By: ABP Desam | Updated at : 03 Dec 2022 05:35 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీరేట్లు
Post Office vs Banks FD Rate:
నష్టభయం లేకుండా రాబడి పొందాలనుకుంటే ఎవరికైనా మొదట వచ్చే ఆలోచన టర్మ్ డిపాజిట్! ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రేట్స్ హైక్ సైకిల్ నడుస్తోంది. కేంద్ర బ్యాంకులు రెపోరేట్లను పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఫలితంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లూ పెరిగాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు, బంగారంతో పోలిస్తే బ్యాంకుల్లో ఎఫ్‌డీలు చేసేందుకే భారతీయులు ఎక్కువ మక్కువ చూపిస్తారు! ఈ నేపథ్యంలో పోస్టాఫీసు, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, పీఎన్‌బీలో ఎక్కువ వడ్డీ ఎవరిస్తున్నారో చూద్దామా!!
పోస్టాఫీస్: ఇండియా పోస్ట్ నాలుగు కాల పరిమితుల్లో టర్మ్ డిపాజిట్లు ఆఫర్ చేస్తోంది. 1, 2, 4, 5 ఏళ్లు డిపాజిట్ చేసుకోవచ్చు. కనీసం రూ.1000 నుంచి ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. రెండేళ్ల కాలపరిమితితో కూడిన డిపాజిట్లకు పోస్టాఫీసు 5.7 శాతం వడ్డీ ఇస్తోంది. మూడేళ్లకైతే 5.8 శాతం అందిస్తుంది. ప్రతి త్రైమాసికానికి లెక్కించి ఏడాది చివర్లో వడ్డీ జమ చేస్తారు.
భారతీయ స్టేట్ బ్యాంక్: ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ రెండేళ్ల కాలపరిమితితో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 6.25 శాతం వడ్డీ ఇస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ సైతం మంచి వడ్డీనే ఇస్తోంది. రెండేళ్ల ఒక్క రోజు నుంచి మూడేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీని అందిస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంక్: ప్రైవేటు రంగంలో రెండో పెద్ద బ్యాంకు ఐసీఐసీఐ మిగతా వాళ్లకు బలంగా పోటీనిస్తోంది. రెండేళ్ల ఒక్క రోజు నుంచి మూడేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు మరికాస్త ఎక్కువే అందిస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్: రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పంజాబ్ నేషనల్ బ్యాంకు 6.25 శాతం వడ్డీ ఇస్తోంది. సాధారణ పౌరులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు మరింత వడ్డీ ఆఫర్ చేస్తోంది.
ప్రైవేటులోనే ఎక్కువ: పోస్టాఫీసుతో పోలిస్తే ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా ఆర్బీఐ రెపోరేట్లు పెంచుతుండటమే ఇందుకు కారణం. ఎస్‌బీఐ, పీఎన్‌బీ వంటి బ్యాంకులతో పోలిస్తే హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వడ్డీరేటులో మరో 25 బేసిస్ పాయింట్లు ఎక్కువే ఇస్తున్నాయి.
పెనాల్టీకి అవకాశం: ఫిక్స్‌డ్ డిపాజిట్లు మెచ్యూరిటీ తీరిన తర్వాతే విత్‌డ్రా చేస్తేనే పూర్తి వడ్డీని పొందొచ్చు. గడువు తీరక ముందే విత్‌డ్రా చేయాల్సి వస్తే వడ్డీలో 0.5 నుంచి 1 శాతం వరకు బ్యాంకులు పెనాల్టీ విధిస్తాయి. కాగా స్వల్ప కాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రభుత్వం పన్ను విధిస్తుంది. ఐదేళ్ల ఎఫ్‌డీలపై పన్ను మినహాయింపు లభిస్తోంది.
Also Read: డబ్బు ఖర్చు లేకుండా బీమా- కట్టిన ప్రీమియాన్ని తిరిగిచ్చే 'జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్'
Also Read: లక్ష రూపాయల్ని రూ.14 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ షేరు!
Gold-Silver Prices Today 10 Dec: అమాంతం పెరిగిన బంగారం, వెండి నగల రేట్లు - ఈ రోజు గోల్డ్, సిల్వర్ కొత్త ధరలు ఇవీ
Bima Sakhi Yojana: 10వ తరగతి పాసైతే చాలు, మహిళలు ఇంట్లో కూర్చుని వేలల్లో సంపాదించొచ్చు! - కొత్త స్కీమ్ ప్రారంభం
Aayushman Card Hospital List: ఏయే ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ కార్డ్‌తో రూ.5 లక్షల ఉచిత చికిత్స పొందొచ్చు?
Free Meal in Railway station : విమానం లాగా, రైలు ఆలస్యమైనా 'ఉచితంగా ఆహారం' - చాలామందికి ఈ విషయం తెలీదు
Income Tax: ITR ఫైలింగ్, తప్పుల సవరణకు ఇప్పటికీ ఛాన్స్ - ఆలస్యం చేస్తే జైలుకు వెళ్తారు!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?