By: ABP Desam | Updated at : 08 Mar 2023 09:54 AM (IST)
Edited By: Arunmali
మీ బీమా పాలసీని పాన్‌తో లింక్ చేశారా?
LIC Policy PAN Linkage: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నుంచి మీరు గతంలో ఒక పాలసీ తీసుకున్నారా?. అయితే, ఆ జీవిత బీమా సంస్థ మీ కోసమే ఒక ప్రకటన విడుదల చేసింది. పాలసీ కొనుగోలుదార్లు తమ LIC పాలసీని పాన్ కార్డ్‌తో (PAN Card) లింక్ చేయాలని సూచించింది. లేకపోతే, ఆ LIC పాలసీకి సంబంధించి భవిష్యత్‌లో కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని సమాచారం.
2023 మార్చి 31వ తేదీ లోగా (ఈ నెలాఖరు లోగా) మీ ఎల్‌ఐసీ పాలసీని పాన్‌తో జోడించడం తప్పనిసరి అని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. మీరు ఇప్పటి వరకు మీ LIC పాలసీని పాన్‌తో లింక్ చేయకపోతే, ఆ పనిని ఎలా పూర్తి చేయవచ్చో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీ పాలసీని పాన్‌తో అనుసంధానిస్తే, ఆన్‌లైన్ ద్వారా దాని స్థితిని (Status) కూడా తెలుసుకోవచ్చు. పాలసీని లింక్ చేయడానికి లేదా స్థితిని తెలుసుకోవడానికి ఎల్‌ఐసీ కస్టమర్లు కొన్ని సులభమైన స్టెప్స్ ఫాలో అవ్వాలి.
LIC పాలసీ లింక్ స్టేటస్‌ను ముందుగా తెలుసుకోండి
LIC ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను పాలసీ కొనుగోలుదార్లు సందర్శించాలి. లేదా, https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus లింక్ ద్వారా నేరుగా ఆ వెబ్ పేజీలోకి వెళ్లవచ్చు.
ముందుగా.. https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus లింక్‌ను కాపీ చేసి, దానిని గూగుల్ అడ్రస్ బార్‌లో లేదా సెర్చ్ బార్‌లో పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి. లేదా, ఈ లింక్‌ను యథాతథంగా గూగుల్ అడ్రస్ బార్ లేదా సెర్చ్ బార్‌లో టైప్ చేయండి.
ఇప్పుడు, సంబంధిత గడిలో మీ పాలసీ నంబర్‌ను నమోదు చేయండి.
ఆ తర్వాత మీ పుట్టిన తేదీ సమాచారాన్ని పూరించండి.
ఇప్పుడు పాన్ కార్డ్ వివరాలను నమోదు చేయండి. ఆపై క్యాప్చా (Captcha) నింపండి
ఇప్పుడు, మీరు నింపిన వివరాలన్నీ మరోసారి సరి చూసుకుని సబ్మిట్ (Submit) బటన్ మీద ప్రెస్ చేయండి.
ఇప్పుడు PAN లింక్ సమాచారం మీకు కనిపిస్తుంది.
పాన్ కార్డ్ లింక్ కాకపోతే ఏం చేయాలి?
మీ పాన్ కార్డ్ ఎల్‌ఐసీ పాలసీకి లింక్ కాకపోతే, https://licindia.in/Home/Online-PAN-Registration లింక్‌లోకి వెళ్లిండి.
ఇక్కడ కనిపించే ప్రొసీడ్ బటన్ నొక్కండి
ఇప్పుడు మరొక పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పుట్టిన తేదీని నింపండి.
ఆ తర్వాత జెండర్ (ఆడ లేదా మగ) మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ పాన్ నంబర్ నింపండి.
ఆ తర్వాత గడిలో, పాన్ మీద ఉన్న రీతిలోనే మీ పేరును పూరించండి
ఆ తర్వాత మొబైల్ నంబర్, పాలసీ నంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేయండి.
ఇప్పుడు, 'GET OTP' బటన్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని సంబంధిత గడిలో నమోదు చేయండి.
OTPని నమోదు చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద ప్రెస్ చేయండి.
ఇప్పుడు మీ LIC పాలసీ పాన్ కార్డ్‌కి లింక్ అవుతుంది.
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
Year Ender 2025: పాతికేళ్లలో బంగారం కంటే భారీగా వెండి వృద్ధి; రూ.7,900 నుంచి రూ.2.4 లక్షల వరకు!
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Bangladesh Violence : బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!