ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్, రూ.500 ఫీజు కడితే కాలేజీకి పోనవసరం లేదు!
రెగ్యులర్ విధానంలో కాలేజీకి వెళ్లకుండానే 'ఆర్ట్స్' గ్రూప్‌లో ఇంటర్ చదవాలనుకునేవారికి ఇంటర్ బోర్డు సువర్ణ అవకాశాన్ని కల్పించింది. ఆర్ట్స్ గ్రూపుల్లో చేరినవారికి హాజరు నుంచి మినహాయింపు ఇవ్వనుంది.
![ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్, రూ.500 ఫీజు కడితే కాలేజీకి పోనవసరం లేదు! TSBIE - Intermediate Public Advanced Supplementary Examinations, May/June 2023 – Due dates for grant of Exemption from Attendance to Private candidates (Without College study) and Change of Group – Communicated ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్, రూ.500 ఫీజు కడితే కాలేజీకి పోనవసరం లేదు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/24/2830cdbc85789e8844e71deba5705a861674500430581522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణలో రెగ్యులర్ విధానంలో కాలేజీకి వెళ్లకుండానే 'ఆర్ట్స్' గ్రూప్‌లో ఇంటర్ చదవాలనుకునేవారికి ఇంటర్ బోర్డు సువర్ణ అవకాశాన్ని కల్పించింది. ఆర్ట్స్ గ్రూపుల్లో చేరిన విద్యార్థులకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వనుంది. అయితే ఇందుకోసం ప్రతివిద్యార్థి రూ.500 అటెండెన్స్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పరీక్ష ఫీజు చెల్లించి ఇంటర్ పరీక్షలకు హాజరుకావచ్చని బోర్డు అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి విద్యార్థులు మే 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ (లేదా) 040-24600110 నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి జయప్రదాబాయి సూచించారు.
Also Read:
ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈసారి ఎన్ని సెలవులంటే?
ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌కి 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, అలాగే వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అదేవిధంగా మార్చి 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
తెలంగాణ ఇంటర్ అకడమిక్ ఇయర్ (2023-24) క్యాలెండర్ ఇలా ..
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్‌ని ఇంటర్మీడియట్ బోర్డు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నీట్ అడ్మిట్ కార్డులు విడుదల, డౌన్‌లోడ్ చేసుకోండిలా!
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ఎంట్రన్స్ కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షను మే7న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 7న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరుగనుంది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. తాజాగా నీట్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పెన్ను, పేపర్ విధానంతో దేశవ్యాప్తంగా 499 పట్టణాల్లో జరిగే ఈ పరీక్షలకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలుగుతో పాటు 13 బాషల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నారు.
నీట్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
టీఎస్ఈసెట్-2023 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు డిప్లొమా విద్యార్థులకు నిర్వహించే టీఎస్ ఈసెట్-2023 దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. మే 2తో దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ మే 8 వరకు ఎలాంటి ఆలస్య రుసుములేకుండా దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అయితే రూ.500 ఆలస్యం రుసుంతో మే 11 వరకు, రూ.1000 ఆలస్యం రుసుంతో మే 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 8 నుంచి మే 13 వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 16 నుంచి అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈసెట్ ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సు్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)