అన్వేషించండి

Stock Market Shock: శుక్రవారం మార్కెట్లో భారీ నష్టం! TCS పతనం, మీ పోర్ట్‌ఫోలియోపై ప్రభావం?

Stock Market News: శుక్రవారం స్టాక్ మార్కెట్‌ కుప్పకూలింది. ఐటీ కంపెనీల షేర్లు చాలా వరకు నష్టాల బాటలోనే ట్రేడ్ అయ్యాయి.

Stock Market News: శుక్రవారం స్టాక్ మార్కెట్‌ మదుపరులకు చుక్కలు చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, వివిధ రంగాలలో నిరంతర అమ్మకాలతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. చాలా పెద్ద డౌన్‌ఫాల్‌ కనిపించింది. అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా దాదాపు అన్ని షేర్లూ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 688.26 పాయింట్లు లేదా 0.83 శాతం పడిపోయి 82,502.02 (సూచిక ముగింపు) వద్ద స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 205.40 పాయింట్లు లేదా 0.81 శాతం క్షీణించి 25,149.85 వద్ద ముగిసింది. 

1,510 స్టాక్‌లు వృద్ధిని సూచించగా, 2,341 పడిపోయాయి., 150 స్టాక్‌లు మారకుండా స్టేబుల్‌గా ఉన్నాయి. నిఫ్టీ కాంపోనెంట్లలో, అత్యధికంగా నష్టపోయిన వాటిలో టిసిఎస్, బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్,  విప్రో ఉన్నాయి. హెచ్‌యుఎల్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.

BSE మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.6 శాతం క్షీణించాయి. రంగాల వారీగా, FMCG, ఫార్మా - వరుసగా 0.5 శాతం, 0.7 శాతం లాభపడ్డాయి. మిగిలిన అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆటో, ఐటీ, మీడియా, చమురు & గ్యాస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, రియాల్టీ,  టెలికాం రంగాలు ఒక్కొక్కటి 1 శాతం పడిపోయాయి. హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) షేర్లు 5 శాతం పెరిగాయి. అదే టైంలో ఐటి రంగం భారీగా క్షీణించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రధాన స్టాక్‌ల పతనం కారణంగా ఈరోజు మార్కెట్ డీలా పడింది. 

ఏది స్టాక్స్‌ క్షీణించాయి? ఏవి పెరిగాయి?

శుక్రవారం టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) త్రైమాసిక ఫలితాలు ఊహించిన దానికంటే తక్కువగా ఫెర్ఫామ్‌ చేశాయి. దీని కారణంగా ఆ సంస్థ స్టాక్స్‌ దాదాపు 2.75 శాతం పడిపోయాయి. మధ్యాహ్నం సెషన్‌లో నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ కూడా 1 శాతం పడిపోయింది.

మధ్యాహ్నం మార్కెట్ కాస్త కుదటపడి కొన్ని కంపెనీల షేర్లు పెరిగాయి. ఇలా లాభపడిన ఐదు టాప్ కంపెనీలు హిందూస్తాన్ యూనిలీవర్(4.77 శాతం), యాక్సిస్ బ్యాంక్ (0.48 శాతం), సన్ ఫార్మాస్యూటికల్స్ (0.51 శాతం) ఉన్నాయి. 

నష్టాలు చవిచూసిన కంపెనీలు గురించి మాట్లాడుకుంటే TCS టాప్‌లో ఉంటే మరికొన్ని కంపెనీల షేర్లు కూడా నేల చూపులు చూశాయి. అలాంటి వాటిలో మహీంద్రా & మహీంద్రా (2.43 శాతం), బజాజ్ ఫిన్‌సర్వ్ (1.72 శాతం), రిలయన్స్ (1.68 శాతం) ఉన్నాయి.

మార్కెట్ ఎందుకు పడిపోయింది?
ఐటీ నుంచి ఆటో స్టాక్‌ల వరకు విపరీతమైన అమ్మకాల ఒత్తిడిని మార్కెట్ ఎదుర్కొంది. FMCG రంగం మాత్రమే తట్టుకొని నిలబడగలిగింది. పెరుగుదల చూసింది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం"ప్రపంచ అనిశ్చితుల కారణంగా, లార్జ్ క్యాప్ ఐటీ సంస్థల స్టాక్‌లు ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. TCS త్రైమాసిక ఫలితాల తర్వాత ఐటీ స్టాక్‌ల బలహీనత, నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో 1.85 శాతం పతనం పెట్టుబడిదారులను నిరాశపరిచాయి." అని విశ్లేషిస్తున్నారు. 

నిఫ్టీ మిడ్ క్యాప్ 100 కూడా 0.86 శాతం క్షీణించగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 10 కూడా 1.00 శాతం పడిపోయింది. అయితే, ఇండియా VIX స్టాక్స్ 1.90 శాతం పెరిగాయి.

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget