IT Stocks: ఫారినర్ల మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఐటీ స్టాక్స్, రెండున్నర నెలల్లో రూ.7 వేల కోట్ల షాపింగ్
నిఫ్టీ IT ఇండెక్స్‌లోని 10 పార్టిసిపెంట్స్‌లో తొమ్మిది స్టాక్స్ బెంచ్‌మార్క్ నిఫ్టీ50ని ఓవర్‌టేక్ చేశాయి.
IT Stocks: గత రెండున్నర నెలలుగా, దలాల్ స్ట్రీట్‌లో ఐటీ సెక్టార్‌కు డిమాండ్ పెరిగింది, ఈ స్టాక్స్ నిశ్శబ్దంగా ర్యాలీ చేస్తున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్లు (FIIలు) ఐటీ ప్యాక్‌లో స్థిరంగా షాపింగ్ చేస్తున్నారు.
ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో, రూ.9,154 కోట్లను (ఏప్రిల్‌లో రూ.4,908 కోట్లు, మే నెలలో రూ.891 కోట్లు, జూన్‌లో రూ.3,355 కోట్లు) ఎఫ్‌ఐఐలు వెనక్కు తీసుకున్నారు, ఈ రంగంలో నెట్ సెల్లర్స్‌గా ఉన్నారు. దీనికి విరుద్ధంగా, జులై నుంచి నెట్ బయ్యర్స్‌గా మారి వేల కోట్లు తెచ్చి పోశారు. జులైలో రూ.1,575 కోట్లు, ఆగస్టులో రూ.4,088 కోట్లు, సెప్టెంబర్ 15 వరకు రూ.1,438 కోట్లు కుమ్మరించారు. మొత్తంగా, ఎఫ్‌ఐఐలు జులై నుంచి సెప్టెంబర్ 15 వరకు రూ.7,101 కోట్ల విలువైన ఐటీ షేర్లు కొన్నారు. ఐటీ కంపెనీల మేనేజ్‌మెంట్ల కామెంటరీ & గైడ్‌లైన్స్‌తో ఈ రంగంపై స్పష్టమైన పిక్చర్ ఫారిన్ ఇన్వెస్టర్లకు కనిపించింది. అందువల్లే సెప్టెంబర్ క్వార్టర్‌లో నెట్ బయ్యర్స్‌గా మారారు.
Q2FY24లో, నిఫ్టీ IT ఇండెక్స్‌లోని 10 పార్టిసిపెంట్స్‌లో తొమ్మిది స్టాక్స్ బెంచ్‌మార్క్ నిఫ్టీ50ని ఓవర్‌టేక్ చేశాయి. నిఫ్టీ50 Q2లో 2.3% పెరిగింది. నిఫ్టీ50 ప్యాక్‌లో తాజాగా చేరిన LTIMindtree మాత్రమే వెనుకబడి ఉంది, కానీ అది కూడా గ్రీన్‌లోనే కొనసాగింది.
Q2FY24లో నిఫ్టీ ఐటీ స్టాక్స్ పెర్ఫార్మెన్స్:
ఎంఫసిస్ - 25.41% ర్యాలీ
L&T టెక్నాలజీ సర్వీసెస్ - 16.26% జంప్
పెర్సిస్టెంట్ సిస్టమ్స్ - 15.68% వృద్ధి
కోఫోర్జ్ - 8.34% పెరుగుదల
టెక్ మహీంద్ర - 8.13% గ్రోత్
ఇన్ఫోసిస్ - 7.48%
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ - 6.85% ర్యాలీ
విప్రో - 4.34% జంప్
HCL టెక్నాలజీస్ - 3.94% వృద్ధి
ఎల్‌టీఐ మైండ్‌ట్రీ - 0.24% పెరుగుదల
రైట్ రీసెర్చ్ ఫౌండర్ & ఫండ్ మేనేజర్ సోనమ్ శ్రీవాస్తవ చెబుతున్న ప్రకారం, నిఫ్టీ ఐటీ స్టాక్స్‌లో బౌన్స్ బ్యాక్‌కు కొన్ని కీలక ట్రిగ్గర్లు ఉన్నాయి. వాటిలో మొదటిది... గ్లోబల్ ఐటీ రంగం 2023లో 4.1% వృద్ధితో సిద్ధంగా ఉంది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, క్లౌడ్ సర్వీసులు, సైబర్ సెక్యూరిటీకి పెరుగుతున్న డిమాండ్‌తో ఈ వృద్ధి కొనసాగుతుంది. రెండోది... ప్రస్తుత నిఫ్టీ IT స్టాక్స్ P/E రేషియో 18x వద్ద ఉంది, చారిత్రక సగటు 20x కంటే తక్కువగా ఉంది. పెట్టుబడిదార్లను ఇది ఆకర్షిస్తోంది. మూడోది... బలహీనపడుతున్న రూపాయి విలువ కూడా ఐటీ రంగాన్ని బలపరుస్తోంది.
గత రెండున్నర నెలలుగా ఐటీ రంగంలోకి ఎఫ్‌ఐఐ ఇన్‌ఫ్లోస్ స్థిరంగా కొనసాగడాన్ని బట్టి చూస్తే... ఈ రంగం దీర్ఘకాలిక సామర్థ్యంపై విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసం ఉందన్న విషయం అర్ధమవుతుందని సోనమ్ శ్రీవాస్తవ చెబుతున్నారు.
బ్రోకరేజీలు IT ప్యాక్ దీర్ఘకాలిక దృక్పధంపై పాజిటివ్‌గా ఉన్నాయి. FY25లో ఈ రంగం రెండంకెల వృద్ధిని సాధిస్తుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.
ఇప్పుడు IT స్టాక్స్‌ను కొనాలా, వదిలేయాలా?
ప్రస్తుతం IT స్టాక్స్ రేట్లు పైకి మూవ్ అయ్యాయి, కాబట్టి తక్కువ ధరలో దొరకవు. కానీ, ఈ కంపెనీల నిర్వహణ బాగుంటోంది కాబట్టి మొత్తం పోర్ట్‌ఫోలియోకు మంచి రక్షణను అందించగలవన్నది నిపుణుల మాట. అదే సమయంలో జాగ్రత్తగా కూడా వ్యవహరించాలని చెబుతున్నారు. సాంకేతికతపై ప్రపంచం ఆధారపడడం పెరుగుతోంది కాబట్టి మంచి అవకాశాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. మార్కెట్ డైనమిక్స్, గ్లోబల్ ఈవెంట్స్ వల్ల స్వల్పకాలంలో పనితీరు ప్రభావితం కావచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఏడు నెలల కనిష్టంలో పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial