Shaktikanta Das on Crypto: క్రిప్టో కరెన్సీపై మరోసారి ఆర్బీఐ గవర్నర్ షాకింగ్ కామెంట్స్! సంక్షోభం తప్పదంటూ..!
Shaktikanta Das on Crypto: ప్రైవేటు క్రిప్టో కరెన్సీలతోనే తర్వాతి ఆర్థిక సంక్షోభం సంభవిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. వాటిని నిషేధించాలన్న మాటకే కట్టబడి ఉంటానన్నారు.
Shaktikanta Das on Crypto:
ప్రైవేటు క్రిప్టో కరెన్సీలతోనే తర్వాతి ఆర్థిక సంక్షోభం సంభవిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. వాటిని నిషేధించాలన్న మాటకే తాను కట్టబడి ఉంటానని స్పష్టం చేశారు. బిజినెస్ స్టాండర్డ్ నిర్వహించిన బీఎఫ్‌ఎస్‌ఐ ఇన్‌సైట్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. క్రిప్టో కరెన్సీలకు ఎలాంటి చట్టబద్ధత, అండర్ లైయింగ్ విలువ ఉండదని వెల్లడించారు. స్థూల ఆర్థిక వ్యవస్థ, స్థిరత్వానికి ఇవి చేటు చేస్తాయని కుండబద్దలు కొట్టారు.
క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ ఎప్పట్నుంచో కఠినంగా వ్యవహరిస్తోంది. వాటిని నిషేధించాలని గవర్నర్ శక్తికాంత దాస్ ప్రభుత్వానికి నివేదిక అందించారు. కరెన్సీగా వాటికి చట్టబద్ధత కల్పిస్తే ఆర్థిక వ్యవస్థకు ముప్పు తప్పదని హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. క్రిప్టో కరెన్సీతో పోరాడేందుకే ఆర్బీఐ సొంతంగా డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చింది. ప్రస్తుతం నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనుంది.
డిజిటల్ కరెన్సీలపై సంపూర్ణ సమాచారం లేదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ.రవి శంకర్ ఈ మధ్యే అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం తప్పుదోవ పట్టించేలా ఉందని, వీటి గురించి అవగాహన కలిగించేందుకు సరైన నిబంధనలు రూపొందించాల్సి ఉందని పేర్కొన్నారు. క్రిప్టో నియంత్రణకు బోర్డులో ఏక విధాన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలని తెలిపారు.
'పూర్తి స్థాయిలో డేటా లేదు. ఇప్పుడున్న సమాచారం తప్పుదోవ పట్టించేలా ఉంది. పూర్తి డేటా లేకుండా నియంత్రణ, నిబంధనలు రూపొందిస్తే రోగం ఒకటైతే మందు మరొకటి ఇచ్చినట్టు అవుతుంది' అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సమావేశంలో రవిశంకర్ అన్నారు. పరిష్కారం కోసం సరైన, నమ్మదగిన సమాచారం సేకరించాల్సి ఉందన్నారు.
కొన్నాళ్లుగా క్రిప్టో మార్కెట్ ఒడుదొడుకులకు లోనవుతోంది. దీంతోనే ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో ఎక్స్‌ఛేంజీ దివాలా తీసింది. దాదాపుగా 90 శాతం క్రిప్టో కరెన్సీల్లో లిక్విడిటీ తక్కువగా ఉంది. ట్రేడింగ్ వాల్యూమ్ పడిపోతోంది. కేవలం 2 శాతం క్రిప్టో కరెన్సీలకే ఆరోగ్యకరమైన లిక్విడిటీ ఉండటం గమనార్హం. ప్రస్తుతం 153 క్రిప్టోలు మాత్రమే అత్యధిక లిక్విడిటీ, వాల్యూమ్‌తో ట్రేడవుతున్నాయి. 5,886 కాయిన్లు తక్కువ లిక్విడిటీ, వాల్యూమ్‌తో ఉన్నాయని బిట్‌స్టేకర్ తెలిపింది.
Also Read: వీరికి ఐపీఎల్ వేలం లైవ్ స్ట్రీమింగ్ ఉచితం! టైమింగ్, వేదిక వివరాలు మీకోసం!
Also Read: ఈ టిప్స్‌తో ఆదాయ పన్ను భారం తగ్గుతుంది, చాలామందికి తెలీని రూల్స్ ఇవి
RBI Governor Shri Shaktikanta Das at Business Standard BFSI Insight Summit https://t.co/q4MPUSsbQv
— ReserveBankOfIndia (@RBI) December 21, 2022
#RBI Governor @DasShaktikanta in conversation at the Business Standard BFSI Insight Summit 2022 at 11.00 am on December 21, 2022 at https://t.co/O6jCZ4zakQ#rbitoday #rbigovernor #BFSIsummit #insightsummit pic.twitter.com/rorN3i4zGX
— ReserveBankOfIndia (@RBI) December 20, 2022