అన్వేషించండి

AP POLYCET: ఏపీ పాలిసెట్‌-2023 మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 23లోపు రిపోర్టింగ్‌కు అవకాశం

ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి పాలిసెట్‌-2023 కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు ఎట్టకేలకు మొదటి విడత సీట్లను ఆగస్టు 18న అధికారులు కేటాయించారు.

ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి పాలిసెట్‌-2023 కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు ఎట్టకేలకు మొదటి విడత సీట్లను ఆగస్టు 18న అధికారులు కేటాయించారు. అధికారిక వెబ్‌సైట్‌లో కాలేజీ, బ్రాంచీ వారీగా ఎంపికైన విద్యార్థుల జాబితాను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు లాగిన్ వివరాలు నమోదుచేసి సీటు కేటాయింపు నిర్దారించుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలల్లోని డిప్లొమా(ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ) సీట్లను పాలిసెట్‌ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. 

ఏపీలో పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించిన వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆగ‌స్టు 11 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. పాలిసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 14 వరకు ఆప్షన్లను నమోదుచేసుకున్నారు. ఆగస్టు 16న ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న విద్యార్థులకు ఆగస్టు 18న సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 19 నుంచి  23 మధ్య సంబంధిత పాలిటెక్నిక్ కళాశాల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 23 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు మే 25 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 25 నుంచి జూన్‌ 1 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించారు. మే 29 నుంచి జూన్‌ 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. జూన్‌ 1 నుంచి 6 వరకు కళాశాలలు, కోర్సు ఎంపికకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్‌ 7న వెబ్‌ఆప్షన్లలో మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక జూన్ 9న సీట్లను కేటాయించాల్సి ఉండగా... కౌన్సెలింగ్‌ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. తాజాగా కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూలును అధికారులు వెల్లడించారు. 

ఏపీలో మే 10న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పాలిసెట్-2023)ను 61 పట్టణాలలోని 410 పరీక్ష కేంద్రాలలో పాలిసెట్ 2023 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,43,592 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసిన వారిలో 89.56 శాతం మంది విద్యార్ధులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలికలు 63,201 మంది దరఖాస్తు దారుల్లో 55,562 ఉన్నారు. 87.91 శాతం మంది బాలికలు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. 97,128 మంది బాలురకు గాను 88,030మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. 90.63 శాతం మంది పరీక్షలు రాశారు. మే 20న ఫలితాలను విడుదల చేయగా.. ఫలితాల్లో 86.35 శాతం ఉత్తీర్ణులయ్యారు. 

ALSO READ:

వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 17న వాక్‌‌ఇన్‌ కౌన్సెలింగ్‌
తెలంగాణలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో సీట్ల భర్తీకీ ఇప్పటికే నాలుగు విడతల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అన్ని విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 17న యూనివర్సిటీ ఆడిటోరియంలో వాక్‌‌ఇన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. పాలిసెట్‌-2023లో ర్యాంకు పొందిన వారికి ఈ కౌన్సెలింగ్‌లో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తర్వాత పదోతరగతి పాసైన వారికి (పాలిసెట్‌ ర్యాంకు లేకున్నా) రెండో ప్రాధాన్యత ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

TS ICET: టీఎస్ ఐసెట్‌-2023 కౌన్సెలింగ్‌ వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే!
తెలంగాణలో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాపడింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 6, 7 తేదీల్లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తదనంతరం సెప్టెంబరు 8 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు ఎంసీఏ, ఎంబీఏ తొలివిడత సీట్లను సెప్టెంబర్‌ 17న కేటాయించనున్నారు. సెప్టెంబరు 22 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తాంచనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Raghurama Custodial Torture case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna Padma Bhushan | నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ | ABP DesamRing Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP DesamKCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP DesamSS Rajamouli Post on Mahesh Babu | ఒక్క పోస్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Raghurama Custodial Torture case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
Pawan Kalyan: కడపలో ఫ్లెక్సీ వార్, 21తో గేమ్ ఛేంజర్ కాలేము - పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా ఫ్లెక్సీలు దుమారం
కడపలో ఫ్లెక్సీ వార్, 21తో గేమ్ ఛేంజర్ కాలేము - పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా ఫ్లెక్సీలు దుమారం
Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం
Aus Open Champ Sinner: సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
Hyderabad News: 'ఈ కోడిని కోయనంటే కోయను' - ఏ చేస్తానో తెలుసా?, కోడి పుంజుకు వ్యక్తి ఘన సన్మానం
'ఈ కోడిని కోయనంటే కోయను' - ఏ చేస్తానో తెలుసా?, కోడి పుంజుకు వ్యక్తి ఘన సన్మానం
Embed widget