అన్వేషించండి

Cyber Crime: మార్కెట్లో కొత్త స్కామ్ - మొదట డబ్బు వస్తుంది, వెంటనే ఖాతా ఖాళీ అవుతుంది!

UPI Deposit Scam: సైబర్ మోసగాళ్లు అక్రమంగా డబ్బు సంపాదించడానికి డబ్బునే ఎరగా వాడుతున్నారు. మొదట మీకు కొంత డబ్బు పంపుతారు, వెంటనే మీ అకౌంట్‌ ఖాళీ చేస్తారు.

Jumped Deposit Scam: సైబర్ మోసగాళ్లు రోజురోజుకు కొత్త తరహా మోసాలను కనిపెడుతున్నారు, సెకన్ల వ్యవధిలో ప్రజల డబ్బును దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. సామాన్య ప్రజలను ఎలాగైనా ట్రాప్ చేయడమే వాళ్ల లక్ష్యం. అన్నీ తెలిసి కొందరు, తెలియక మరికొందరు సైబర్‌ క్రైమ్‌ బాధితులుగా మారుతున్నారు. ఇప్పుడు, పోలీసులు కొత్త తరహా మోసం గురించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దీనిని "జంప్డ్ డిపాజిట్ స్కామ్‌"గా చెబుతున్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఇలాంటి మోసాలపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయి. 

జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటే ఏంటి?
ఈ స్కామ్‌లో, మోసగాడు, మొదట UPI ద్వారా కొంత డబ్బును (రూ.5,000 వరకు) తాను టార్గెట్‌ చేసిన వ్యక్తి ఫోన్‌ నంబర్‌కు పంపుతాడు. ఆ వ్యక్తి ఖాతాలోకి డబ్బు క్రెడిట్‌ అయిన వెంటనే, దానికి సంబంధించిన SMS కూడా మొబల్‌ నంబర్‌కు వస్తుంది. సాధారణంగా ఇలాంటి మెసేజ్‌లు వచ్చిన వెంటనే ప్రజలు తమ బ్యాంక్‌ ఖాతాలో బ్యాలెన్స్‌ చెక్ చేసుకుంటారు. బ్యాలెన్స్‌ చెక్‌ చేయడానికి UPI పిన్‌ ఎంటర్‌ చేస్తారు. ఇలా చేసిన వెంటనే ఆ ఖాతాలో ఉన్న డబ్బు మాయమైపోతుంది. అంటే, సైబర్‌ నేరగాళ్లు వెంట్రుక వేసి కొండను లాగుతారు, దాదాపుగా సక్సెస్‌ అవుతారు.

యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేస్తే డబ్బులు ఎలా పోతాయి?
సైబర్‌ నేరగాళ్లు, తాము టార్గెట్‌ చేసిన వ్యక్తి ఖాతాకు కొంత డబ్బు పంపడంతో పాటు అతని ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా రిక్వెస్ట్‌ కూడా పంపుతారు. ఈ విషయం బాధితుడికి తెలీదు. బాధితుడు, తన ఖాతా బ్యాలెన్స్‌ను చెక్‌ చేయడానికి యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేసిన వెంటనే, డబ్బు విత్‌డ్రా చేయాలన్న మోసగాళ్ల రిక్వెస్ట్‌కు ఆమోదం లభిస్తుంది. అప్పుడు సైబర్‌ కేటుగాళ్లు ఆ వ్యక్తికి పంపిన డబ్బుకు అనేక రెట్లు మొత్తాన్ని సులభంగా దోచుకుంటారు. తెలీని నంబర్‌ నుంచి డబ్బు క్రెడిట్‌ అయినట్లు వచ్చే SMSల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాంటి నోటిఫికేషన్‌లు వచ్చిన వెంటనే తమ ఖాతాలో యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

నేరానికి అడ్డుకట్టే వేసే పరిష్కారాలు
అనుమానాస్పద నోటిఫికేషన్‌ లేదా SMS వచ్చినట్లు ప్రజలు గుర్తిస్తే, ప్రజలు కనీసం 15 నిమిషాల వరకు యూపీఐ వాడకుండా జాగ్రత్త పడాలి. ఇలా చేస్తే, డబ్బు విత్‌డ్రా కోసం సైబర్‌ కేటుగాళ్లు పంపిన రిక్వెస్ట్‌ కాల పరిమితి ముగుస్తుంది. మీరు తక్షణం UPI వాడాల్సి వస్తే, మొదటిసారి తప్పుడు యూపీఐ పిన్‌ను ఎంటర్‌ చేయాలి. ఇలా చేస్తే, సైబర్‌ కేటుగాళ్ల విత్‌డ్రా రిక్వెస్ట్‌ రద్దు అవుతుంది. అప్పుడు మీరు సరైన పిన్‌ ఎంటర్‌ చేసి మీ లావాదేవీలు కొనసాగించవచ్చు. 

నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఈ స్కామ్‌పై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. ఎలాంటి సైబర్‌ క్రైమ్‌ జరిగినా, మోసపోయిన వ్యక్తి, సంఘటన జరిగిన అరగంట లోపే సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో, బ్యాంక్‌లో ఫిర్యాదు చేయాలి. తొలి అరగంటలో ఫిర్యాదు వల్ల, కోల్పోయిన డబ్బును తిరిగి రాబట్టే అవకాశాలు పెరుగుతాయని పోలీసులు వెల్లడించారు.

మరో ఆసక్తికర కథనం: హ్యుందాయ్‌ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్‌ చేసిన IPOల లిస్ట్‌ 

టాప్ హెడ్ లైన్స్

Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget