By: ABP Desam | Updated at : 10 Aug 2023 07:11 AM (IST)
Edited By: omeprakash
KNRUHS - పీజీ మెడికల్ కౌన్సెలింగ్
తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ డిగ్రీ, పీజీ డిప్లొమా సీట్ల మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలకు సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 8న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 9న ప్రారంభమైంది. నీట్-పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు ఆగస్టు 16న సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు మెడికల్ పీజీ, పీజీ డిప్లొమా సీట్లకు నమోదు చేసుకోవచ్చు. నీట్ పీజీ మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలకు కోరు అభ్యర్థులు నిర్దేశిత దరఖాస్తు పూర్తిచేయడంతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
వివరాలు..
* పీజీ ఎండీ/ఎంఎస్, పీజీ డిప్లొమా - మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలు
అర్హత: నీట్ పీజీ 2023 అర్హత ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు విద్యాసంస్థ నుంచి ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఆగస్టు 11 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తయి ఉండాలి.
కటాఫ్ స్కోరు ఇలా..
➥ జనరల్ - 50 పర్సంటైల్- 291 స్కోరు
➥ ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ & దివ్యాంగులు - 40 పర్సంటైల్- 257 స్కోరు
➥ ఓసీ దివ్యాంగులు - 45 పర్సంటైల్- 274 స్కోరు.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.6300. ఇతర రాష్ట్రాలో బీడీఎస్ చేసినవారికి రూ.5000, ఇతర దేశాల్లో బీడీఎస్ చేసినవారికి రూ.7000 ఫీజుగా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ప్రవేశ విధానం: నీట్-పీజీ కటాఫ్ మార్కులు, ఇతర అర్హతల ఆధారంగా.
దరఖాస్తు సమయంలో అవసరమయ్యే సర్టిఫికేట్లు ఇవే..
సందేహాల పరిష్కారానికి హెల్ప్‌లైన్ సేవలు..
➥ వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842542216, 9059672216 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: tspgmed2023@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.
➥ నిబంధనలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 9490585796, 7901098840 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: knrpgadmission2023@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.
➥ ఫీజు చెల్లింపు సమయంలో సమస్యలు ఎదురైతే 9959101577 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
➥ నిర్దేశిత తేదీల్లో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ALSO READ:
పీజీ డెంటల్ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్, ఆగస్టు 16 వరకు దరఖాస్తుకు అవకాశం
తెలంగాణలో పీజీ డెంటల్ (ఎండీఎస్) కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటాలో ప్రవేశాలకుగాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయస్థాయి అర్హత పరీక్ష నీట్-ఎండీఎస్-2023 అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ ఎండీఎస్ డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆగస్టు 9న ఉదయం 8 గంటల నుంచి 16న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నీట్ పీజీ మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలకు కోరు అభ్యర్థులు నిర్దేశిత దరఖాస్తు పూర్తిచేయడంతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
కాళోజీ హెల్త్ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు, డిగ్రీ అర్హత చాలు
తెలంగాణలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్) కోర్సులో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 13 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత ప్రవేశపరీక్షను ఆగస్టు 27న నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 2న ఫలితాలు వెల్లడించనున్నారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!
IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
IIAD: ఐఐఏడీ-న్యూఢిల్లీలో యూజీ, పీజీ కోర్సులు - వివరాలు ఇలా
IITTP: తిరుపతి ఐఐటీలో ఎంఎస్ రిసెర్చ్ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
World University Rankings 2024: వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్ప్రైజ్ అదిరింది
/body>