By: ABP Desam | Updated at : 07 Mar 2023 07:52 AM (IST)
Edited By: Arunmali
స్టాక్ మార్కెట్‌కు ఇవాళ హోలీ సెలవు
Stock market holiday: దేశవ్యాప్తంగా హోలీ 2023 (Holi) పండుగ వేడుకల దృష్ట్యా, ఇవాళ (మంగళవారం, 7 మార్చి 2023) స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు.
BSE అధికారిక వెబ్‌సైట్ bseindia.comలో పేర్కొన్న స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా 2023 ప్రకారం.. BSE (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్), NSE (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్) మంగళవారం పూర్తి సెషన్ మూసివేసి ఉంటాయి. కాబట్టి, ఈక్విటీ సెగ్మెంట్ (Equity Segment), ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్ (Equity Derivative Segment), SLB సెగ్మెంట్‌లో (SLB Segment) ఇవాళ ఎలాంటి కార్యకలాపాలు ఉండవు.
హోలీ వేడుకల సందర్భంగా కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్ (Currency Derivatives Segment), ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ సెగ్మెంట్‌లో (Interest Rate Derivatives segment) కూడా ఈ రోజు, అంటే 2023 మార్చి 7న ట్రేడింగ్ నిలిపివేయడం జరుగుతుందని BSE అధికారిక వెబ్‌సైట్ bseindia.comలో పేర్కొన్న స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా వెల్లడిస్తోంది.
కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్‌లో ఈవెనింగ్ సెషన్‌లో ట్రేడింగ్
అయితే... కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ (Commodity Derivatives Segment), ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (EGR) సెగ్మెంట్‌లో ట్రేడింగ్ ఇవాళ ఉదయం సెషన్‌లో జరగదు. ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ విభాగంలో ట్రేడింగ్ ఉండదు. సాయంత్రం సెషన్‌లో ట్రేడింగ్ కోసం ఓపెన్ అవుతుంది. అంటే, కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (EGR) సెగ్మెంట్‌లో ట్రేడింగ్ ఈరోజు ఉదయం 9:00 గంటలకు బదులుగా సాయంత్రం 5:00 గంటలకు ఓపెన్ అవుతుంది.
హోలీ తర్వాత, ఈ నెలలోనే వచ్చే శ్రీరామ నవమి (Sri Ram Navami 2023) పండుగ సందర్భంగా కూడా స్టాక్ మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. శ్రీరామ నవమి వేడుకల కోసం, 30 మార్చి 2023న (గురువారం) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఎలాంటి ట్రేడింగ్ జరగదు.
2023 జనవరి 26న, భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ఇవాళ హోలీ సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. ఇవి పోను, 2023 సంవత్సరంలో మరో 13 రోజులు (శని, ఆదివారాలు కాకుండా) స్టాక్ మార్కెట్‌కు సెలవులు ఉన్నాయి.
2023లో, హోలీ తర్వాత స్టాక్ మార్కెట్ పని చేయని రోజులు:
మార్చి 30, 2023 - శ్రీరామ నవమి
ఏప్రిల్ 4, 2023 - మహావీర్ జయంతి
ఏప్రిల్ 7, 2023 - గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14, 2023 - అంబేద్కర్ జయంతి
మే 1, 2023 - మహారాష్ట్ర దినోత్సవం
జూన్ 28, 2023 - బక్రీద్
ఆగస్ట్ 15, 2023 - స్వాతంత్ర్య దినోత్సవం
సెప్టెంబర్ 19, 2023 - వినాయక చవితి
అక్టోబర్ 2, 2023 - గాంధీ జయంతి
అక్టోబర్ 24, 2023 - దసరా
నవంబర్ 14, 2023 - దీపావళి
నవంబర్ 27, 2023 - గురునానక్ జయంతి
డిసెంబర్ 25, 2023 - క్రిస్మస్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SEBI: మ్యూచువల్ ఫండ్స్ నామినేషన్ గడువు పొడిగింపు, మరో 6 నెలలు ఊరట
Stocks to watch 29 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - అదానీ స్టాక్స్‌తో జాగ్రత్త
Gold-Silver Price 29 March 2023: ఇవాళ కూడా తగ్గిన బంగారం ధర, ఇప్పటికీ హై రేంజ్‌లోనే రేటు
Petrol-Diesel Price 29 March 2023: చెమటలు పట్టిస్తున్న చమురు బిల్లు, చుక్క కూడా ముఖ్యమే
UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్ 1 నుంచి ఫీజు!
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్