Tamannaah: 18 ఏళ్ల ‘నో కిస్’ రూల్‌ను బ్రేక్ చేసిన తమన్నా - ఈ నిర్ణయం అతడి కోసమేనట!
అందాల తార తమన్నా ‘నో కిస్’ పాలసీని బ్రేక్ చేసింది. 18 ఏండ్ల కెరీర్ లో తొలిసారి ముద్దు సీన్లలో నటించింది. విజయ్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను తప్ప, ఫేమస్ కావడానికి కాదని తమన్నా తేల్చి చెప్పింది.
మిల్కీబ్యూటీ తమన్నా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే కీలక నిర్ణయం తీసుకుంది. తాను కిస్ సీన్లలో నటించబోనని వెల్లడించింది. ఇప్పటి వరకు తను చెప్పినట్లుగానే ముద్దు సీన్ల జోలికి పోలేదు. కానీ, తాజాగా 'నో కిస్' పాలసీని ఉల్లంఘించింది. 18 ఏళ్ల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. ‘లస్ట్ స్టోరీస్ 2’తో పాటు 'జీ కర్దా' సిరీస్ లో ముద్దులే కాదు, ఏకంగా బోల్డ్ సీన్స్ లోనూ నటించి అందరినీ షాక్ కు గురి చేసింది.
‘నో కిస్’ పాలసీని బ్రేక్ చేయడానికి కారణం చెప్పిన తమన్నా
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్న తన ‘నో కిస్’ పాలసీని బ్రేక్ చేయడానికి ఓ కారణం ఉందని చెప్పుకొచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అంతేకాదు, కొందరు తాను ఫేమస్ కావడానికి కిస్ సీన్స్ లో నటించాలని ప్రచారం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. “నేను ఫేమ్ కావడానికి కిస్ సీన్లతో పాటు, బోల్డ్ సీన్లలో నటిస్తున్నానని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఆ అవసరం నాకు లేదు. 18 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాను. నాకు రావాల్సినంత గుర్తింపు ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు ఫేమస్ కావాల్సిన అవసరం లేదు. విజయ్ కోసమే నేను నో కిస్ పాలసీని బ్రేక్ చేశాను” అని చెప్పింది.
ముద్దా? అంతకంటే ఎక్కువే చేస్తా!
‘లస్ట్ స్టోరీస్-2’ పేరుతో ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్నది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన 'కాస్ట్ స్టోరీ' పేరుతో ప్రమోషన్ వీడియో విడుదల అయ్యింది. అందులో తమన్నా ఘాటు మాటలతో ఆశ్చర్యపరిచింది. తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి ఈ చిత్రంలో గట్టిగానే రొమాన్స్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ ప్రమోషన్ వీడియోలో సైతం ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. విజయ్ వర్మతో ముద్దులే కాదు, అంతకంటే ఎక్కువే చేయగలను అంటూ అందరినీ షాక్ కి గురి చేసింది. హైదరాబాదీ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం గురించి తమన్నా ఈ మధ్యే ఆమె మౌనం వీడింది. తనతో ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని చెప్పుకొచ్చింది. “చాలా మంది అమ్మాయిలు తమను అర్థం చేసుకునే భర్త వస్తే బాగుంటుందని భావిస్తారు. నేను కూడా అలాగే అనుకున్నాను. విజయ్ నా ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. నా గురించి ఎల్లవేళలా కేరింగ్ తీసుకునే వ్యక్తిగా ఉన్నాడు. అతడి ప్రేమ పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఏదో ఒకరోజు ఇద్దరి ప్రపంచం ఒకటే అవుతుంది. ఇద్దరి మధ్యనున్న బంధం చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నాను” అని తమన్నా వెల్లడించింది. విజయ్ కూడా తన జీవితంలోకి తమన్నా వచ్చాక చాలా సంతోషం వచ్చి చేరినట్లు ఉందన్నాడు.
View this post on Instagram
జూన్ 29 నుంచి స్ట్రీమింగ్
నాలుగు కథల సమాహారంగా 'లస్ట్ స్టోరీస్ 2'ను తెరకెక్కించారు. 'లస్ట్ స్టోరీస్ 2'లో కథలకు సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ దర్శకులు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికలో జూన్ 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
Read Also: ప్రెగ్నెన్సీ గురించి తెలియగానే రామ్ చరణ్ ఇలా స్పందించారట - కీలక విషయం చెప్పిన ఉపాసన