అన్వేషించండి

Power Exchange Trading Ban: దెబ్బకు దిగొచ్చిన రాష్ట్రాలు! డిస్కమ్‌ బకాయిలు 80% చెల్లించేశారు!

Power Exchange Trading Ban: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన షాకుతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మత్తు వదిలింది! డిస్కమ్‌లకు చెల్లించాల్సిన బకాయిలు ఒక్కరోజులోనే 80 శాతం తగ్గిపోయాయి.

Power Exchange Trading Ban: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన షాకుతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మత్తు వదిలింది! డిస్కమ్‌లకు చెల్లించాల్సిన బకాయిలు ఒక్కరోజులోనే 80 శాతం తగ్గిపోయాయి. శుక్రవారం రూ.5100 కోట్లుగా ఉన్న బకాయిలు శనివారానికి రూ.1,037 కోట్లకు తగ్గాయని ఎకనామిక్‌ టైమ్స్‌ తెలిపింది. కొందరు డబ్బులు చెల్లించగా, ఇంకొందరు వివాద పరిష్కారం మార్గం ఎంచుకున్నారని తెలిసింది. కొన్నేళ్లుగా డిస్కమ్‌ల బకాయిలు చెల్లించకపోవడంతో పవర్‌ ఎక్స్‌ఛేంజీల్లో స్వల్ప కాలానికి విద్యుత్‌ కొనుగోలు చేయకుండా కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మణిపూర్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, జమ్ము-కశ్మీర్‌, బిహార్‌, మిజోరం, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌లు విద్యుత్‌ కొనుగోలు, అమ్మకాలు చేపట్టకుండా కేంద్రం నిషేధించింది. ఫలితంగా రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు తీవ్రంగా ఉంటాయని భావించారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భయపడ్డా రాష్ట్రాలు వెంటనే బకాయిలు చెల్లించేశాయి.

మొత్తంగా డిస్కమ్‌లకు రూ.లక్ష కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ఫార్ములాను సిద్ధం చేసింది. 48 విడతల్లో కట్టాలని చెప్పింది. బిహార్‌, మణిపుర్‌, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాలు డబ్బులు చెల్లించాయి. రెగ్యులేటరీ కమిషన్‌ ఆదేశాల మేరకు బకాయిలు తీర్చేశామని మహారాష్ట్ర తెలిపింది. ఇప్పటికైతే తాము చెల్లించాల్సిన బకాయిలేమీ లేవని స్పష్టం చేయడంతో గురువారం అర్ధరాత్రి నుంచి చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, మణిపుర్‌కు విద్యుత్‌ కొనుగోళ్లు, అమ్మకాలకు అనుమతి ఇచ్చింది.

ఇదే సమయంలో ఇండియన్‌ ఎలక్ట్రానిక్‌ ఎక్స్‌ఛేంజీలో (IEX) రియల్‌ టైమ్‌ మార్కెట్‌ (RTM) ధరలు గరిష్ఠానికి చేరుకున్నాయి. గురువారం రాత్రి యూనిట్‌ ధర రూ.7గా ఉండగా శుక్రవారం రూ.12కు చేరుకుంది. ఈ సెగ్మెంట్లో సగటు యూనిటి్‌ ధర రూ.4.16 నుంచి రూ.5.46కు పెరిగింది.

లేఖ రాసిన తెలంగాణ

కేంద్ర నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. శుక్రవారం రియల్‌టైం మార్కెట్‌లో విద్యుత్‌ను కొనుగోలు చేస్తామని ఏపీ ఇంధన శాఖ అధికారులు తెలిపారు. పీక్ డిమాండ్ సమయంలో రోజుకు 10-15 మిలియన్‌ యూనిట్ల కరెంట్ అవసరం అవుతుందన్నారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు మెయిల్‌ ద్వారా విద్యుత్‌ ఎక్స్ఛేంజీకి లేఖ రాశారు. విద్యుత్‌ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు, విక్రయాలకు సంబంధించి తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఏపీ పేరు తొలగింపు 

కేంద్రం విద్యుత్ కొనుగోళ్ల నిషేధంపై ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ స్పందించారు. పవర్‌ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్‌కు ఏపీ ప్రభుత్వం ఎలాంటి బకాయిలు లేదని తెలిపారు. సమాచారం లోపం వల్లే విద్యుత్‌ కొనుగోళ్ల నిషేధిత జాబితాలో ఏపీని చేర్చారని తెలిపారు. విద్యుత్‌ క్రయవిక్రయాల విషయంలో కేంద్రం విధించిన నిషేధం ఏపీకి వర్తించదన్నారు. ఏపీ డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.350 కోట్లు చెల్లించేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్లడంతో ఆ జాబితా నుంచి ఏపీ పేరు తొలగించారని విజయానంద్‌ తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
EPFO Update 2026: లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 
లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 
Post Office Scheme: ప్రధాని మోదీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టారు! వడ్డీ నుంచే లక్షలు సంపాదిస్తున్నారు!
ప్రధాని మోదీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టారు! వడ్డీ నుంచే లక్షలు సంపాదిస్తున్నారు!
Maggi Size: మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!
మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Rao Bahadur Collections Day 1: ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
How Car Airbags Work: ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
Mavigun Vs Amaravati: అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
Honda కార్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్ - Elevate, Amazeపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్లు
కొత్త కారు కొనేవాళ్లకు బంపర్ ఆఫర్‌ - Honda కార్లపై రూ.2 లక్షలకు పైగా బెనిఫిట్స్‌
Telangana Political Narrative : రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
Embed widget