అన్వేషించండి

Tesla Pi 5G Phone: ఐఫోన్‌ తలదన్నే టెస్లా 'పై' ఫోన్‌, అంగారక గ్రహం నుంచీ కాల్‌ చేయొచ్చు!

ఎలాన్‌ మస్క్‌ కొత్త ఫోన్‌కు "టెస్లా పై ఫోన్ (Pi Phone) లేదా మోడల్ పి (Model P)" అని పేరు పెడతారు.

Tesla Pi 5G Phone: ఇటీవలే బార్ట్న్‌ హెయిర్‌ (Burnt Hair) పేరుతో పెర్‌ఫ్యూమ్‌ రిలీజ్‌ చేసిన టెస్లా (Tesla) కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk), ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ రంగంలోకీ అడుగు పెడుతున్నారు. Tesla Pi 5G ఫోన్‌ని పరిచయం చేయబోతున్నారు. ఎలాన్ మస్క్ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతోందట.

ప్రపంచమంతా చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం, ఎలాన్‌ మస్క్‌ కొత్త ఫోన్‌కు "టెస్లా పై ఫోన్ (Pi Phone) లేదా మోడల్ పి (Model P)" అని పేరు పెడతారు. 

టెస్లా 'పై' ఫోన్ డిజైన్
ఆపిల్ టెక్నాలజీ ప్రొడక్ట్స్‌ కోసం ఇన్నోవేటివ్‌ డిజైన్‌లను అందించిన నిపుణుడు 'ఆంటోనియో డి రోసా' టెస్లా స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్‌ చేశారు. టెస్లా, స్టార్‌లింక్ స్పేస్‌ఎక్స్‌కు ‍‌(Starlink SpaceX - ఎలాన్ మస్క్‌ కంపెనీ) గుర్తు చేసేలా ఫోన్ ఉంటుందని డిజైనర్ చెబుతున్నారు. కొంతమంది టెక్నాలజీ బిజినెస్‌ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం... ఐఫోన్ 12 తరహాలో టెస్లా మోడల్ పై ఫోన్‌ ఉండవచ్చు. ఉదాహరణకు.. గుండ్రటి మూలలు, చతురస్రాకార ఫ్రేమ్‌లో నాలుగు కెమెరాలు, వెండి రంగులో ఉండవచ్చు.

పై ఫోన్ స్పెసిఫికేషన్స్
టెస్లా కార్ల లాగే టెస్లా ఫోన్ కూడా అత్యాధునిక సాంకేతికతతో రాబోతోందట. 6.5 అంగుళాల స్క్రీన్, AMOLED డిస్‌ప్లే, 16 GB లేదా అంతకంటే ఎక్కువ RAM, 1-2 TB నిల్వ సామర్థ్యం సహా ప్రతి స్టాండర్డ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ఇంటర్నెట్
స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌తో ఇవి పని చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా శాటిలైట్ నుంచి నేరుగా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఇదే 'పై' ఫోన్‌ బెస్ట్ సెల్లింగ్ పాయింట్ అవుతుంది. ఒకవేళ మీరు అంగారక గ్రహంపైకి వెళ్తే, ఈ ఫోన్‌లోని స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ద్వారా, భూమిపై ఉన్న వ్యక్తులకు ఫోన్ కాల్స్ కూడా చేయవచ్చట. మార్స్‌ మీద ఒక మానవ కాలనీ నిర్మించుకుంటే, వాళ్లలో వాళ్లు మాట్లాడుకోవడానికీ ఈ ఫోన్‌లోని కనెక్టింగ్‌ టెక్నాలజీ ఉపయోగపడుతుందట. పై ఫోన్‌ అమ్ముడుపోవడానికి ఇంతకంటే కారణం ఇంకే కావాలి?.

న్యూరాలింక్
మీ మెదడుతో అనుసంధానించగలగడం టెస్లా పై ఫోన్‌లో ఉన్న మరో అద్భుత లక్షణం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో న్యూరాలింక్‌ని (Neuralink- ఎలాన్ మస్క్‌ కంపెనీ) చేరుస్తున్నారు. భారీ విక్రయాలను తీసుకొచ్చే మరో గొప్ప అంశం ఇది. Samsung, Apple ఫోన్లలో ఈ టెక్నాలజీ లేదు.

టెస్లా పరికరాలతో అనుసంధానం
ఇది మరో కీ ఫీచర్‌. ఆపిల్‌ వాచ్, iPad, MacBook సహా Apple అన్ని గాడ్జెట్‌లను iPhoneతో అనుసంధానించవచ్చు. టెస్లా పై ఫోన్‌కు కూడా ఇలాంటి సామర్థ్యం ఉందట. టెస్లా ప్రొడక్ట్స్‌ అన్నింటినీ పై ఫోన్‌కు అనుసంధానించవచ్చు. టెస్లా ఎలక్ట్రిక్ కార్‌ను స్మార్ట్‌ఫోన్ నుంచి ఆపరేట్ (లాక్‌, అన్‌లాక్‌ సహా కొన్ని పనులు) చేయడానికి టెస్లా పై ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుమతిస్తుంది.

సోలార్ పవర్ ద్వారా ఛార్జ్
టెస్లా పై ఫోన్‌లో మరో అత్యాధునిక ఫీచర్‌ ఇది. పై ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఎండ ఉన్న ప్రాంతానికి వెళితే చాలు. కరెంటు కోసం ఎదురు చూడడం, ఛార్జింగ్ పోర్ట్‌ల వెతుక్కోవడం చేయాల్సిన అవసరమే ఉండదు.

క్రిప్టో మైనింగ్
వినియోగదారులు పై స్మార్ట్‌ఫోన్‌ ద్వారా క్రిప్టో కరెన్సీ 'మార్స్‌కాయిన్‌'ను (Marscoin) మైనింగ్ చేయవచ్చట. ఫలితంగా, తమ ఫోన్లలోనే వర్చువల్ కరెన్సీని పొందుతారట. 

పైన చెప్పిన విషయాలన్నీ ప్రపంచ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్స్‌ మాత్రమే. టెస్లా కంపెనీ అధికారికంగా ఎలాంటి బహిరంగ ప్రకటన విడుదల చేయలేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
PAN 2.0 - Aadhaar: పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
RBI Governor Salary: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
Embed widget