుడు సుబ్బరాజ్ ను ఒక్క కిక్కుతో గాల్లోకి లేచేలా కొడతారు. గాల్లో తేలుతూ.. బన్నీ నన్ను కొంచెం త్వరగా కిందపడేయవా అని సుబ్బరాజ్ అడిగితే 'సౌత్ సినిమా కదా ఎక్కువసేపు ఎగరాలి' అంటూ బన్నీ డైలాగ్ కొడతాడు. ఈ డైలాగ్ బన్నీ చెప్పడం నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తోంది. 

తెలుగు, తమిళ సినిమాల్లో ఫైట్ సీన్స్ ఇలానే ప్లాన్ చేస్తుంటారు. కొన్ని హిందీ సినిమాల్లో కూడా ఉంటాయనుకోండి. అయితే బన్నీ స్పెషల్ గా సౌత్ సినిమాలను మెన్షన్ చేయడం ప్రేక్షకులను నచ్చడం లేదు. సౌత్ సినిమాలతో ఎదిగి.. సౌత్ సినిమా ఇండస్ట్రీని కించపరిచేలా బన్నీ డైలాగ్ చెప్పడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ప్రముఖులెవరూ స్పందించకపోవడంతో జొమాటో వాళ్లు కూడా లైట్ తీసుకున్నట్లు ఉన్నారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zomato (@zomato)

టాప్ హెడ్ లైన్స్

Aadarsha Kutumbam: వెంకీ మామ సినిమాలో డింపుల్ స్టెప్పులు... 'ఆదర్శ కుటుంబం'లో స్పెషల్ సాంగ్?
వెంకీ మామ సినిమాలో డింపుల్ స్టెప్పులు... 'ఆదర్శ కుటుంబం'లో స్పెషల్ సాంగ్?
Gundeninda Gudigantalu Sep17th: మనోజ్‌కోసం జావ కాసిన రోహిణి..కిచెన్‌లో నుంచి బయటకు గెంటేసిన ప్రభావతి
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌కోసం జావ కాసిన రోహిణి..కిచెన్‌లో నుంచి బయటకు గెంటేసిన ప్రభావతి
Karthika Deepam 2 Serial Today September 17th: కార్తీకదీపం 2 సీరియల్: నడిరోడ్డు మీద ఉన్న ఫ్యామిలీ కోసం కార్తీక్, దీపల వెతుకులాట! సూరజ్ సాయం!
కార్తీకదీపం 2 సీరియల్: నడిరోడ్డు మీద ఉన్న ఫ్యామిలీ కోసం కార్తీక్, దీపల వెతుకులాట! సూరజ్ సాయం!
Jagadhatri Serial Today September16th: కేదార్‌పై వైజయంతి,నిషిక హత్యాయత్నం..సమయానికి వచ్చి కాపాడిని రాగిణి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌పై వైజయంతి,నిషిక హత్యాయత్నం..సమయానికి వచ్చి కాపాడిని రాగిణి

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget