By: Arun Kumar Veera | Updated at : 04 Feb 2025 12:49 PM (IST)
దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు ( Image Source : Other )
How to Apply For A Student Credit Card: వ్యక్తిగత ఆర్థిక ప్రపంచంలోకి కొత్తగా అడుగుపెడుతున్న విద్యార్థులకు క్రెడిట్ కార్డులు ప్రయోజనకరంగా ఉంటాయి. చేతిలో డబ్బు లేకున్నప్పటికీ, చదువు సంబంధిత తక్షణ ఖర్చుల కోసం అక్కరకొస్తాయి. అయితే, విద్యార్థులకు ఆదాయం లేకపోవడం లేదా తక్కువ ఆదాయం ఉండడం & క్రెడిట్ చరిత్ర (Credit History) లేకపోవడం వంటి కారణాల వల్ల స్టుడెంట్ క్రెడిట్ కార్డును సులభంగా పొందలేరు. బ్యాంక్‌లు లేదా ఇతర ఆర్థిక సంస్థలు విద్యార్థులకు క్రెడిట్ కార్డును జారీ చేయడానికి సంకోచిస్తాయి. నెలవారీ స్థిరమైన ఆదాయం & మంచి సిబిల్ స్కోర్ (SIBIL Score) ఉన్న వ్యక్తులు చాలా సులభంగా క్రెడిట్ కార్డ్ పొందుతారు.
క్రెడిట్ కార్డ్ దరఖాస్తు చేసుకునే ముందు, ప్రతి విద్యార్థి ఆ కార్డ్ ప్రయోజనాలు & పరిమితుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
స్టుడెంట్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు (Benefits of a student credit card)
- స్టుడెంట్ క్రెడిట్ కార్డ్ చెల్లుబాటు సాధారణంగా ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది.
- కార్డ్ పోయినా లేదా దొంగతనానికి గురైనా దానిని ఉచితంగా రీప్లేస్ చేయవచ్చు లేదా చాలా తక్కువ డబ్బు ఖర్చుతో కొత్తది తీసుకోవచ్చు.
- ఇవి పొదుపును కూడా ప్రేరేపిస్తాయి. ఎందుకంటే, సాధారణంగా, స్టుడెంట్ క్రెడిట్ కార్డ్‌లపై వార్షిక రుసుము (Annual fee) ఉండదు & సభ్యత్వ రుసుము (Membership fee) కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనవసరం లేదు.
- సాధారణ క్రెడిట్ కార్డుతో పోలిస్తే, స్టుడెంట్ క్రెడిట్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియలో తక్కువ పేవర్ వర్క్ ఉంటుంది.
- స్టుడెంట్ క్రెడిట్ కార్డును జాగ్రత్తగా ఉపయోగించడం వల్ల ఆ విద్యార్థి క్రెడిట్ స్కోరు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.
స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ పరిమితులు (Limits of a student credit card)
- సాధారణ క్రెడిట్ కార్డులతో పోలిస్తే స్టుడెంట్ క్రెడిట్ కార్డులు ఖర్చు పరిమితి చాలా తక్కువగా ఉంటుంది
- స్టుడెంట్ క్రెడిట్ కార్డ్‌పై వడ్డీ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది.
- కొన్ని స్టుడెంట్ క్రెడిట్ కార్డులకు తక్కువ మొత్తంలోనైనా వార్షిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది
- లేట్ పేమెంట్లపై ఎక్కువ ఛార్జీలు ఉంటాయి లేదా కొన్ని కార్డుల్లో హిడెన్ ఛార్జీలు కూడా ఉంటాయి.
స్టుడెంట్ క్రెడిట్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు (Who can apply for a student credit card?)
- కనీసం 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల విద్యార్థులు
- కళాశాల లేదా విశ్వవిద్యాలయం (College or University)లో చదువుతున్న వ్యక్తులు
స్టుడెంట్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు (Documents required to apply for a student credit card)
- వ్యక్తిగత గుర్తింపు రుజువుగా పాన్ కార్డ్, ఓటరు కార్డ్ లేదా ఆధార్ కార్డ్
- చిరునామా రుజువుగా ఆధార్ కార్డు లేదా ప్రభుత్వం ఆమోదించిన నివాస రుజువు పత్రం
- జనన ధృవీకరణ పత్రం లేదా పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్
- కళాశాల లేదా విశ్వవిద్యాలయం జారీ చేసిన విద్యార్థి గుర్తింపు కార్డ్ (Student ID card)
ఈ గుర్తింపు కార్డ్‌ల జిరాక్స్‌లను స్టుడెంట్ క్రెడిట్ కార్డ్ దరఖాస్తు ఫారంతో పాటు సమర్పించాలి.
మరో ఆసక్తికర కథనం: పసిడిపై ఆశలు వదిలేసుకోవాల్సిందే, భారీగా పెరిగిన రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Life Insurance : ఉద్యోగులకు గుడ్ న్యూస్, PF ఉంటే చాలట.. 7 లక్షల ఉచిత బీమా, పూర్తి వివరాలివే
Accidental Insurance : ఏడాదికి 20 కడితే.. యాక్సిడెంటల్ కవరేజ్ కింద 2 లక్షలు పొందొచ్చు, పూర్తి డిటైల్స్ ఇవే
EMI Break without CIBIL effect : ఈఎంఐ కట్టలేకపోతే ఇలా బ్రేక్ తీసుకోండి? CIBILపై ఎఫెక్ట్ పడకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్
Nifty 50: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య US బాంబు దాడులతో భారతీయ స్టాక్ మార్కెట్ కుదేలు
Group Accident Insurance : పోస్టాఫీసులో నెలకి 62 కడితే..15 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పొందొచ్చు, పూర్తి వివరాలివే
Hyderabad News: కూకట్‌పల్లిలో కల్తీ కల్లు ఘటనలో ఇద్దరు మృతి.. బాధితులను పరామర్శించిన మంత్రి జూపల్లి
YS Jagan Chittoor Tour: కార్యకర్తని పరామర్శించేందుకు యత్నించిన జగన్, కాన్వాయ్ దిగకుండా అడ్డుకున్న చిత్తూరు ఎస్పీ
Gujarat Bridge Collapse: గుజరాత్‌లో ఒక్కసారిగా కూలిన వంతెన- నదిలో పడిపోయిన వాహనాలు, 8 మంది మృతి
Nayanthara: నయనతారకు కొత్త చిక్కులు... లీగల్ నోటీసులు పంపిన 'చంద్రముఖి' నిర్మాతలు... ఎందుకంటే?