TG ICET 2025 Results: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Telangana ICET Results | ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఐసెట్ ఫలితాలు జులై 7న విడుదలయ్యాయి. https://icet.tgche.ac.in/ లో ఫలితాలు చెక్ చేసుకోవాలని సూచించారు.

హైదరాబాద్: తెలంగాణలో ఐసెట్ ఫలితాలు (TG ICET-2025 Results) సోమవారం విడుదలయ్యాయి. 2025-26 అకాడమిక్ ఇయర్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఐసెట్ 2025 పరీక్ష కీ ఇటీవల విడుదల చేసిన అధికారులు తాజాగా ఫలితాలు విడుదల చేశారు. అధికారిక వెబ్ సైట్ icet.tgche.ac.in లో విద్యార్థులు ఫలితాలు చేక్ చేసుకోవాలని సూచించారు. డౌన్ లోడ్ చేసుకున్న ఫలితాలను కౌన్సెలింగ్ కోసం సేవ్ చేసుకోవాలి. https://icet.tgche.ac.in/TGICET/TGICET_GetRankCard.aspx
90 శాతం మంది ఉత్తీర్ణత
ఈ ఏడాది ఐసెట్ పరీక్షకు 71,746 మంది అప్లై చేసుకోగా, అందులో 64,938 మంది విద్యార్థులు జూన్ 8, 9 తేదీల్లో జరిగిన పరీక్షలకు హాజరయ్యారు. హాజరైన వారిలో 90.83 శాతం విద్యార్థులు 58,985 మంది ఐసెట్ లో ఉత్తీర్ణత సాధించారు. క్వాలిఫై అయిన వారిలో 27,998 మంది అబ్బాయిలు, 30,989 మంది అమ్మాయిలు ఉన్నారు. ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చాక విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా కాలేజీ ఆప్షన్లు ప్రక్రియ మొదలవుతుంది.
అభ్యర్థులు ఐసెట్ రిజల్ట్ ఇలా తెలుసుకోండి (TG ICET Results)
- విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ icet.tgche.ac.in ను సందర్శించాలి
- హోం పేజీలో కిందకు స్క్రోల్ చేస్తే కనిపించే Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఐసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేటాఫ్ బర్త్ లాంటి లాగిన్ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
- స్క్రీన్ మీద మీ ర్యాంక్ కార్డ్ వస్తుంది. మీ రిజల్ట్ ను డౌన్ లోడ్ చేసి పెట్టుకోవాలి. కౌన్సెలింగ్ కోసం ర్యాంక్ కార్డు ప్రింట్ తీసుకోవాలి.





















