అన్వేషించండి

Suriya: నిరాశలో నుంచి కొత్త జోష్ లోకి.. ‘కంగువా‘తో ఆ కోరిక తీరిందన్న సూర్య

సూర్య హీరోగా శివ తెరకెక్కిస్తున్న తాజా పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘కంగువా’. నవంబర్ 14న విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రమోషన్ లో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Suriya About Kanguva Movie: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న సూర్య తన రీసెంట్ మూవీస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి సినిమా చేసే సమయంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నట్లు వెల్లడించారు. పరాజయం పొందిన ప్రతిసారి అద్భుత విజయం సాధించాలని భావిస్తానని చెప్పారు. కరోనా కారణంగా ‘ఆకాశమే నీ హద్దు’, ‘జై భీమ్’ సినిమాలను థియేటర్లలో విడుదల చేయలేకపోయాని చెప్పారు. ‘కంగువా’తో ఆ లోటు తీరబోతుందన్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు.

నిరాశలో నుంచి కొత్త జోష్ లోకి..

‘ఆకాశమే నీ హద్దు’ సినిమాకు ముందు తన సినిమాలు పెద్దగా ఆడలేదన్నారు సూర్య. “ఆకాశమే నీ హద్దు’ సినిమాకు ముందు నేను నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయాను. మళ్లీ నా ఇమేజ్ పెంచుకోవాలి అనుకున్నాను. ఆ సమయంలోనే సుధా కొంగర నాకు ‘ఆకాశమే నీ హద్దు’ సినిమా గురించి చెప్పింది. ఈ సినిమా నాలో కొత్త జోష్ తీసకొచ్చింది” అని చెప్పుకొచ్చారు.

ఆ రేంజ్ సినిమా చేయాలనే కోరిక నెరవేరింది!

‘బ్రేవ్‌ హార్ట్‌, ‘లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌‘, ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌‘ లాంటి హాలీవుడ్ సినిమాలను చూసి ఆశ్చర్యపోతాం తప్ప, అలాంటి సినిమా చేయాలనే ఆలోచన చాలా మంది ఇండియన్ మేకర్స్ లో రావడంలేదన్నారు సూర్య. “చాలా మంది మేకర్స్ హాలీవుడ్ సినిమాలు చూసి అద్భుతంగా ఉన్నాయి అనుకుంటారు. కానీ, అలాంటి సినిమాలు మనం చేయాలి అనుకోవడం లేదు. ఇలాంటి సమయంలో శివ నాకు ఈ కథ చెప్పారు. ‘కంగువా’ అనేది భారతీయ సినీ పరిశ్రమలో కొత్త ప్రయత్నం. ఈ సినిమా వందేళ్ల క్రితం జన జీవన విధానాన్ని చూపిస్తుంది. ఈ సినిమాతో హాలీవుడ్ సినిమా చేయాలనే కోరిక నెరవేరింది. కథ ఎలా అనుకున్నామో, తెర మీద అవుట్ ఫుట్ అంతకు మించి వచ్చింది” అన్నారు సూర్య.

నా సినిమా చూసి ఐపీఎస్ అయ్యారు!

ఇక తన సినిమాలకు దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తుందని సూర్య చెప్పుకొచ్చారు. ఆ క్రెడిట్ తనతో సినిమాలు చేసిన దర్శక నిర్మాతలకు దక్కుతుందన్నారు. “నేను నటించిన ‘కాఖా కాఖా’ సినిమా చూసి ఐపీఎస్ ఆఫీసర్ అయినట్లు చెప్పడం నాకు సంతోషాన్ని కలిగించింది. ‘జై భీమ్’ లాంటి సినిమాల వల్ల తమిళనాడులో ఎంతో మందికి ఇళ్ల పట్టాలు, ఓటర్ ఐడీలు వచ్చాయి. మంచి సినిమాలు ప్రజల జీవితాలను మార్చుతాయి అనేదానికి ఇదో ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు” అన్నారు సూర్య.

సూర్య హీరోగా నటించిన ‘కంగువా’ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నవంబర్ 14న 30కి పైగా భాషల్లో ఈ సినిమా విడుదలకాబోతోంది.  

Read Also: తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ జోరు - వామ్మో థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy At Southern Rising Summit: దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Speech: జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 :
"పుష్ప 2" రిజల్ట్​పై మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్... మెగా విభేదాలపై క్లారిటీ ఇచ్చిన మైత్రి నిర్మాతలు
ABP Southern Rising Summit: హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ కి జ్యోతి ప్రజల్వన చేసిన సీఎం రేవంత్పదేళ్ల తెలంగాణకు మేమిచ్చే ట్రిబ్యూట్ సదరన్ రైజింగ్ సమ్మిట్ - ఏబీపీ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీఏబీపీ నెట్‌వర్క్ నేతృత్వంలో సదరన్ రైజింగ్ సమ్మిట్, గ్రాండ్‌గా ఈవెంట్‌లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, నేలమట్టమైన నగరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy At Southern Rising Summit: దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Speech: జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 :
"పుష్ప 2" రిజల్ట్​పై మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్... మెగా విభేదాలపై క్లారిటీ ఇచ్చిన మైత్రి నిర్మాతలు
ABP Southern Rising Summit: హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan And Sharmila: జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
Odisha News: ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
Andhra News: ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
GHMC Commissioner: 'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు
'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు
Embed widget