Whatsapp Cashback Offer: వాట్సాప్‌లో నగదు పంపండి.. రూ.51 క్యాష్‌బ్యాక్ పొందండి.. వివరాలు ఇవే!
మీరు వ్యాట్సాప్ వాడుతున్నారా? అయితే ఎవరికైనా నగదు పంపించి క్యాష్ బ్యాక్ పొందండి. నిలకడగా పేమెంట్స్ చేసేవారికి వాట్సాప్ ఓ ఆఫర్ ప్రకటించింది.
వాట్సాప్ యూజర్లకు శుభవార్త! తమ పేమెంట్స్ విధానం ఉపయోగించేందుకు కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది. వాట్సాప్ పేమెంట్స్ ద్వారా లావాదేవీలు చేస్తే రూ.51 క్యాష్‌బ్యాంక్ అందిస్తామని ప్రకటించింది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఎంపిక చేసిన కస్టమర్లు, ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే వర్తించనుంది.
వెర్షన్ ఇదీ
ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.21.20.3 వాడుతున్న యూజర్లకు ఈ ఆఫర్ ప్రమోట్ చేస్తే బ్యానర్ కనిపిస్తోంది. 'నగదు పంపండి.. రూ.51 క్యాష్‌బ్యాక్ పొందండి' అంటూ బ్యానర్ ఫ్లాష్ అవుతోంది. క్రమం తప్పకుండా వాట్సాప్ పేమెంట్స్‌ను ఉపయోగించే వారికి ఈ ఆఫర్‌ను విస్తరించనుంది.
ఎంత పంపించాలంటే?
కనీస మొత్తం ఎంత పంపించాలో వాట్సాప్ చెప్పలేదు. అంటే ఒక్క రూపాయి పేమెంట్ చేసినా రూ.51 క్యాష్‌బ్యాక్ రావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక యూజర్ ఐదుసార్లు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అంటే మొత్తంగా రూ.255 వరకు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకొని సంపాదించొచ్చు.
షరుతులు ఏంటంటే?
ఈ ఆఫర్ వినియోగించుకొనేందుకు వాట్సాప్ ఎక్కువ షరతులేమీ విధించలేదు. అయితే యూజర్ తమ ఖాతా నుంచి ఐదు వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు డబ్బును పంపించాలి. నగదు పంపించగానే క్యాష్‌బ్యాక్ బ్యాంకులో జమ అవుతుంది. తన పోటీదారైన గూగుల్ పేను ఈ ఆఫర్‌తో ఢీకొట్టాలని వాట్సాప్ భావిస్తోంది. గూగుల్ సైతం ఆరంభంలో ఇలాగే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇచ్చి యూజర్లను ఆకట్టుకుంది. రూ.1000 వరకు స్క్రాచ్ కార్డులను ఇచ్చింది. ఇప్పుడు క్యాష్‌బ్యాక్ బదులు డిస్కౌంట్లు, ఇతర కంపెనీల ఓచర్లను ఇస్తోంది.
Also Read: Saving Accounts Interest Rates: సేవింగ్స్ ఖాతాలపై 7 శాతం వడ్డీ కావాలా..! ఈ బ్యాంకుల్లో ఇస్తున్నారు
Also Read: Aadhar Card Updates: ఆధార్ మిస్‌యూజ్ అవుతోందని డౌటా? ఫోన్‌కు ఓటీపీ రావడం లేదా? ఇలా తెలుసుకోండి!
Also Read: Financial Tips: డబ్బు సంపాదించాలంటే ఈ 6 అలవాట్లు చేసుకోండి..! ఆ తర్వాత...!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Because we love to keep it simple:
— WhatsApp (@WhatsApp) October 28, 2021
👏 The Facebook company is now @Meta!
👏 WhatsApp is still @WhatsApp! https://t.co/R9TDn4cMxA