A1 From Day 1 Web Series : అస్మిత వెబ్ సిరీస్ @ 59 రూపాయలు
వెండితెర ప్రేక్షకులకు, బుల్లితెర వీక్షకులకు నటి అస్మిత సుపరిచితురాలు. తెలుగు సినిమాలు, సీరియళ్లలో నటించిన ఆమె... ఇప్పుడు వెబ్ సిరీస్ చేశారు.
అస్మిత (Actress Ashmita) గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు, కింగ్ అక్కినేని నాగార్జున కలయికలో వచ్చిన 'ఓం నమో వెంకటేశాయ' చిత్రంలో భూదేవి పాత్రలో కనిపించారు. పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు', మహేష్ బాబు 'మురారి' తదితర చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై 'మనసు మమత', 'శ్రావణి సమీరాలు', 'మధుమాసం' సీరియళ్లతో మెప్పించారు. నటిగా ఆమెది విజయవంతమైన ప్రయాణం. వెండితెర, బుల్లితెర, యూట్యూబ్‌లో సక్సెస్ సాధించిన ఆమె... ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ చేశారు.
A1 From Day 1 Web Series : యాష్ ట్రిక్స్ పేరుతో కొన్నాళ్ళ క్రితం అస్మిత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. మేకప్ కిట్ తయారీ నుంచి ఏ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? వంటి అంశాల వరకు ప్రేక్షకులకు వివరిస్తూ వీడియోలు చేశారు. కొన్నిసార్లు మోటివేషనల్ వీడియోలు పోస్ట్ చేశారు. దాంతో అస్మితకు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. డిజిటల్ మీడియాలో తన పేరును బ్రాండ్ చేసుకున్న, 'యాష్ ట్రిక్స్'తో సంచనలం సృష్టించిన అస్మిత... ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు.
జీవిత భాగస్వామి సుధీర్ అందించిన సహాకారంతో 'ఏ వన్ ఫ్రమ్ డే వన్' వెబ్ సిరీస్ చేశారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ వెబ్ సిరీస్ ప్రివ్యూ షో వేశారు. దానికి 'యాష్ ట్రిక్స్' ఫ్యామిలీని ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించారు. యూట్యూబ్‌లో తనకు పరిచయమైన అభిమానులను పిలిచారు.
అప్పుడు ఎగతాళి చేశారు
'ఏ వన్ ఫ్రమ్ డే వన్' వెబ్ సిరీస్ ప్రివ్యూలో అస్మిత మాట్లాడుతూ ''నటిగా బాగా బిజీ అయిన సమయంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. డిజిటల్ మీడియా వైపు నేను అడుగులు వేసాను. 'నువ్వు సీరియళ్ళలో బిజీ. నీకు సినిమా ఛాన్సులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ఏంటి?' అని నా సహచర నటీనటులు నన్ను ప్రశ్నించారు. ఎవరు చూస్తారని కామెంట్స్ చేశారు. అయితే అప్పుడు నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నారు. నాకు అది ఆనందం కలుగుతోంది. యాష్ ట్రిక్స్ విజయం వెనుక నా భర్త సుధీర్ సహాకారం చాలా ఉంది. ఇప్పుడు 'యాష్ ట్రిక్స్' బ్రాండ్‌గా మారిందంటే వీక్షకులకు మా మీద ఉన్న నమ్మకమే కారణం'' అని చెప్పారు.
ఏ వన్ ఫ్రమ్ డే వన్' @ 59 రూపాయలు!
'యాష్ ట్రిక్స్' నుంచి వస్తున్న వెబ్ సిరీస్ 'ఏ వన్ ఫ్రమ్ డే వన్'. నిజ జీవితంలో భార్య భర్తలు అయిన సుధీర్, అస్మిత... ఈ సిరీస్‌లో కూడా భార్య భర్తలుగా నటించారు. ప్రముఖ హాస్య నటుడు కీలక పాత్ర పోషించారు. డిసెంబర్ 10న... అంటే ఈ రోజు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి నుంచి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దీనిని పే ఫర్ వ్యూ విధానంలో విడుదల చేస్తున్నారు. వీక్షకులు ఎవరైనా సరే 59 రూపాయలు పెట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకుని సిరీస్ చూడొచ్చు.
Also Read : అమెరికాలో ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
View this post on Instagram