అన్వేషించండి

Tata Group IPOs: స్టాక్ మార్కెట్‌లో టాటా గ్రూప్‌ ప్రకంపనలు, వచ్చే మూడేళ్లలో 8 IPOలు!

ప్రస్తుతం టీసీఎస్ భారత స్టాక్ మార్కెట్‌లో రెండో అతి పెద్ద కంపెనీగా అవతరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మాత్రమే దీని కంటే ముందుంది.

Tata Group IPOs: దాదాపు రెండు దశాబ్దాల అతి సుదీర్ఘ విరామం తర్వాత, టాటా గ్రూప్ నుంచి కొత్త IPO ఇటీవల వచ్చింది. ఇకపై, ఈ గ్రూప్‌ కంపెనీలు దశాబ్దాల నిశ్శబ్ధాన్ని బద్దలు కొట్టడమే కాదు, కొత్త రికార్డులనూ సృష్టించవచ్చు. మార్కెట్‌ వర్గాలు చెబుతున్న మాట నిజమే అయితే, రాబోయే కొన్ని సంవత్సరాల్లో టాటా గ్రూప్ నుంచి చాలా IPOలు మార్కెట్‌లో ప్రకంపనలు పుట్టించవచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఈ గ్రూప్ కార్యకలాపాలు రికార్డు స్థాయికి చేరుకోవచ్చు.

ఈ కంపెనీల నుంచి IPOలు!
రాబోయే 2-3 సంవత్సరాల్లో టాటా గ్రూప్‌ నుంచి 6 నుంచి 8 ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్స్‌ (IPOs) మార్కెట్లో చూడవచ్చని ET రిపోర్ట్‌ చేసింది. టాటా క్యాపిటల్, బిగ్‌బాస్కెట్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, టాటా డిజిటల్, టాటా బ్యాటరీస్, టాటా ఎలక్ట్రానిక్స్, టాటా ఆటోకాంప్ సిస్టమ్స్, టాటా హౌసింగ్ వంటి పేర్లతో ఆ పబ్లిక్‌ ఆఫర్లు పెట్టుబడిదార్లను అలరించవచ్చు.

నవంబర్‌లో ముగిసిన 2 దశాబ్దాల సుదీర్ఘ విరామం
సుమారు 20 సంవత్సరాల తర్వాత, 5 నెలల క్రితం, టాటా గ్రూప్‌ మొదటి IPO ప్రారంభమైంది. 2023 నవంబర్ చివరిలో టాటా టెక్ సంస్థ తన పబ్లిక్‌ ఆఫర్‌ను లాంచ్‌ చేసింది. దీనికి మార్కెట్లో పెట్టుబడిదార్ల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. రూ. 3000 కోట్ల విలువైన ఈ IPO, 2023 నవంబర్ 22 నుంచి 24 వరకు ఓపెన్‌లో ఉంది, మొత్తం 70 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.

TCS IPO 20 సంవత్సరాల క్రితం వచ్చింది
టాటా టెక్ IPO కంటే ముందు, టాటా గ్రూప్ నుంచి వచ్చిన చివరి IPO టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌ (TCS). TCS IPO 20 సంవత్సరాలకు ముందు, 2004 జులైలో లాంచ్‌ అయింది. ప్రస్తుతం టీసీఎస్ భారత స్టాక్ మార్కెట్‌లో రెండో అతి పెద్ద కంపెనీగా అవతరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మాత్రమే దీని కంటే ముందుంది.

దేశంలో అతి పెద్ద వ్యాపార సమూహం
టాటా గ్రూప్ IPO వార్తతో, ఇప్పటికే మార్కెట్‌లో లిస్ట్‌ అయిన గ్రూప్ షేర్లు కూడా ప్రయోజనం పొందుతున్నాయి. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత, గ్రూప్‌లోని వివిధ షేర్ల ధరలు 5 శాతం వరకు పెరిగాయి. వరుసగా 11 రోజులుగా నష్టాలను చవిచూస్తున్న టాటా ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ షేర్ ధర కూడా ఈ రోజు (బుధవారం, 27 మార్చి 2024) 5% లాభపడింది. 

లిస్టెడ్ కంపెనీల పరంగా చూస్తే, టాటా గ్రూప్ భారతదేశంలోని అతి పెద్ద కార్పొరేట్ గ్రూప్. ప్రస్తుతం ఈ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.30 లక్షల కోట్లకు పైగా ఉంది. రూ.30 లక్షల కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మార్కెట్‌ విలువ గల ఏకైక గ్రూప్ ఇది మాత్రమే.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఎవరికీ అందనంత ఎత్తులో ఎల్‌ఐసీ బ్రాండ్‌ విలువ, తలవంచిన ప్రపంచ దిగ్గజాలు

టాప్ హెడ్ లైన్స్

EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Embed widget