అన్వేషించండి

Adivi Sesh: నేను గుడ్ యాక్టర్, గ్రేట్ రైటర్, బ్యాడ్ డైరెక్టర్ - అడివి శేష్ షాకింగ్ కామెంట్స్!

Adivi Sesh : యంగ్ హీరో అడివి శేష్ తన బర్త్ డే సందర్భంగా విలేకరులతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Adivi Sesh Birthday Interview: టాలీవుడ్ యంగ్ అండ్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా, రైటర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరో త్వరలోనే 'గూడచారి సీక్వెల్' (G2 Movie)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రోజు అడవి శేష్ బర్త్డే. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

"ప్రస్తుతం నేను చేస్తున్న 'G2'(గూఢచారి 2) కథ ఐదు దేశాల్లో జరుగుతుంది. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నాం. అలాగే శృతి హాసన్ తో చేస్తున్న మూవీ కూడా హిందీ, తెలుగు భాషల్లో వేరు వేరుగా షూట్ చేస్తున్నాం. నటీనటులను కూడా తెలుగు, హిందీ భాషల్లో మంచి పట్టు ఉన్న వాళ్ళను తీసుకుంటున్నాం. నన్ను నేను గుడ్ యాక్టర్, గ్రేట్ రైటర్, బ్యాడ్ డైరెక్టర్ అని ఫీల్ అవుతా. ఎందుకంటే... దర్శకుడికి ఓర్పు చాలా అవసరం. నాకు అది లేదు. అందుకే నేను యాక్టింగ్, రైటింగ్ మాత్రమే ప్రిఫర్ చేస్తా. అది కూడా కేవలం నా కోసం. ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక కేవలం నటుడుగానే మరో రెండు సినిమాలు చేయబోతున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు అడివి శేష్.

శృతి హాసన్ తో చేస్తున్న ప్రాజెక్టు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. "శృతి హాసన్ తో చేసే సినిమా వెరీ ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీ. హైలీ ఎమోషనల్. న్యూ జానర్ ఫిలిం. డైరెక్టర్ షానిల్ డియో అద్భుతమైన ప్రతిభావంతుడు. నేను క్షణం మూవీ చేస్తున్న టైంలో అతను చేసిన షార్ట్ ఫిలిం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఎంపికైందని తెలిసి షాక్ అయ్యాను. ఎలాగైనా అతన్ని డైరెక్టర్ గా పరిచయం చేయాలనే నా ఆకాంక్ష ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది" అంటూ అడివి శేష్ చెప్పాడు.

అడివి శేష్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. గత ఏడాది 'మేజర్', 'హిట్ 2' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ హీరో నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు. ఇదే విషయం గురించి అడిగితే... "ఈ ఏడాది నా సినిమాలేవి విడుదల కాలేదనే బాధ నాకు లేదు. పేస్ బౌలర్లు అందరికీ ఒకే స్పీడు ఉండదు. మనిషి అన్నాక ఎవరి స్పీడ్ వాళ్లకు ఉంటుంది. ఈ ఏడాదంతా స్క్రిప్ట్ వర్క్ కి సరిపోయింది. గత ఏడాది మేజర్, హిట్ 2 సినిమాలు రిలీజై మంచి సక్సెస్ సాధించాయి. అలాగే వచ్చే ఏడాది రెండు సినిమాలు విడుదలవుతాయి" అని తెలిపాడు. ప్రస్తుతం అడివి శేష్ నటిస్తున్న 'G2'(గూడచారి 2) షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వినయ్ కుమార్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2024 ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : అమితాబ్ ఇంటి పేరే రవితేజ సినిమా టైటిల్ - లుక్ చూస్తే బిగ్ బి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
UK Election Results 2024: ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ 
ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ 
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
UK Election Results 2024: ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ 
ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ 
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Embed widget