News
News
X

Munugode Revant : కమ్యూనిస్టు క్యాడర్ కాంగ్రెస్‌కే ఓటెయ్యాలి - ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న రేవంత్ !

కమ్యూనిస్టు పార్టీల హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆ పార్టీల కార్యకర్తలు మాత్రమే కాంగ్రెస్‌కే ఓటేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. కరోనా నుంచి కోలుకోవడంతో ఆయన మునుగోడులో పర్యటిస్తున్నారు.

FOLLOW US: 


Munugode Revant :  మునుగోడులో కమ్యూనిస్టులు పోటీ చేయకుండా ఇతర పార్టీకి మద్దతవ్వాలని నిర్ణయం తీసుకున్నా.. ఆ పార్టీలకు చెందిన క్యాడర్ మాత్రం కాంగ్రెస్‌కే మద్దతివ్వాలని  టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు.   తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ విముక్తి కలిగించింది. దీనికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు ముందు నిలబడ్డారని గుర్తు చేశారు. కరోనా నుంచి కోలుకున్న ఆయన మునుగోడులో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాల్లోపాల్గొన్నారు.  ఫ్లోరైడ్‌ బూతం నల్గొండ జిల్లాలను పట్టించి పీడించింది. తెలంగాణ వస్తే ఈ పీడ పోతుందని కాంగ్రెస్ భావించింది. ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చింది. తెలంగాణ వచ్చాక నల్గొండ జిల్లా అభివృద్ధి చెందుతుందని అనుకున్నామని..కానీ అలాంటిదేమీ జరగలేదన్నారు.  ప్రాజెక్టుల పూర్తవుతాయని... కాలుష్యం నుంచి విముక్తి అవుతుందని అంతా అనుకున్నారు..అయిత  8 ఏళ్లలో కేసీఆర్ ఈ సమస్యకు పరిష్కారం చూపించలేదన్నారు. 

2014-15 మేనిఫెస్టోలో డబులు బెడ్రూం ఇళ్లు, మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు. పోడు భూముల సమస్య పరిష్కరించలేదు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు. అది కూడా జరగలేదు. రోడ్ల పరిస్తితి అధ్వాన్నంగా ఉంది. తాగు నీటికి పరిష్కారం లభించలేదు. స్వచ్ఛమైన కల్లు ఉంటే ప్రాంతంలో చీప్‌ లిక్కర్‌ను ప్రవేశపెట్టారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.    చేనేత వృత్తులకు ప్రభుత్వం నుంచి సహకారం లబించడం లేదు. గొర్రెలను సరిగా పంపిణీ జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చీప్‌లిక్కర్ తాగి అప్పులు పాలవుతున్నారని విమర్శించారు. 

బీజేపీ ఆదర్శ పురుషుడు కేసీఆర్ అని..   ప్రతిపక్షంలో గెలిచిన వాళ్లను కేసీఆర్ కొనుక్కున్నారు... ఇప్పుడు బీజేపీ అదే చేస్తోందన్నారు.   వికృత చర్యలతో తెలంగాణను ప్రయోగశాలలా మార్చేసారు. కేసీఆర్ చేస్తున్న  నేరాలను బీజేపీ చేస్తోందని..  రాజీనామా ద్వారా అభివృద్ధి చేస్తే బీజేపీ లీడర్లంతా రాజీనామా చేస్తే నిధులు వస్తాయి కదా... అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్లతో రాజీనామా చేస్తే నిధులు ఎలా వస్తాయో చెప్పాలన్నారు.   నిన్న మొన్న రాజీనామా చేసిన స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా రాజీనామా చేయించాలన్నారు.  అమ్ముడు పోయిన నాయకుల ఇంట్లో కాసులు కురిశాయే తప్ప ఎక్కడా అభివృద్ధి పనులైతే జరగలేదు. అందుకే ప్రజలంతా ఆయా ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని స్థానిక యువత డిమాండ్ చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. లేకుంటే మీరు వ్యక్తిగతంగా పార్టీలో చేరినందుకు ఇస్తున్న సొమ్మును ఆయా గ్రామ పంచాయతీ అకౌంట్లో వెయ్యాలన్నారు. వాటిని గ్రామాభివృద్ధికి ఉపయోగించాలన్నారు. 

