Anushka Shetty: భూత కోలా వేడుకల్లో అనుష్క శెట్టి, వీడియో చూశారా?
ఇటీవల హీరోయిన్ అనుష్క శెట్టి మంగళూరు లో జరిగిన భూత కోలా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భాంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె భూత కోలా వేడుకల్లో పాల్గొన్న వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అయింది.
‘కాంతార’ సినిమా దేశ వ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సూనామీ సృష్టించింది. దీంతో గత కొన్ని రోజులుగా ఈ మూవీ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీకి చెందిన ప్రతీ ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అధే విధంగా ఈ సినిమాతో భూతకోలా అనే దైవారాధన గురించి ఎంతో చక్కగా చూపించారు. దీంతో ఈ సాంప్రదాయ నృత్యం పై ప్రతీ ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి అనుష్క భూతకోలా వేడుకలో పాల్గొనడం విశేషంగా మారింది. మంగళూరు లో జరిగిన భూత కోలా వేడుకలో అనుష్క కుటుంబ సమేతంగా పాల్గొంది. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంది. ఆమె భూత కోలా వేడుకలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ భూత కోలా దైవారాధనకు ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. హిందూ ధర్మానికి సంబంధించిన దైవారాధనలలో ఈ భూతకోలా ఒకటి. ఇది ముఖ్యంగా కర్ణాటక దక్షిణ కోస్తా ప్రాంతంలో మంగళూరు, ఉడిపి, కుందాపుర వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కేరళలోని ఉత్తర మలబార్ ప్రాంతంలోనూ ఇది ఆచరణలో ఉంది. లోక కళ్యాణార్థం వారాహి ఆత్మను పూజిస్తూ జరుపుకునే వేడుక ఇది. దీనికి పురాణాల నుంచీ ప్రాచుర్యం ఉంది. ఇక స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సొంత ఊరు మంగళూరు. ఈ ప్రాంతంలో భూతకోలా వేడుకలు ఘనంగ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే అనుష్క భూతకోలా వేడుకలకు హాజరయింది. ఈ భూత కోలా దైవారాధన వేడుకలను అనుష్క భక్తి శ్రద్దలతో వీక్షించారు. ఆ దైవారాధన నృత్యాన్ని వీడియో తీస్తున్నట్టు అనుష్క ఈ వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తన స్వస్థలం లోని ఆచార సాంప్రదాయాల పట్ల అనుష్కకు ఉన్న భక్తి, గౌరవం చూసి మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
Another glimpse of Sweety attending Boothakola Festival in her home town ❤️❤️✨✨#AnushkaShetty #Sweety #Anushka48 pic.twitter.com/XvwIXTnjha
— PRANUSHKA FANCLUB 🌸❤️ (@pranushka_fan) December 18, 2022
ఇక అనుష్క సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్ లో దశాబ్ద కాలం పైగా టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది అనుష్క. టాలీవుడ్ లో ‘సూపర్’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తరువాత వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అరుంధతి, బాహుబలి, భాగమతి లాంటి సినిమాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్లలో కూడా నటించింది. తెలుగు తో పాటు ఇతర భాషల సినిమాల్లోనూ నటించింది అనుష్క. తన అందం అభినయం తో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. కమర్షియల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ‘నిశ్శబ్దం’ సినిమా తర్వాత సినిమాలకు కొంత కాలం గ్యాప్ తీసుకుంది. తాజాగా యు.వి క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందులో అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. ఇటీవల అనుష్క బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తోన్న సినిమాలో ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. మరి ఈ మూవీతో అయినా అనుష్క మళ్లీ ఫామ్ లోకి వస్తుందో లేదో చూడాలి.