అన్వేషించండి

Prithviraj Sukumaran: 'సలార్’ మరో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ప్రభాస్‌‌ను ‘డార్లింగ్’ అని ఎందుకంటారో అర్థమైంది - పృథ్వీరాజ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Prithviraj Sukumaran: ‘సలార్’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Prithviraj Sukumaran On Salaar Movie And Prabhas: పాన్ ఇడియన్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సలార్’. ఈనెల 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నెగెటివ్ రోల్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ఈ సినిమాతో పాటు హీరో ప్రభాస్ గురించి పలు కీలక విషయాలు వెల్లడించారు.  

ప్రభాస్ ను డార్లింగ్ అని ఎందుకు అంటారో అర్థం అయ్యింది!

‘సలార్’ సినిమా సమయంలో ప్రభాస్ తో మంచి అనుబంధం ఏర్పడిందని సుకుమారన్ తెలిపారు. ఆయనతో ఉండే వాళ్లను ఎంతో ప్రేమగా చూసుకుంటారని వెల్లడించారు. “ఈ చిత్రంలో నేను వరదరాజ మన్నార్ గా నటించిస్తున్నాను. ప్రభాస్ దేవాగా కనిపిస్తారు. ఈ సినిమాలో నటించడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. నా కెరీర్ లోనే ఈ సినిమా లాంటి కథను చూడలేదు. ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంటుందని మాకు నమ్మకం ఉంది. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. నేను తరచుగా ఆయనతో మాట్లాడతాను. సినిమా సెట్ లో ప్రభాస్ ను అందరూ ఇష్టపడుతారు. అందరికీ చక్కటి భోజనం ఇంటి నుంచే తెప్పిస్తారు. తన చుట్టూ ఉండే వాళ్లను హ్యాపీగా చూసుకుంటారు. అందుకే ఆయనను అందరూ డార్లింగ్ అని పిలుస్తారని అర్థం అయ్యింది” అని వెల్లడించారు. 

చూసింది తక్కువ, చూడాల్సింది ఎంతో!

‘సలార్’ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు సుకుమార్. ఈ సినిమాతో తన కల నెరవేరిందన్నారు. “’సలార్’తో నా కల నెరవేరింది. ఇప్పటి వరకు టీజర్, ట్రైలర్ లో ప్రేక్షకులు చూసింది చాలా అంటే చాలా తక్కువ. ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే ఉండదు. భావోద్వేగాలతో నిండి ఉంటుంది. థియేటర్ లోకి వచ్చిన ప్రేక్షకులు ఈ సినిమా చూసి చాలా గొప్ప సినిమా చూశామనే భావనతో బయటకు వెళ్లారు. ‘సలార్’ రెండో భాగం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని తెలిపారు.  

‘సలార్’ మరో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’

ఇక ‘సలార్’ సినిమా హాలీవుడ్ మూవీ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’తో  పోల్చారు సుకుమారన్. ఇప్పటి వరకు ‘సలార్’ మూవీ ‘కేజీఎఫ్’ సినిమాల మాదిరిగా ఉంటుందని అందరూ భావించారు. కానీ, ఈ మూవీ అంతకు మించి ఉంటుందని తెలిపారు. భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలిపారు. హాలీవుడ్ సంచలన సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ మాదిరిగా ఉంటుందని చెప్పారు.  

వరుస సినిమాలతో సుకుమార్ బిజీ

ఈ ఏడాది తనకు మంచితో పాటు చెడును కూడా మిగిల్చిందని సుకుమారన్ తెలిపారు. “ఈ ఏడాది జూన్‌లో నా మోకాలు విరిగింది. కొద్ది రోజుల పాటు మంచానికే పరిమితం అయ్యాను. మోహన్‌లాల్ ‘లూసిఫర్’ చిత్రానికి దర్శకత్వం వహించాను. ఆ తర్వాత ‘L2E’ కోసం చాలా కాలంగా పనులు మొదలు పెట్టాం. ఇప్పుడు ఆ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రతిష్టాత్మక ‘సలార్’లోనూ భాగం అయ్యాను. ఈ సినిమాతో ఏడాది ముగుస్తుందని భావిస్తున్నాను. ‘L2E’ కోసం లేహ్, ఢిల్లీ, సిమ్లాలో ఒక షెడ్యూల్‌ని షూట్ చేశాను. అటు ‘ది గోట్ లైఫ్’ షూట్ కూడా కంప్లీట్ చేశాను. ‘బడే మియాన్ చోటే మియాన్‌’ అనే హిందీ సినిమా చేస్తున్నాను.  

Read Also: ఆకాశంలో అద్భుతం - ఆరు హెలికాప్టర్లతో ప్రభాస్‌కు ఎయిర్ సెల్యూట్, ‘సలార్’ క్రేజీ వీడియో!

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget