By: ABP Desam | Updated at : 24 Feb 2023 11:41 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Sai Dharam Tej/twitter
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతమ్’ను తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన సముద్రఖని, తెలుగు రీమేక్ కూడా తెరకెక్కిస్తున్నారు. పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే. తమిళ వెర్షనల్ లో సముద్రఖని, తంబి రామయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు రీమేక్ లో, పవన్ కల్యాణ్ సముద్రఖని పోషించిన కాలపు దేవుడు క్యారెక్టర్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ తంబి రామయ్య పాత్రను పోషించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం అయ్యింది.
ఇక ఈ సినిమా చేస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇందులో పవన్ కాలపు దేవుడు పాత్రలో నటించనున్నారు. ఈ పాత్ర అత్యంత పవిత్రమైనదిగా భావిస్తున్నారట. అందుకే ఈ సినిమా షూటింగ్ అయిపోయే వరకు ఎలాంటి నాన్ వెజ్ తీసుకోవద్దని ఆయన నిర్ణయించుకున్నారట. వాస్తవానికి పవన్ కల్యాణ్ కు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. నిత్యం నాన్ వెజ్ తీసుకుంటారు. ఫిట్ నెట్ కోసం చాలా సేపు వ్యాయామాలు చేస్తున్నారు. అందుకే ఎక్కువ నాన్ వెజ్ తింటారు. సీ ఫుడ్ అంటే మరీ ఇష్టం. చేపల పులుసు, నాటుకోడి కూర బాగా ఇష్టపడి తింటారట. కానీ, ఇప్పుడు అవన్నీ వదులుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కు కరోనా సోకిన సమయంలోనూ కొంత కాలం నాన్ వెజ్ కు దూరంగా ఉన్నారు. ఆకు కూరలు, కూరగాయల భోజనం మాత్రమే తీసుకున్నారు. మళ్లీ ఇప్పడు మరోసారి నాన్ వెజ్ కు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ప్యాక్టరీ సంస్థ ‘వినోదయ సీతమ్’ తెలుగు రీమేక్ నునిర్మిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నట్లు తెలుస్తోంది.
‘వినోదయ సీతమ్’ సినిమా పవన్ కల్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన ‘గోపాల గోపాల’ చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ మరోసారి అవతారపురుషుడిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు ఆయన కేవలం 15 నుండి 20 రోజుల మాత్రమే డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తక్కువ రోజులు డేట్స్ ఇచ్చినా, ఈ సినిమా కోసం రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. ఇక తాజాగా జరిగిన ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్, నటుడు దర్శకుడు సముద్రఖని, త్రివిక్రమ్, తమన్, ఈ సినిమా నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల పాల్గొన్నారు.
'THE BEST DAY' I would cherish forever.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 22, 2023
It's a dream come true to work with my Guru for life @PawanKalyan ❤️
Grateful at this amazing opportunity & Can't wait for a big chunk of learning and memories.@thondankani @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy @ZeeStudios_ pic.twitter.com/q52FFy2kbk
Read Also: బాలకృష్ణను ఆకాశానికి ఎత్తేసిన రామ్ చరణ్ - ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Shah Rukh Khan Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!
Jaya Janaki Nayaka Hindi Dubbed: Image Credits: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రిపతి’ రిమేక్ చేస్తున్నారా?
Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్
Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?
Priyanka Chopra: బాలీవుడ్ రాజకీయాలతో విసిగిపోయాను, అందుకే దూరమయ్యా: ప్రియాంక చోప్రా
Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ
Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి
Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్