అన్వేషించండి

Allu Arjun: అల్లు అర్జున్ కు మరో ఆప్షన్ లేదా? నెక్ట్స్ మూవీ ఆ డైరెక్టర్ తో చేయక తప్పదా?

Allu Arjun ప్రస్తుతం ‘పుష్ప 2‘ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ఏ దర్శకుడితో జత కట్టబోతున్నారు? అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Allu Arjun Next Movie With Trivikram: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా డిసెంబర్ 6న విడుదలకు రెడీ అవుతోంది. పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘పుష్ప’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో.. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? అని ప్రేక్షకులు  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఎవరితో?

టాలీవుడ్  స్టార్ హీరోలు వరుస సినిమాలు చేస్తున్నా, అల్లు అర్జున్ మాత్రం తన నెక్ట్స్ మూవీ ఇంకా అనౌన్స్ చేయలేదు. కొద్ది నెలల క్రితం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ బన్నీతో చర్చలు జరిపారు. ఇద్దరూ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపించింది. కానీ, ప్రస్తుతం ఆయన సల్మాన్ ఖాన్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. అటు ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ కూడా  అల్లు అర్జున్ తో ఓ సినిమా గురించి చర్చించారు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఆయన ‘జైలర్ 2’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ మూవీ పూర్తయ్యాకే అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం ఉంది. పలువురు తెలుగు దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆయన ఓకే చెప్పలేదు.  

సుకుమార్ తో ‘పుష్ప 3’ చేస్తారా?

ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాను తెరకెక్కిస్తున్న సుకుమార్.. ఈ మూవీ తర్వాత ‘పుష్ప 3’ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ సినిమా ఇప్పట్లో తెరకెక్కే అవకాశం లేదు. ‘పుష్ప 2’ తర్వాత కొంత విరామం తీసుకుని తన తర్వాతి చిత్రాన్ని రామ్ చరణ్ తో కలిసి చేయనున్నారు సుకుమార్. ‘పుష్ప 3’ పనులు కనీసం రెండు సంవత్సరాల తర్వాత ప్రారంభం కానున్నాయి. అది కూడా ‘పుష్ప 2’ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది.

అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చర్చలు

ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే బన్నీకి కథ చెప్పిన త్రివిక్రమ్, త్వరలో ఫైనల్ స్క్రిప్ట్ చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు కచ్చితంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు, ప్రస్తుతం అల్లు అర్జున్ కు త్రివిక్రమ్ తప్ప మరే ఆప్షన్ కనిపించడం లేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.  పాన్ ఇండియా రేంజిలో వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

Read Also: మరోసారి తల్లైన బాపు బొమ్మ ప్రణీతా సుభాష్, నెట్టింట వైరల్ అవుతున్న చిన్నారి ఫోటో

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
Podarillu Serial Today August 6th:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?
పొదరిల్లు: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 6th:సుందరి చిట్టికాదని విక్కీకి అనుమానం....డీఎన్‌ఏ టెస్ట్‌కోసం విక్రమ్ ఏం చేశాడు...?
నువ్వులేక నేను లేను: సుందరి చిట్టికాదని విక్కీకి అనుమానం....డీఎన్‌ఏ టెస్ట్‌కోసం విక్రమ్ ఏం చేశాడు...?
Makutam Trailer: శుక్రవారమే మకుటం ట్రైలర్ రిలీజ్... విశాల్ ఏం చేస్తాడో?
శుక్రవారమే మకుటం ట్రైలర్ రిలీజ్... విశాల్ ఏం చేస్తాడో?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget