అన్వేషించండి

Armur Crime News: పని ఇచ్చిన వాడి పనే పట్టారు, 30 తులాలు కొట్టేశారు - ఇద్దరి అరెస్ట్, మరో ఇద్దరు పరార్

Armur Crime News: పది రోజుల క్రితం ఆర్మూర్ లో బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తి ఇంట్లో జరిగిన చోరీలో పని వాళ్లే నిందితులు తేలింది. ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీ అయినట్లు పోలీసులు తెలిపారు.

Armur Crime News: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో పది రోజుల క్రితం జరిగిన బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. అతని వద్ద పని చేసే వాళ్లే నిందితులు అని తేల్చారు. ఇందులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పారిపోయినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే నిందితుల నుంచి 18 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 

అసలేం జరిగిందంటే..?

ఆర్మూర్ పట్టణంలో గతనెల 30, ఈనెల 1వ తేదీన రెండు వేర్వేరు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఈ చోరీల్లో సుమారు 300 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దొంగలు దొరికారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఇద్దరు పారిపోయినట్లు వివరించారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఓ వీధిలో బెంగాలీ యువకుడు బుయా అంజన్ బంగారు ఆభరణాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి వద్దే ఆయన ఈ పని చేస్తుంటాడు. అయితే ఇంట్లో ఎక్కువగా బంగారం ఉన్న విషయాన్ని గుర్తించిన పని వాళ్లు.. మహారాష్ట్రలో ఉన్న తమ స్నేహితులకు తెలిపారు. ఎలాగైనా సరే ఆ బంగారాన్ని కొట్టేయాలని పథకం పన్నారు. 


Armur Crime News: పని ఇచ్చిన వాడి పనే పట్టారు, 30 తులాలు కొట్టేశారు - ఇద్దరి అరెస్ట్, మరో ఇద్దరు పరార్

ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన దీపేష్, రాకేష్ గుప్తా, మాలి యామాజి, మరో బాల నేరస్తుడు కలిసి ఆర్మూర్ కు చేరుకున్నారు. వచ్చిన రోజే అంజన్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. మొత్తం 30 తులాల బంగారాన్ని దొంగిలించారు. అనంతరం హైదరాబాద్ చేరుకొని మహారాష్ట్ర పారిపోవాలని ప్లాన్ వేశారు. అయితే ఇంట్లో దొంగతనం జరిగిన విషయం గుర్తించిన అంజన్ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిందితులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సంచరిస్తున్నట్లు తెలుసుకున్నారు. వెంటనే వెళ్లి నలుగురిలో ఇద్దరిని పట్టుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడైన మాలి యామాది పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 18 తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మిగిలిన బంగారం ప్రధాన నిందితుడు మాలి యామాజి వద్ద ఉన్నట్లు నిందితులు చెప్పారని సీపీ నాగరాజు వెల్లడించారు. త్వరలోనే ప్రధాన నిందితుడిని కూడా పట్టుకుంటామని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఆర్మూర్ పోలీసులను సీపీ నాగరాజు అభినందించారు. రివార్డులను కూడా అందజేశారు.

వనస్థలిపురంలో దోపిడీ కేసు..

శుక్రవారం రాత్రి వనస్థలిపురంలో ఓ దోపిడీ కేసు వెలుగుచూసింది. వనస్థలిపురంలోని ఎంఆర్ఆర్ బార్ యాజమాని కలెక్షన్ సొమ్ముతో ఇంటికి బయల్దేరాడు. గుర్తు తెలియని దుండగులు తనను ఫాలో అయ్యి..వెంకట్రామిరెడ్డి బైకును ఢీకొట్టి డబ్బుతో ఎస్కేప్ య్యారనేది స్టోరీ. దోచుకెళ్లిన సొత్తంతా బారు లావాదేవీలకు సంబంధించిందేనని అంతా అనుకున్నారు. బట్..ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ ఇంత భారీ మొత్తంలో లిక్విడ్ క్యాష్ ఎలా ఉంటుందని పోలీసులకు డౌట్ వచ్చింది.కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు తనదైన స్టైల్లో విచారణ మొదలు పెట్టారు. బాధితుడికి తెలిసిన వ్యక్తులే ఇదంతా చేశారనే అంచనాకు వచ్చారు. దర్యాప్తులో బార్ ఓనర్ వెంకట్రామిరెడ్డి కాల్ డేటా, వాట్సప్ హిస్టరీపై ఓ కన్నేశారు. అప్పుడు అసలు గుట్టు బయటపడింది. హవాలా బాగోతం వెలుగులోకి వచ్చింది. బార్ ఓనర్ వాట్సప్ ఆధారంగా హవాలా లింకులు గుర్తించారు పోలీసులు. ఓల్డ్ సిటీకి చెందిన ఫరూఖ్ తో కలిసి వెంకట్రామిరెడ్డి హవాలా చేస్తున్నాడని గుర్తించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget