అన్వేషించండి

Rekha Boj: ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే స్ట్రీకింగ్ చేస్తా, షాకింగ్ ఆఫర్ ఇచ్చిన తెలుగు బ్యూటీ

Rekha Boj News: అందరూ అనుకున్నట్లుగానే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ కు చేరింది. ఈ నేపథ్యంలో ఓ తెలుగు నటి ‘బోల్డ్ ఆఫర్‘ ఇచ్చింది. భారత్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తానని వెల్లడించింది.

World Cup 2023: క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్ జోరు కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దుమ్మురేపుతోంది. సెమీస్ లో న్యూజిలాండ్ టీమ్ ను చిత్తు చేసింది. ఏకంగా 70 పరుగుల తేడాతో విక్టరీ కొట్టి ఫైనల్ లోకి అడుగు పెట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత క్రికెటర్లు అద్భుతంగా రాణించారు. బౌలర్ షమీ ఏకంగా 7 వికెట్లు తీసి కివీస్ ను చావు దెబ్బకొట్టాడు. ఆదివారం నాడు జరగబోయే ఫైనల్ లో విజేతగా నిలిచి వరల్డ్ కప్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది.

వైజాగ్ లో స్ట్రీకింగ్ చేస్తా- రేఖ

భారత జట్టు సెమీస్ లో విక్టరీ కొట్టి ఫైనల్ కు చేరిన నేపథ్యంలో తెలుగు హీరోయిన్ రేఖా భోజ్ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తానంటూ బోల్డ్ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఆమె స్టేట్ మెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నిజానికి భారత్ లో స్ట్రీకింగ్ అనేది కొత్త అయినా, విదేశాల్లో కామన్. తమ అభిమాన క్రికెట్, ఫుట్ బాల్, బాక్సింగ్ లేదంటే ఇతర క్రీడా జట్లు విజయం సాధించినప్పుడు సంతోషంతో కొంతమంది బట్టలు విప్పి పరుగులు తీస్తుంటారు. ఒంటి మీద బట్టలు లేకుండా పరిగెత్తడాన్నే స్ట్రీకింగ్ అంటారు. ఇప్పుడు రేఖ కూడా అదే పని చేయనున్నట్లు వెల్లడించింది.    

రేఖా స్టేట్ మెంట్ పై నెటిజన్ల ఆగ్రహం

రేఖా భోజ్ స్టేట్ మెంట్ మీద నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ కప్ గెలిస్తే బట్టలు విప్పి పరిగెత్తడం ఎందుకు? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు నిజంగా సిగ్గు చేటు అంటున్నారు. మరికొంత మంది పాపులర్ కావాలనే సాకుతోనే ఇలాంటి ప్రకటనలు చేస్తోందని మండిపడుతున్నారు. నెటిజన్ల కామెంట్స్ పై రేఖ రియాక్ట్ అయ్యింది. తనకు పాపులర్ కావాలనే ఉద్దేశం లేదని, కేవలం టీమిండియా మీద ఉన్న ప్రేమ, అభిమానం తోనే ఆ స్టేట్ మెంట్ ఇచ్చానని చెప్పుకొచ్చింది. మరికొంత మంది నెటిజన్లు మాత్రం ఫైనల్ రోజు మీ స్ట్రీకింగ్ ను చూసేందుకు వైజాగ్ వస్తామంటూ బోల్డ్ కామెంట్స్ పెడుతున్నారు.  

ఇంతకీ ఈ రేఖా భోజ్ ఎవరంటే?

రేఖ వైజాగ్ లోని కైలాసపురానికి చెందిన అమ్మాయి. ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడే షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. చదువు పూర్తయిన తర్వాత నటనా రంగంలోకి అడుగు పెట్టింది. కెరీర్ మొదట్లో ఎన్నో ఆడిషన్స్ కు వెళ్లినా అవకాశాలు మాత్రం దక్కలేదు.  చివరకు రాకేష్ రెడ్డి అనే దర్శకుడు ‘కాలాయ తస్మై నమః‘ అనే చిత్రం నటించే అవకాశం కల్పించారు.  ఆ తర్వాత ‘మాంగళ్యం‘, ‘దామినీ విల్లా‘,  ‘కాత్సాయని‘, ‘స్వాతి చినుకు‘,‘ రంగీలా‘ లాంటి చిత్రాల్లో నటించింది. కానీ, అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత తనే ఓ స్టూడియో పెట్టుకుని ఆల్బమ్స్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఇతర భాష హీరోయిన్ల డామినేషన్ గురించి తరచుగా మాట్లాడుతుంటుంది.   

Read Also: బెదింపులకు భయపడను, దేశం విడిచి వెళ్లను- దీపికా పదుకొణె

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Sankranthiki vasthunnam: వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్
వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్
Viral News: బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Sankranthiki vasthunnam: వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్
వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్
Viral News: బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Sri Reddy News: ఏపీలో నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు- వైసీపీ హయాంలో చేసిన పోస్టులు, కామెంట్లతో చిక్కులు!
ఏపీలో నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు- వైసీపీ హయాంలో చేసిన పోస్టులు, కామెంట్లతో చిక్కులు!
Maruti Brezza vs Tata Nexon: మారుతి బ్రెజ్జా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ఏది బెస్ట్ కారు?
మారుతి బ్రెజ్జా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ఏది బెస్ట్ కారు?
Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
Embed widget