బీజేపీ, టీఆర్‌ెస్‌ తోడు దొంగలుగా మారి.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని రేవంత్ విమర్శించారు.  ప్రజలకు మేలు జరగాలంటే... కాంగ్రెస్‌కు అండగా నిలబడాలన్నారు.  పాలమూరు రంగారెడ్డికి జాతీయహోదా,,డిండీకి ఐదువేల కోట్లు ప్రకటిస్తే నల్గొండ జిల్లాలో ప్రతి తండాకు నీళ్లు వస్తాయి. ఇక్కడే కూర్చొని ఎస్‌ఎల్బీసిని పూర్తి చేస్తానన్న కేసీఆర్‌ ఏం చేశారని ప్రశ్నించారు.  తాము సగానికిపైగా పూర్తి చేసిన ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదన్నారు.   పా  డబుల్ బెడ్రూం ఇళ్లు పోడుభూముల సమస్యలను పరిష్కరించండి.. మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇచ్చినట్టుగానే ఇక్కడ ముంపు ప్రాంత ప్రజలకు పరిహారం ఇవ్వాలి. ఒక్క ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి... నిధుల కోసం అంటూ రాజీనామా చేయించారు కదా... మండల, జిల్లా, గ్రామ ప్రజాప్రతినిధులృతో కూడా రాజీనామా చేయించాలన్నారు.  

బీజేపీలో కండువా కప్పుకున్నప్పుడే పండుగ... తర్వాత బాత్రూమ్‌లోకి వెళ్లి గుక్కపెట్టి ఏడ్చి... తర్వాత చల్లటి నీళ్లతో మొహం కడుక్కొని నవ్వుతూ వస్తారని కేటీఆర్ సెటైర్ వేశారు.   అంతే సుమిత్రామహాజన్, అద్వాని, వెంకయ్య పరిస్థితి ఏమైందో చూశామన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...  స్థానిక నాయకత్వంతో మాట్లాడుతున్నారు.. కచ్చితంగా ఆయన ప్రచారంలో ఉంటారని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. 

Published at : 20 Aug 2022 01:47 PM (IST) Tags: Nalgonda Revanth Reddy Munugodu By-Election Communist parties

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 3 October: పెట్రోల్, డీజిల్ ధరల మంట! నేడు చాలా చోట్ల రేట్లు పైపైకి

Petrol-Diesel Price, 3 October: పెట్రోల్, డీజిల్ ధరల మంట! నేడు చాలా చోట్ల రేట్లు పైపైకి

Gold-Silver Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్! నేడు గోల్డ్, సిల్వర్ రేట్లలో కాస్త ఉపశమనం

Gold-Silver Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్! నేడు గోల్డ్, సిల్వర్ రేట్లలో కాస్త ఉపశమనం

Jawa 42 Bobber: సింగిల్ సీటర్-అదిరిపోయే లుక్, జావా నుంచి సరికొత్త బైక్ రిలీజ్!

Jawa 42 Bobber: సింగిల్ సీటర్-అదిరిపోయే లుక్, జావా నుంచి సరికొత్త బైక్ రిలీజ్!

Petrol-Diesel Price, 2 October: తగ్గుతున్న క్రూడాయిల్ ధర - మన దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే

Petrol-Diesel Price, 2 October: తగ్గుతున్న క్రూడాయిల్ ధర - మన దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? నేటి ధరలు ఎంతో ఇక్కడ తెలుసుకోండి

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? నేటి ధరలు ఎంతో ఇక్కడ తెలుసుకోండి

టాప్ స్టోరీస్

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!