అన్వేషించండి

Deloitte Clean Audit Opnion to VerSe: వర్స్ ఇన్నోవేషన్‌కు డెలాయిట్‌ నుంచి క్లీన్ ఆడిట్ రిపోర్ట్.

VerSe Innovation: ఇండియన్ లాంగ్వేజ్ కంటెంట్ ప్లాట్‌ఫామ్ DailyHunt  మాతృ సంస్థ VerSe  Innovation  కు 2024 ఆర్థిక నివేదికలపై  ప్రముఖ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ నుంచి క్లీన్ ఓపీనియన్ వచ్చింది.

Deloitte Clean Audit Opnion to VerSe: టెక్నాలజీ,  డిజిటల్ కంటెంట్ ప్రొవైడింగ్ ప్లాట్‌ ఫామ్ లు  అయిన డెలీహంట్, జోష్ లకు  మాతృసంస్థ అయిన Verse Innovation 2024 వార్షిక ఆర్థిక నివేదికలపై  Deloitte  క్లీన్ ఒపీనియన్ ఇచ్చింది. కొన్ని నిర్వహణపరమైన లోపాలున్నప్పటికీ.. అవి తమ ఓవరాల్  ఓపీనియన్‌ను ప్రభావితం చేయగలిగినవి కావని డెల్లాయిట్ తన నివేదికలో తెలిపింది. Verse  Innovation లో అంతర్గత నియంత్రణల్లో కొన్ని లోపాలును డెల్లాయిట్ ప్రస్తావించడంతో కంపెనీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది. అయితే మొత్తం మీద ఆర్థిక నిర్వహణ సక్రమంగానే ఉందని డెల్లాయిట్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

తమ ఆర్థిక నివేదికలు నిజమైనవి పారదర్శకంగా ఉన్నాయని క్లీన్ రిపోర్ట్ ద్వారా తేలిందని Verse  సహ వ్యవస్థాపకుడు ఉమాంగ్ బేడీ అన్నారు. "మా కంపెనీలో కొన్ని నియంత్రణలు బలహీనంగా ఉన్నాయని డెల్లాయిట్ చెప్పింది. అయితే ఆ బలహీనతలు సంస్థ ఓవరాల్ ఆర్థిక నివేదికలపై ఎలాంటి ప్రభావం చూపలేదు” అని ఆయన Inc42తో అన్నారు.

ఆడిట్‌ లోపాలు

మార్చి ౩1తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి VerSe Innovationలోని  కొన్ని ఆడిట్ లోపాలను వారి ఆడిటింగ్ సంస్థ డెల్లాయిట్ గుర్తిచింది.  అంతర్గతంగా కొన్ని  “మెటీరియల్ వీక్‌నెస్‌” లు  ఉన్నట్లు డెల్లాయిట్  తమ ఆడిట్ రిపోర్ట్‌లో ప్రస్తావించింది. ఈ లోపాల వల్ల కొన్ని ముఖ్యమైన అకౌంటింగ్ విభాగాలైన నిర్వహణ వ్యయం, వాణిజ్య చెల్లింపులు, ఖర్చుల ఖాతాల్లో  అవకతవకలకు దారితీయొచ్చని హెచ్చరించింది. Verse  లిస్టెడ్ కంపెనీ కాకపోయినా.. డెల్లాయిట్ తన FY 24 ఆర్థిక నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించింది.

కొన్ని ముఖ్యమైన విభాగాల్లో VerSe లో నియంత్రణలు సక్రమంగా లేవని, సప్లయిర్ల ఎంపిక, మదింపు, ఇన్‌వాయిస్ అనుమతులు, కొనుగోలు ఆర్డర్లు, చెల్లింపులపై పర్యవేక్షణ వంటి వాటిలో లోపాలున్నాయని డెల్లాయిట్ రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్‌కు ఇచ్చిన ఆడిట్ నివేదికలో తెలిపింది.

16వేల కోట్ల ఫండింగ్.

VerSe Innovation ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు డైలీ హంట్, జోష్ సంస్థలకు మాతృసంస్థ. 2007 లో కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ 2 బిలియన్ డాలర్లు ( షుమారు 16వేల కోట్లకు పైగా) ఫండింగ్‌ను ఆ సంస్థ సమీకరించింది. ఈ కంపెనీలో కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ CPPIB, ఓంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్, జేమ్స్ ముర్డోక్ లూపా సిస్టమ్స్, Z47( పూర్వపు మాట్రిక్స్ పార్ట్నర్స్) వంటి వాళ్లు కీలకమైన పెట్టుబడిదారులుగా ఉన్నారు.  2022 లో CPPIB నుంచి 8౦5  మిలియన్ డాలర్లు పెట్టుబడి వచ్చాక కంపెనీ విలువ అమాంతం పెరిగిపోయి దాదాపు 40వేల కోట్లకు చేరుకుంది. సంస్థలో అంతర్గతంగా ఉన్న లోపాల గురించి ఆడిటింగ్ సంస్థ తమ ప్రతీ నివేదికలో ప్రస్తావిస్తూనే ఉంది.

నిర్వహణను మెరుగుపరుస్తాం- VerSe

అంతర్గత నిర్వహణ లోపాలను మెరుగు పరుస్తామని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. “అత్యుత్తమ విధానాలపై పూర్తిస్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహించామని.. లోపాలను సవరించడానికి  చెక్‌లిస్టులను కూడా పెట్టామని” ఆ సంస్థ తెలిపింది.  సంస్థాగతంగా ఉన్న లోపాలను గుర్తించడానికి  అన్ని చర్యలను తీసుకుంటున్నామని .. వీటికి అదనంగా... సప్లయిర్ల ఎంపిక, అనుమతులు, ఇన్‌వాయిస్‌లు, చెల్లింపులను పారదర్శకంగా చేసేందుకు సమగ్రమైన Otder to Cash విధానాన్ని తీసుకొస్తున్నామని వెర్స్ పేర్కొంది. ఇది డెలిగేషన్ ఆఫ్ అథారిటీ DOA కి అనుగుణంగా ఉంటుందని చెప్పింది.

ఇన్నిరకాలైన నిర్వహణాపరమైన లోపాలున్నప్పటికీ .. ఈ సమస్యలు VerSe కన్సాలిడేటెడ్ ఆర్థిక నివేదికలు క్లీన్‌ అన్న తమ అభిప్రాయంలో మార్పు లేదని డెల్లాయిట్ తమ ఆడిట్‌ నివేదికలో స్పష్టం చేసింది.

“VerSe Innovation కి చాలా కాలంగా ఆడిటింగ్ సంస్థగా  ఉన్న Deloitte  మా FY24 ఆర్థిక నివేదికలపై చాలా వాస్తవమైన, నిస్పాక్షికమైన నివేదిక ఇచ్చింది. ఈ ఏడాది  మా ఆర్థిక నివేదికలపై క్లీన్ ఓపీనియన్ ఇచ్చింది. అంతర్గత నియంత్రణలపై ప్రతికూల కామెంట్లు చేసినప్పటికీ  మా ఫైనల్ అకౌంట్లపై వాటి ప్రభావం లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. అది వాస్తవం అని” Verse ఓ ప్రకటనలో చెప్పింది.

 

టాప్ హెడ్ లైన్స్

జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
 Jio Maraket Listing: జియో జంబో లిస్టింగ్ రేపే.. రూ.10.3 లక్షల కోట్ల విలువతో స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. మార్కెట్ లో హుషారు
 జియో జంబో లిస్టింగ్ రేపే.. రూ.10.3 లక్షల కోట్ల విలువతో స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. మార్కెట్ లో హుషారు
నవంబర్‌లో బంగారం, స్టాక్ మార్కెట్: జ్యోతిష్య అంచనాలతో పెట్టుబడి వ్యూహం!
నవంబర్‌లో బంగారం, స్టాక్ మార్కెట్: జ్యోతిష్య అంచనాలతో పెట్టుబడి వ్యూహం!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget