By: ABP Desam | Updated at : 06 Jan 2022 03:54 PM (IST)
share Market
Stock Market Update Telugu: ఒమిక్రాన్ భారత ఆర్థిక వ్యవస్థకు మళ్లీ తలనొప్పులు తీసుకొచ్చేలా ఉంది. మూడో వేవ్ భయంతో భారత స్టాక్ మార్కెట్లు నేడు 'బేర్'మన్నాయి. కీలక సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు , ఎఫ్‌ఐఐ, డీఐఐలు తమ వాటాలు ఉపసంహరించడం, ఆసియా మార్కెట్ల నష్టాలు, డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నెగెటివ్ సెంటిమెంట్‌కు దారితీశాయి. చివరి మూడు సెషన్లలో వచ్చిన లాభాలను స్వీకరించడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 609, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 176, బ్యాంక్ నిఫ్టీ 210 పాయింట్ల వరకు నష్టపోయాయి.
క్రితం రోజు 60,223 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,731 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 11 గంటల సమయంలో 59,300 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. దాదాపు 825 పాయింట్లకు పైగా నష్టపోయింది. మధ్యాహ్నం తర్వాత కాస్త కొనుగోళ్లు పెరగడంతో పుంజుకున్న సూచీ 59,781 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 621 పాయింట్ల నష్టంతో 59,601 వద్ద ముగిసింది.
బుధవారం 17,925 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,768 వద్ద మొదలైంది. 17,655 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఒకానొక దశలో 230కి పైగా పతనమైంది. ఆ తర్వాత కాస్త కోలుకొని 17,979 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 179 పాయింట్ల నష్టంతో 17,745 వద్ద ముగిసింది.
బ్యాంక్ నిఫ్టీ ఉదయం విలవిల్లాడింది. 500 పాయింట్ల వరకు పతనమైంది. ఉదయం 37,242 వద్ద ఆరంభమైన సూచీ 37,058 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కాస్త కోలుకొని 37,752 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 210 పాయింట్ల నష్టంతో 37,485 వద్ద ముగిసింది.
నిఫ్టీలో 15 కంపెనీలు లాభాల్లో, 35 నష్టాల్లో ముగిశాయి. యూపీఎల్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో, మారుతి, ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభపడగా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీసెమ్, టెక్ మహీంద్ఆ, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల పాలయ్యాయి.
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్ సెంటిమెంట్ - బిట్‌కాయిన్ 5వేలు జంప్!
Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్ నెక్లెస్‌కు రిపేర్, దాని రేటు తెలిస్తే షాకవుతారు
Stock Market News: 18,600 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్ 223 పాయింట్లు ఫాల్, పెరిగిన రూపాయి
Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!
Forex Trading: మీ ఫారెక్స్ ఫ్లాట్‌ఫామ్ ఒరిజినలా, నకిలీనా? ఈ లిస్ట్‌లో చెక్ చేసుకోండి
2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్
WTC Final 2023: అజింక్య అదుర్స్! WTC ఫైనల్లో హాఫ్ సెంచరీ కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డు!
Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి
Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !