News
News
X

NTRUHS: ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ వైద్యవిద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో గతేడాది మొత్తం అందుబాటులో ఉన్న 5060 ఎంబీబీఎస్ సీట్లకు ఈ ఏడాది రాజమహేంద్రవరం జీఎస్ఎల్ కళాశాల, ఏలూరు ఆశ్రమ్ కళాశాలల్లో అదనంగా 50 సీట్లు పెరిగే అవకాశం ఉంది.

FOLLOW US: 
Share:

విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో మెడికల్, డెంటల్, ఆయుష్(ఆయుర్వేద, హోమియో, యునానీ) డిగ్రీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే తిరుపతి పద్మావతి వైద్య(మహిళల) కళాశాలలోని ఎంబీబీఎస్ సీట్లను కూడా భర్తీ చేయనున్నారు.

రాష్ట్రంలో గతేడాది మొత్తం అందుబాటులో ఉన్న 5060 ఎంబీబీఎస్ సీట్లకు ఈ ఏడాది రాజమహేంద్రవరం జీఎస్ఎల్ కళాశాల, ఏలూరు ఆశ్రమ్ కళాశాలల్లో అదనంగా 50 సీట్లు పెరిగే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా రేణిగుంటలో నిర్మించిన వైద్య కళాశాలలో కొత్తగా 150 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతులు వచ్చే అవకాశాలున్నాయి.

వివరాలు..

* ప్రవేశ ప్రటకన 2023-24

1) ఎంబీబీఎఎస్

2) బీడీఎస్

3) ఆయుష్ (ఆయుర్వేద, హోమియో, యునానీ)

అర్హత: ఇంటర్(బైపీసీ) అర్హతతోపాటు నీట్(యూజీ) ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. జనరల్ కేటగిరీ(ఈడబ్ల్యూఎస్)లో 117, ఎస్సీ/ ఎస్టీ/ బీసీ, ఇదే కేటగిరీ(వైకల్యం) ఉన్న వారికి 93, ఓసీ విభాగంలో (వైకల్యం) ఉన్న వారు 105 కటాఫ్ మార్కులు కనీస అర్హతగా నిర్ణయించారు. 

వయోపరిమితి:  అభ్యర్థుల కనీస వయసు 17 ఏళ్లు నిండి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.2,950, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.2,360 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుమును బ్యాంకు కార్డుల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. 

దరఖాస్తు ఇలా..

జాతీయ స్థాయి నీట్(యూజీ) ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అక్టోబర్ 13న ఉదయం 10 గంటల నుంచి అక్టోబరు 20న సాయంత్రం 6 గంటల్లోగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి  డౌన్‌లోడ్‌ చేసుకొని సంబంధిత పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.  అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 89787-80501, సాంకేతిక సమస్యలుంటే 74165-63063కు ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.


ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.10.2022.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2022.

 

MBBS-BDS-AYUSH 2022-23 - Convenor Quota-Notification

MBBS-BDS 2022-23 - Convenor Quota-Prospects & Regulations

AYUSH 2022-23  - Convenor Quota-Prospects & Regulations

Website

 

:: ఇవీ చదవండి ::

KNRUHS: ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభ‌మైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గానూ ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమ‌వారం (అక్టోబరు 10న) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని సూచించారు.
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)-అకడమిక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏఐఎల్‌ఈటీ) 2023 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లలో ఒక్కోదానిలో అయిదు సీట్లను విదేశీ అభ్యర్థులకు మరో అయిదు సీట్లను ఓసీఐ/ పీఐఓ అభ్యర్థులకు; పీహెచ్‌డీలో రెండు సీట్లను విదేశీయులకు ప్రత్యేకించారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

NTSE: ఎన్‌టీఎస్‌ స్కాలర్‌షిప్‌ పథకం నిలిపివేత! కొత్త స్కాలర్‌షిప్ రూ.5 వేలు?
దేశంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్ష (NTSE)'ను కేంద్రం నిలిపివేసింది. కేంద్ర విద్యాశాఖ నుంచి ఆమోదం లభించే వరకు దాన్ని నిలిపివేస్తున్నట్లు  'నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ & ట్రైనింగ్‌' (NCERT) ప్రకటించింది. ఈ ఏడాది స్కాలర్‌షిప్‌ పథకం కొనసాగించాలా? వద్దా? అన్నదానిపై కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని, అందువల్లే ప్రతిభావంతుల ఎంపిక నిమిత్తం నిర్వహించే పరీక్షను నిలిపివేసినట్లు NCERT తెలిపింది.
స్కాలర్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


COVID Scholarships: కొవిడ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్, వీరికి ప్రత్యేకం!! 
ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ ఫౌండేషన్‌ సామాజిక బాధ్యతలో భాగంగా కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల కోసం ‘కొవిడ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ను ప్రకటించింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ చదివే వారు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల నుంచి విద్యార్థుల పరిస్థితిని అంచనావేసి షార్ట్‌లిస్ట్‌ రూపొందిస్తారు. తర్వాత వీరికి టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి, ఎంపికైనవారికి స్కాలర్‌షిప్ అందజేస్తారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌/ పన్నెండోతరగతి/ సాధారణ డిగ్రీ/ ప్రొఫెషనల్‌ డిగ్రీల వరకు చదువుతున్నవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.6లక్షలకు మించకూడదు. సంస్థ ఉద్యోగుల పిల్లలు దరఖాస్తుకు అనర్హులు.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 12 Oct 2022 09:57 PM (IST) Tags: Education News in Telugu NTRUHS Admissiosn Notification NTR Health University Admission Notification NTRUHS MBBS Admissions NTRUHS BDS Admissions NTRUHS Unani Admissions

సంబంధిత కథనాలు

Jagananna Videshi Vidya Deevena : టీడీపీ నేత కుమార్తెకు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఆర్థికసాయం

Jagananna Videshi Vidya Deevena : టీడీపీ నేత కుమార్తెకు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఆర్థికసాయం

Telangana Budget 2023: రాష్ట్రంలో మ‌రో 60 జూనియ‌ర్, సీనియ‌ర్ జిల్లా జ‌డ్జి కోర్టులు - 1,721 పోస్టుల‌ మంజూరు!

Telangana Budget 2023: రాష్ట్రంలో మ‌రో 60 జూనియ‌ర్, సీనియ‌ర్ జిల్లా జ‌డ్జి కోర్టులు - 1,721 పోస్టుల‌ మంజూరు!

Telangana Budget 2023: బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రాధాన్యం, రూ.19,093 కోట్లు కేటాయింపు!

Telangana Budget 2023: బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రాధాన్యం, రూ.19,093 కోట్లు కేటాయింపు!

Telangana Budget 2023: కాంట్రాక్ట్ ఉద్యోగులకు వరాలు, రాష్ట్రంలో మరిన్ని ఐటీ టవర్లు, పరిశ్రమలకు రూ.4,037 కోట్లు! 

Telangana Budget 2023: కాంట్రాక్ట్ ఉద్యోగులకు వరాలు, రాష్ట్రంలో మరిన్ని ఐటీ టవర్లు, పరిశ్రమలకు రూ.4,037 కోట్లు! 

JEE Main Session 1 Result: జేఈఈ మెయిన్‌ సెషన్-1 ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పుడంటే?

JEE Main Session 1 Result: జేఈఈ మెయిన్‌ సెషన్-1 ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

KTR Comments : EV ఇండస్ట్రీలో మూడేళ్లలో రూ. 50వేల కోట్ల పెట్టుబడులు - తెలంగాణకు రానున్నాయన్న కేటీఆర్ !

KTR Comments : EV ఇండస్ట్రీలో మూడేళ్లలో రూ. 50వేల కోట్ల పెట్టుబడులు - తెలంగాణకు రానున్నాయన్న కేటీఆర్ !

Twitter Gold: గోల్డ్ టిక్‌కు నెలకు రూ.82 వేలు - మరో కొత్త స్కీమ్‌తో రానున్న మస్క్!

Twitter Gold: గోల్డ్ టిక్‌కు నెలకు రూ.82 వేలు - మరో కొత్త స్కీమ్‌తో రానున్న మస్క్!

Supreme Court Amaravati Case : ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - త్వరగా చేపట్టాలని ఏపీ న్యాయవాది విజ్ఞప్తి !

Supreme Court Amaravati Case : ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - త్వరగా చేపట్టాలని ఏపీ న్యాయవాది విజ్ఞప్తి !

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!