అన్వేషించండి

Fish Venkat : 2 కిడ్నీలు ఫెయిల్ - పిల్లలు పట్టించుకోరు - పైసా డబ్బు లేదు -కామెడీ విలన్‌ ఫిష్ వెంకట్‌కు సినిమా కష్టాలు

Tollywood : యాక్టర్ ఫిష్ వెంకట్ సినిమా కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆయన సినిమాల్లో కనిపించకపోవడానికి కారణం ఆరోగ్యం బాగోలేకపోవడమే. వైద్యానికి డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నారు.

Actor Fish Venkat  health Issues : సినిమా కష్టాలని చెప్పడానికి కామెడీగా ఉంటాయి కానీ.. అలాంటి కష్టాలు వస్తే తట్టుకోవడం కష్టమని అనుభవించే వారికే తెలుస్తుంది. ఇలాంటి కష్టాలను సినీ నటుడు ఫిష్ వెంకట్ ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఫిష్ వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా సూపర్ హిట్ సినిమాల్లో కామెడీ విలన్ పాత్రల్లో నటించారు. ఎంతో మందిని నవ్వించారు. అయితే ఇటీవల ఆయన పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఎందుకా అని ఆరా తీస్తే ఆయనను సినిమా కష్టాలు వెంటాడుతున్నాయని తెలింది. 

ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు ఫెయిల్                         

ఫిష్ వెంకట్ కు ఇటీవల ఆరోగ్యం సహకరించం లేదు. ఏమైందా అని టెస్టులు చేయించుకుంటే రెండు కిడ్నీలు పాడైపోయాయని తేలింది. దీంతో ఆయన రెగ్యులర్ గా చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ఈ అనారోగ్యం కారణంగా ఆయన సరిగ్గా నిలబడలేకపోతున్నారు. అందుకే సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేయడం లేదు. తన వ్యాపారం చేపల అమ్మకం ద్వారా సంపాదించిన సొమ్ముతో పాటు సినిమాల ద్వారా సంపాదించినది కూడా వైద్యానికి ఖర్చయిపోయింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకునేంత ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో  ప్రభు్తవ ఆస్పత్రులకు వెళ్తున్నారు. వారిచ్చిన మందులతోనే ప్రాణం కాపాడుకుంటున్నారు. 

అక్కినేని ఫ్యామిలీ ఆపన్న హస్తం, వరద బాధితుల సాయం కోసం రూ. కోటి విరాళం                          

మగపిల్లలు చూడటం లేదని  వైద్యం చేయించడం లేదని ఆవేదన           

ఆయన పిల్లలు కూడా ఆయనను చూడటం లేదు. ఫిష్ వెంకట్ కు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మగ పిల్లలకు వ్యాపారాలు కూడా పెట్టించారు. అయితే ఇప్పుడు వారు తనను పట్టించుకోవడం లేదని ఫిష్ వెంకట్ వాపోతున్నారు. అప్పుడప్పుడు వచ్చి పలకరించినా వైద్యం కోసం ఆర్థిక సాయం చేయడం లేదని అంటున్నారు. చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆయన రెమ్యూనరేషన్ లక్షల్లో ఉండేది కాదు. అందుకే ఆయన ఎక్కువగా సంపాదించుకోలేకపోయారు. 

Also Read: బాసూ.... మీది మెగా మనసు - చిరు, పవన్ తర్వాత గ్లోబల్ స్టార్ భారీ సాయం, ఎంత విరాళం ఇచ్చారంటే?

సినీ పరిశ్రమ ఆదుకోవాలని విజ్ఞప్తి                

ఫిష్ వెంకట్ గురించి ఇప్పటి వరకూ బయటకు తెలియలేదు. ఇప్పుడు ఆయన నోరు విప్పి తన ఆరోగ్య పరిస్థితి బాగో లేదని.. వైద్య చికిత్సకూ డబ్బులు లేవని చెప్పడంతో సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరైనా స్పందించి ఆయనకు సాయం చేస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. పలువురు అగ్రహీరోలతో కలిసి ఆయన నటించారు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థల్లోనూ నటించారు. ఎవరైనా వైద్య సహకారం అందిస్తే కోలుకుని సినిమాల్లో నటించాలని.. ఆయన అనుకుంటున్నారు.  మరి ఎవరైనా సాయం చేస్తారో లేదో ?

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కిడ్నాప్‌లో లీడ్ కనిపెట్టిన మహా! జల్లెడ పడుతున్న విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కిడ్నాప్‌లో లీడ్ కనిపెట్టిన మహా! జల్లెడ పడుతున్న విహారి!
Sunil : పవర్ ఫుల్ లాయర్‌గా సునీల్ - డ్యూ డేట్ మూవీలో క్రేజీ రోల్...
పవర్ ఫుల్ లాయర్‌గా సునీల్ - డ్యూ డేట్ మూవీలో క్రేజీ రోల్...
Karikaala Movie: పూజతో సందీప్ కిషన్ 'కరికాల' ప్రారంభం... ముగ్గురు హీరోయిన్లు, రెండు భాగాలు - రిలీజ్ ఎప్పుడంటే?
పూజతో సందీప్ కిషన్ 'కరికాల' ప్రారంభం... ముగ్గురు హీరోయిన్లు, రెండు భాగాలు - రిలీజ్ ఎప్పుడంటే?
Anupama Parameswaran : నచ్చకపోతే వదిలేస్తా - ధ్రువ్ విక్రమ్ గురించే అనుపమ చెప్పారా?
నచ్చకపోతే వదిలేస్తా - ధ్రువ్ విక్రమ్ గురించే అనుపమ చెప్పారా?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget