అన్వేషించండి

Tomato Price: కిలో టమాట 5 రూపాయలే!

Tomato Price: కామన్‌ మ్యాన్‌కు గుడ్‌న్యూస్‌! రైతన్నకు బ్యాడ్‌ న్యూస్‌! మరికొన్ని రోజుల్లోనే టమాట ధరలు దారుణంగా పడిపోనున్నాయి.

Tomato Price: 

కామన్‌ మ్యాన్‌కు గుడ్‌న్యూస్‌! రైతన్నకు బ్యాడ్‌ న్యూస్‌! మరికొన్ని రోజుల్లోనే టమాట ధరలు (Tomato Price) దారుణంగా పడిపోనున్నాయి. కిలో టమాట ఐదు రూపాయాలకే దొరుకుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే రైతులు నష్టపోయే అవకాశం ఉంది. అయితే మధ్యతరగతి వర్గాలకు మాత్రం ఊరట కలుగుతుంది.

రెండు నెలల క్రితం టమాట ధరలు సంచలనం సృష్టించాయి. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఆకాశాన్ని అంటాయి. కిలో టమాట రూ.300 వరకు పలికింది. కొందరు రైతులైతే లక్షల్లో ఆర్జించారు. అయితే సాధారణ మధ్యతరగతి పౌరుడు మాత్రం ఇబ్బంది పడ్డాడు. వంద రూపాయలు పెట్టినా ఐదు టమాటలకు మించి రాకపోవడంతో ఆందోళన చెందాడు. దాంతో పాటే పచ్చి మిర్చీ ఇతర కూరగాయలు పెరగడంతో జేబుకు చిల్లు పడింది. ఇంటి బడ్జెట్‌ పెరిగి పోయింది.

వేసవిలో విపరీతంగా ఎండలు కొట్టడంతో టమాట దిగుబడి (Tomato Production) తగ్గిపోయింది. అదే సమయంలో కొన్ని చోట్ల అతి వృష్టితో టమాట పంట నాశనమైంది. మరికొన్ని చోట్ల వర్షాలు లేక తోటలు ఎండిపోయాయి. ఉత్తరాదిలో విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో వారం రోజుల్లోనే టమాట రూ.30 నుంచి 300కు చేరుకుంది. ధరల్లో స్థిరత్వం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేపాల్‌ నుంచి టమాటను దిగుమతి చేసుకుంది. దక్షిణాది నుంచి దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా మార్కెట్లకు టమాటాలు తరలించింది.

సాధారణంగా టమాట పంట మూడు నెలల్లో చేతికొస్తుంది. ఇప్పుడిప్పుడే మార్కెట్లకు అధిక స్థాయిలో టమాట వస్తోంది. దాంతో హోల్‌సేల్‌ ధరలు పడిపోతున్నాయి. మైసూర్‌లోని ఏపీఎంసీ మార్కెట్లో ఆదివారం కిలో టమాట రూ.14కు దిగొచ్చింది. శనివారం నాటి రూ.20 నుంచి ఆరు రూపాయలు తగ్గింది. ఇదే సమయంలో బెంగళూరులో కిలో టమాట రూ.30-35 వరకు పలుకుతోంది.

ఈశాన్య రాష్ట్రాల్లో టమాట డిమాండ్‌ తగ్గిపోయింది. అలాగే ఉత్తరాదిలోనూ తక్కువ టమాట వాడుతున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మిగులు టమాట స్థానిక మార్కెట్లకు వస్తోంది. సరఫరా ఇలాగే ఉంటే మరికొన్ని రోజుల్లోనే కిలో ఐదు రూపాయలకు తగ్గిపోతుందని మైసూర్‌ ఏపీఎంసీ సెక్రెటరీ ఎంఆర్‌ కుమారస్వామి అంటున్నారు. ప్రతి రోజూ నిలకడగా 40 క్వింటాళ్ల టమాట వస్తోందని తెలిపారు.

ఒకవైపు టమాట ధర తగ్గిందని సామాన్యులు సంతోషిస్తుంటే రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల్లో స్థిరత్వం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కిలో టమాట పండించడనికి 10-12 రూపాయలు ఖర్చవుతుందని కర్ణాటక రాజ్య రైతు సంఘ జనరల్‌ సెక్రెటరీ ఇమ్మావు రఘు అన్నారు.

ప్యాకేజింగ్‌, రవాణాకు మరో మూడు రూపాయలు అవుతుంది. మొత్తం కిలో టమాటాకు సగటు రూ.14 ఖర్చవుతుంది. అంతకన్నా తక్కువకే మార్కెట్లో ధర పలికితే కష్టమని ఆయన తెలిపారు. 'రైతులకు కిలో టమాటకు 14 రూపాయలే వస్తే భారీగా నష్టపోవాల్సిందే. అందుకే టమాట సేకరణ, ప్యాకేజింగ్‌, నిల్వ, అమ్మకాల ప్రక్రియకు సరికొత్త అప్రోచ్‌ అవసరం' అని ఆయన అంటున్నారు.

Also Read: ఆధార్‌తో బ్యాంక్‌ అకౌంట్‌ హ్యాక్‌ చేయొచ్చా!

టాప్ హెడ్ లైన్స్

Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Embed widget