PG Admissions: పీజీ మెడికల్ ప్రవేశాలకు గడువు ముగుస్తున్నా, పూర్తికాని కౌన్సెలింగ్
ఏపీలో పీజీ మెడికల్ ప్రవేశాల ప్రక్రియ ఎన్నడూలేని విధంగా గందరగోళంగా తయారైంది. నిర్ణీతవ్యవధిలో పీజీ వైద్యవిద్యలో ప్రవేశాలు పూర్తిచేయలేక వైఎస్‌ఆర్ ఆరోగ్య వర్సిటీ చేతులెత్తేసింది.
ఏపీలో పీజీ మెడికల్ ప్రవేశాల ప్రక్రియ ఎన్నడూలేని విధంగా గందరగోళంగా తయారైంది. నిర్ణీతవ్యవధిలో పీజీ వైద్యవిద్యలో ప్రవేశాలు పూర్తిచేయలేక వైఎస్‌ఆర్ ఆరోగ్య వర్సిటీ చేతులెత్తేసింది. ఓ రిజర్వేషన్ అభ్యర్థికి ప్రైవేటు వైద్య కళాశాలలో కేటాయించిన సీటును రద్దుచేసి, ఓపెన్ కేటగిరీ అభ్యర్థితో భర్తీచేయడం, మూడు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు నకిలీ ఎల్‌ఓపీల ద్వారా సీట్ల మంజూరు, వీటి రద్దువల్ల రెండుసార్లు కౌన్సెలింగ్ రద్దుచేయడం.. ఇలా అన్ని విషయాల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. వీటిని పరిష్కరించి, రెండోవిడత కౌన్సెలింగ్ చేసే సమయానికి ఇన్-సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాల విషయంలో మరో సవాలు ఎదురైంది.
మరోవైపు యూనివర్సిటీ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సర్వీసు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం జారీచేసిన ఆదేశాలను అర్థం చేసుకుని, చర్యలు తీసుకోవడంలో విశ్వవిద్యాలయం విఫలమైంది. దీనివల్ల నాన్-సర్వీస్ రెండో విడత కౌన్సెలింగ్‌కు అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకున్నా, ఇప్పటివరకు సీట్లు కేటాయించలేదు. కన్వీనర్ కోటాలో 616 సీట్లు భర్తీచేయాలి. ఇది సజావుగా జరిగితే, తర్వాత యాజమాన్య కోటాలో సీట్లు భర్తీచేస్తారు.
కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్లను మాప్ అప్, స్ట్రే వెకెన్సీ విధానంలో భర్తీచేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు కనీసం రెండు వారాల సమయం పడుతుంది. నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్‌లైన్స్ ప్రకారం... అక్టోబరు 20 నాటికి పీజీ మెడికల్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియాల్సి ఉంది. అయితే ఈ గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తున్నా.. రాష్ట్రంలో మాత్రం కన్వీనర్ కోటాలో రెండోవిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రాథమిక దశను దాటలేకపోయింది.
దేశంలోని దాదాపు మిగతా అన్ని రాష్ట్రాల్లో ప్రవేశాల ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. ప్రణాళిక ప్రకారం కౌన్సెలింగ్ జరగకుంటే విద్యార్థులు నష్టపోతారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో తుదివిడత ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చి వారంరోజులు గడిచినప్పటికీ.. ఇప్పటివరకు సీట్లు కేటాయించలేకపోయింది. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రవేశాల గడువును మరో రెండు వారాలు పొడిగించాలని ఎన్‌ఎంసీని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ కోరింది. ఈ అభ్యర్థనకు ఎన్‌ఎంసీ నుంచి సమాధానం రావాల్సి ఉంది.
ALSO READ:
డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో యూజీ ఆయుష్ ప్రవేశాలు, ముఖ్యమైన తేదీలు ఇలా
విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో కాంపీటేటివ్ అథారిటీ కోటా కింద యూజీ ఆయుష్ (బీఏఎంస్, బీహెచ్‌ఎంస్, బీయూఎంస్) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ అర్హతతోపాటు నీట్ యూజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 17 నుంచి 21 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నీట్ యూజీ కటాఫ్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, ఫెలోషిప్ సాయం పెంపు - ఎప్పటినుంచి వర్తిస్తుందంటే?
విద్యార్థులకు యూజీసీ ఫెలోషిప్‌ల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పెంచింది. దీనివల్ల దేశంలోని దాదాపు 31 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చూకూరనుంది. 2023 జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది. 2023, జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది. పెరిగిన ఈ ఫెల్‌షిప్ మొత్తాలు ప్రస్తుతం యూజీసీ నుంచి ఫెలోషిప్స్ పొందుతున్నవారికి మాత్రమే వర్తించనున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..