News
News
X

Ira Khan's Engagement: ఫిట్‌నెస్ ట్రైనర్‌తో అమీర్ ఖాన్ కూతురు ఐరాఖాన్ ఎంగేజ్మెంట్, త్వరలోనే పెళ్లి

ఐరా-నుపుర్ శిఖరే గత కొన్నేళ్లుగా ప్రేమలో లో ఉంటున్నారు. వీరి ప్రేమకు అమీర్ ఖాన్ కూడా ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం.

FOLLOW US: 
 

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తన విలక్షణమైన నటనతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అలాగే, వివాదాలతో కూడా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. అమీర్ ఇటీవల సినిమాల్లో నటనకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించడం ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక కుటుంబానికి సమయం కేటాయిస్తానని, కేవలం నిర్మాతగా మాత్రమే కొనసాగుతానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మరో వార్త కూడా తెరపైకి వచ్చింది. అమీర్ ఖాన్ కూతురు ఐరాఖాన్ త్వరలోనే పెళ్లి చేసుకోనుందని, అందుకే అమీర్ ఆ పనుల కోసం బ్రేక్ తీసుకుంటున్నారు కాబోలని బీ-టౌన్‌ వర్గాలు అంటున్నాయి. 

ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో ఐరా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంటున్నారు. వీరి ప్రేమకు అమీర్ ఖాన్ కూడా ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న నేపథ్యంలో శుక్రవారం ముంబయిలో నిశ్చితార్థ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. అమీర్ ఖాన్ మాజీ భార్య సహా బంధుమిత్రులంతా నిశ్చితార్థానికి హాజరయ్యారు. అందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఏదైనా నిర్మొహమాటంగా మాట్లాడుతూ అందరి దృష్టినీ ఆకట్టుకుంటుంది ఐరా. సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉండే ఐరాకు అభిమానులు కూడా ఎక్కువే. అయితే ఐరా ఖాన్ గతంలో మిషాల్ తో ప్రేమాయణం సాగించింది. తర్వాత ఏమైందో కానీ మిషాల్ తో బ్రేకప్ చెప్పేసింది. 2020 కరోనా సమయంలో  ఐరా కు నుపుర్ ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉన్నాడు. ఈ సమయంలోనే నుపూర్ శిఖరేతో రిలేషన్‌షిప్‌లో ఉండేది.

ఓసారి సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు నుపుర్ విదేశాలకు వెళ్లాడు. అతనితో పాటు ఐరా కూడా వెళ్లింది. పోటీలు అయిపోయాక నుపుర్ ఐరా వద్దకు వెళ్లి ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ ప్రపోజ్ చేశాడు. దీనికి ఆమె ఎస్ చెప్పింది. ఆ తర్వాత ఐరాకు ఉంగరాన్ని తొడిగి, ముద్దు పెట్టాడు నుపుర్. ఈ విషయాన్ని ఐరా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

News Reels

నుపుర్ శిఖరే ఎవరు?

ఐరా ఖాన్ ప్రియుడు నుపుర్ శిఖరే మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు, సెలబ్రెటీ ఫిట్ నెస్ ట్రైనర్. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌కి ఫిట్ నెస్ ట్రైనర్ కూడా ఇతనే. నుపూర్ టెన్నిస్, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా పొందాడు. ఇండస్ట్రీపై ఆసక్తితో 2004 లో పూణే నుంచి ముంబై వచ్చాడు. నుపుర్ ను 2008 లో సుస్మితా సేన్ వ్యక్తిగత శిక్షకుడిగా నియమించుకోవడంతో అతని జీవితం కీలక మలుపు తిరిగింది. తర్వాత అతను అమీర్ ఖాన్, కిరణ్ రావుతో సహా పలు ప్రముఖ వ్యక్తులకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేశాడు. 

Also Read : 'ఐరావతం' రివ్యూ : థ్రిల్స్ ఉన్నాయా? లేదంటే టార్చర్ చేశారా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)

Published at : 19 Nov 2022 09:07 AM (IST) Tags: Amir Khan Ira Khan Nupur Shikhare

సంబంధిత కథనాలు

Akshay Kumar trolled: ఈ సినిమాను కూడా చెడగొడతావా : అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్ ?

Akshay Kumar trolled: ఈ సినిమాను కూడా చెడగొడతావా : అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్ ?

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?

Flop Directors Of Tollywood 2022 : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!

Flop Directors Of Tollywood 2022 : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!

Enthavaarugaani Teaser : చావు బతుకులతో సైంటిఫిక్ ఆట - 'ఎంతవారు గాని' టీజర్ విడుదల చేసిన అడివి శేష్

Enthavaarugaani Teaser : చావు బతుకులతో సైంటిఫిక్ ఆట - 'ఎంతవారు గాని' టీజర్ విడుదల చేసిన అడివి శేష్

టాప్ స్టోరీస్

Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?

Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Rohit Sharma Innings: 'రోహిత్' ది వారియర్- భారత్ మ్యాచ్ ఓడినా అతను మనసులు గెలిచాడు

Rohit Sharma Innings: 'రోహిత్' ది వారియర్- భారత్ మ్యాచ్ ఓడినా అతను మనసులు గెలిచాడు

Chandrababu Ring : చంద్రబాబు చేతి ఉంగరమే ఓ పెద్ద డాక్టర్ - ఆ రింగ్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా ?

Chandrababu Ring : చంద్రబాబు చేతి ఉంగరమే ఓ పెద్ద డాక్టర్ -  ఆ రింగ్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా ?